కార్టూనిస్టులతో తుంటర్వ్యూలు - ..

 

ఇంటర్వ్యూ అయిపోయిందా సాయికృష్ణప్రసాదు   గారూ..?
. ... 'ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు అమితాబ్ బచ్చన్ ' అని మొదలెట్టాక చెప్తాలేండి..!! 

కార్టూన్లతో ఎంతదూరం వెళతారు..?
మాగ్జిమం.

ఏ కూరగాయలు కోసినా మీ కార్టూన్లు కనిపించవేం?
కూరగాయల్లో ఎందుకు కనబడతాయి? నేను మాంసాహారిని 'కోడీ ని కోసి చూడండి.

జాంబవంతుడు రాముడికి మీ కార్టూన్ల గురించి ఎప్పుడు చెప్పాడు..?
మీతో యుద్ధం చేయాలని వున్నదని జాంబవంతుడు అడిగితే దానికి రాముడు " యిప్పుడు కాదు ద్వాపరయుగం లో కృష్ణావతారం లో చేస్తాను. లేదంటే కలియుగం లో నీకు 'సాయి కృష్ణ ప్రసాదు ' కార్టూన్లతో యుద్ధం తప్పదు" అన్నాడు. 

మీ కార్టూన్లు ఆరు దేశాల్లో నిషేధిస్తే, ఏడో దేశంలో ఎప్పుడు నిషేధిస్తారు?
గిన్నీస్ బుక్ ఎక్కడానికి 6 దేశాలు చాలుల్లేండి...!!

మీ కార్టూన్లు వినడానికి బావుంటాయా, తినడానికా..?
'కనడానికీ బావుంటాయి... డెలివరీ కష్టమైన ఆడవాళ్ళకి యిప్పుడు డాక్టర్లు నా కార్టూన్లే ఉపయోగిస్తున్నారు.

ఎవరైనా చరిత్ర తిరగరాయాలంటే మీ కార్టూన్లు తిరగేయాలా..?
'చరిత్ర హీనులూ గా మిగిలిపోవాలంటే నా కార్టూన్లు తప్పక తిరిగేయొచ్చు....!!

మీ కార్టూన్లలోని పాత్రలు మీమీద జరిపిన దాడిలో బాగా గాయపడ్డారా..?
... వారం రోజులతరువాత నిన్ననే డిశ్చార్జ్ అయ్యాను.. హాస్పిటల్ నుండి..

హోటల్ కెళ్ళినప్పుడల్లా మీ కార్టూన్ల బిల్లెంతవుతుంది..?
ఏమో నాకేం తెల్సు.. నా కార్టూన్లు చూసిన మైకం లో బిల్లు సర్వర్ గాడే పే చేస్తాడు.

మీ కార్టూన్లు అందరూ చూస్తారని భయం కలగదా..?
ఆ భయం తోనే ఈ మధ్య కొంత కాలం గా మానేశాను.

మునుల మీద కార్టూన్లు వేసినందుకు, వచ్చే జన్మలో మీరొక మునిగా పుడితే..?
'రంభా తో ఐటం సాంగ్ వేసుకుంటాను..!!

సినిమాల కంటే మీ కార్టూన్లే రుచిగా ఉంటాయా..?
అవును మరి నా కార్టూన్లలో ' ఉప్పుందీ..!!

ఎవరి మీద కసితో కార్టూన్లు గీస్తున్నారు..?
నాకంటే తెల్లగా వున్న డ్రాయింగు షీటు మీద  కసితో 

తుంటర్వ్యూ ఎక్కడివరకొచ్చింది..?
అవసాన దశకొచ్చింది. 

మీ కార్టూన్లతో జాగ్రత్తగా వుంటారా..?
చాలా జాగ్రత్తగా వుంటాను అందుకే 'రిటన్ కవరూ పెట్టను...

ఇప్పటివరకూ ఎన్ని కార్టూన్లు ఖర్చు చేసారు..?
ఆదాయానికి మించి..!!

మీ కార్టూన్లు చాలా బాగుంటాయని వాళ్ళూ-వీళ్ళూ చెపితే వినడమే గానీ, మీకు తెలీదా..?
తెలిసినా వినలేక ఛస్తున్నా!!

మీ కార్టూన్లలో సాయి అనే సంతకం లేకపోతే ఎవరికి ప్రమాదం..?
...నా రెమ్యునరేషన్ కి..!!

కార్టూన్ ఎక్కణ్ణుంచి మొదలు పెట్టి ఎటువేపు గీస్తారు..?
... పోలీసు కంట్రోల్ రూం దగ్గర (మా ఆఫీసు దగ్గర) మొదలెట్టి ఎల్.బి నగర్ వైపు ( వైఫు కూడా అక్కడే వుంటుందిలెండి)గీస్తాను.. అందరి మగాళ్ళ  జీవితాలు సముద్రం లోనే (వైఫు) కదా కలిసేది. 

మీ కార్టూన్ల ద్వారా సమాజానికి మీరు చెప్పాలనుకుంటున్న రహస్యమేదైనా ఉందా..?
'రహస్యమా'... ఏది ఆ చెవ్విటుపారేయండి!! 

గోతెలుగులో సాయి గారి ఇంటర్వ్యూ వస్తోంది, మీరు జవాబులు ఆపేస్తారా..?
మైకు, స్విచ్చులు అన్నీ మీ చేతిలోనే వున్నాయిగా!?

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి