జ్యోతిష్యం విజ్ఞానం - శ్రీకాంత్

శ్రీ గురుభ్యోన్నమః  



జ్యోతిషం కాలగమనాన్ని తెలియజేస్తుందా?

 

ప్రకృతిలో అనేకములైన మార్పులు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఒకసారి మనం ప్రకృతిని నిశితంగా గమనిస్తే ఎన్నో మార్పులు కనిపిస్తూనే ఉంటాయి. మన పూర్వీకులకు భవిష్యత్తును తెలుసుకునేందుకు అలాగే జరుగుతున్న పరిణామాలను తెలుసుకోవడానికి భవిస్యత్తు అవసరమైంది. చంద్రుడు కొన్ని రోజులు కనిపించడం మధ్య,మధ్యలో కనపడకపోవడం అలాగే రోజుకు చంద్రుడు కనిపించే విధానం మారడం అనేది మన పూర్వీకులకు గణనకు దారితీసింది. ఆ మార్పే జ్యోతిషానికి నాంది అయ్యింది. భారతదేశంలో మొదట ఖగోళశాస్త్రమే జ్యోతిషం. రుతువులను అలాగే గ్రహసంచరాలను ఆదారంగా చేసుకొని జ్యోతిషం ముందుకు కొనసాగింది.
 

కాలం ఖగోళం ఆధారంగా నడుస్తుందా ?



మానవునికి కాల గమనం లేకపోతే వాటిని విభజన చేసుకోకపోతే ఏ పని చేయలేం. చంద్రుని గమనాల ఆధారంగా పౌర్ణమి,అమావాస్యలు గురించగలిగారు. ఈ పరిణామక్రమంలో మాసాలు,ఋతువులు ఏర్పడ్డాయి. అక్కడినుండి సంవత్సరకాల గమన జరిగింది. ఆకాశంలో చంద్రుడు సంచరించే గుర్తులు తెలుసుకోవడం కోసం నక్షత్రాలను గుర్తుగా పెట్టుకున్నాడు. వాటికి ఒక ఆకృతిని కల్పించుకున్నాడు వాటి ఆధారంగా ఎన్నో కథలు వచ్చాయి. మానవుడు తన ఆలోచన విధానాన్ని ప్రకృతికి అనుగుణంగా మార్చుకుంటూ వస్తున్నాడు. ఎలా అనగా వర్షాకాలంలో పండ్లు,కాయగూరలతో వేసవి కాలంలో పండ్లరసాలు ,ద్రవరూప ఆహారాలు ఈ విధంగా ఋతువులు వాటి ధర్మాలకు అనుగుణంగా మారుతూ ఉన్నాడు.



కాలం విభజన :



భారతదేశంలో రోజును 60 ఘడుయలుగా విడదీసారు. ఒక ఘడియకు 60 విఘడియలు. అదేవిధంగా ఒక విఘ్దియకు 60 పరగడియలు. పరగడియను తిరిగి సూక్ష్మగడియలుగా విభజన చేసారు. ఏడురోజులను కలిపితే ఒక వారం ఏర్పడుతుంది అని భారతదేశం,బాబిలోనియా, యుడులోను,పూర్వకాలంలో నేటిలాక వారం అనగా ఏడురోజులు కాదు నాలుగు నుండి పదిరోజులు అని అర్థం. వివిధదేశాల్లో వివిధ పద్దతులు ఉండేవి. పశ్చిమఆఫ్రికాలో వారం అంగ 4 రోజులు అని ,యూరపు దేశాల్లో, మధ్య అమెరికాలో 5 రోజులు అని అర్థం వచ్చేది. నేడు మనం వాడుతున్న వారం అనగా 7 రోజులు అనే విధానం మేసపుటోమియాలో వాడుకలో ఉండేది. భూమిమీద మనష్యుల జీవితాలను దిద్దేవి ఆకాశంలోని గ్రహాలు అనే నమ్మకం వారిలో ఉండేది. ఆ పార్తహపు చాల్దీయులకు తెలిసన గ్రహాలు సూర్యుడు,చంద్రుడు,కుజుడు,భుధుడు,గురుడు,శుక్రుడు,శని మొత్తం ఎదుగ్రహాలు ఉండేవి. ఈ విధంగా ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కో రోజుకు అధిదేవతగా నిర్ణయం చేసారు. అప్పటినుండి మనం వరాలను వరుసగా సోమ,మంగళ,బుధ వారాలుగా పిలుస్తున్నాం.      

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి