జ్యోతిష్యం విజ్ఞానం - శ్రీకాంత్

 శ్రీ గురుభ్యోర్నమః

పంచాంగ గణన ఆధారం ఖగోళం పైన ఆధారపడిఉందా?

భారతీయులు ఆధ్యాత్మికతతో పాటు శాస్త్ర విజ్ఞానంలో ఎప్పుడు ఒక మెట్టు పైనే ఉంటారు. అనుక్షణం తమయొక్క వ్యవహరాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఆనాడే సమయాన్ని పంచాంగం రూపంలో వాడేవారు. పంచాంగం అనగా ఐదుఅంగాలు అని అర్థం అవి తిథి,వార, నక్షత్ర,యోగ,కారణాలు. ఆనాడు మన పూర్వీకులు తాయారు చేసుకున్న విజ్ఞానపుస్తకమే పంచాంగం. ఈ పంచాంగం గణన మొత్తం రవి,చంద్రుల గమనం పైన ఆధారపది ఉంటుంది. చంద్రుడు రోజు ఒక కళను పొందుతాడు. రవి,చంద్రుల మధ్య దూరం 12 డిగ్రీలు ఉంటే ఒక కళను పొందుతాడు. ఆ విధంగా రోజుకి చంద్రుడు 12 డిగ్రీలు పెరుగుతూ వరుసగా పాడ్యమి,విధియ,తధియ,చవితి,...... అమావస్య అలాగే పౌర్ణమి లను ఏర్పరుస్తున్నాడు. రవిచంద్రుల మధ్య దూరం 180 డిగ్రీలు ఉంటె పౌర్ణమి ఏర్పడుతుంది. రవిచంద్రులు సమాంతరంగా ఉన్నప్పుడు అమావాస్య ఏర్పడుతుంది. సూర్యుడు తూర్పులో ఉదయిస్తే చంద్రుడు పడమరన ఉదయిస్తాడు. చంద్రుడు ఏర్పరిచే కళల ఆదరంగా చేసుకోని చంద్రమానం ఏర్పడింది. మనం పైన చెప్పుకున్న ప్రతి అంశం ఆకాశంలో వీక్షించే అవకాశం మనకు కలదు.

పంచాంగం గణన ఎలా ?        

తిథి అనగా రవిచంద్రుల మధ్యదూరం 12 డిగ్రీలు. రాశిచక్రంలో మొత్తం 360 డిగ్రీలు కలవు. మొత్తం తిథులు 30. అలాగే కరణం అనగా 6 డిగ్రీల ప్రమాణం అనగా ఒక తిథిలో రెండు కరణాలు ఏర్పడుతాయి. తదుపరి నక్షత్రం నేడు సామాన్యమానవడు కూడా తన యొక్క మాటల్లో విరివిగా వాడే మాట. మొత్తం 360 డిగ్రీల రాశిచక్రం 27 నక్షత్రాలుగా విభజనజరిగింది. నక్షత్ర నిడివి 13.20 డిగ్రీలు. ప్రతి 13. 20 డిగ్రీలకు నక్షత్రం మారుతుంది. నక్షత్ర గణన అశ్విని నక్షత్రంతో మొదలై రేవతితో పూర్తిఅవుతుంది. చంద్రుడు ప్రతిరోజు నక్షత్రాలను ఆధారంగా చేసుకొని ప్రయాణం చేస్తుంటాడు. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రాన్ని ఆ రోజు నక్షత్రంగా ఉపయోగిస్తారు. ఐదు అంగాలలో మరొకటి యోగం రవిచంద్రుల కలయిక వలన యోగం ఏర్పడుతుంది. రవిచంద్రుల మధ్య దూరం తిథి అయితే వారిద్దరి భాగాలను కలుపగా యోగం ఏర్పడుతుంది. తదుపరి వారం భూమి నుండి వరుసగా చంద్ర,బుధ,శుక్ర,రవి,కుజ,గురు,శని కక్ష్యలు కలవు. వారం ఏర్పడటానికి హోరాక్రమం వలన వారం ఏర్పడుతుంది.

అనునిత్యం ఖగోళంలో జరిగే ప్రతిమార్పులను పంచాంగం తెలియజేస్తుంది. మొదట్లో ఆకాశంతో సంభందంతో పంచాంగం కొనసాగేది నేడు మనం నేరుగా పంచాంగం పైన అధారపడుతున్నాం. నేటికి మనకు 2050 సంవత్సరాల వరకు పంచాంగం రాయబడింది. అందులో ఉన్న విషయాలను నేడు జరుగుతున్న విషయాలకు అలాగే అందులో చెప్పిన ప్రకారమే గ్రహణాలు ఏర్పడటం అనేది నిజంగా అధ్బుతమే. దీన్ని బట్టి మన పూర్వీకుల శాస్త్ర విజ్ఞానం అంచనా వేయవచ్చు. ఏమాత్రం జ్ఞానం లేకుండా విమర్శించక తెల్సుకొని నలుగురికి ఉపయోగపడేలా మన ఆలోచనలు కలిగితే మన ఋషుల తపస్సుకి ఫలితం వచ్చినట్లే. వేదభూమి భారతావని గర్విస్తుంది. 

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి