శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరీ చరిత్ర - తమస్విని

book review

శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరీ చరిత్ర
రచన : మల్లాది వెంకట కృష్ణమూర్తి
వెల : రూ. 60/-
ప్రచురణ : vasavis.com
HS/B Vengalrao nagar. Hyderabad  , 500038
ఇ-మెయిల్ :[email protected]
ఫోన్ : 91-40-65973335

శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి చరిత్ర పుస్తకం అచ్చ తెలుగులో సంస్కృత శ్లోకాలతో మాత్రమే లభ్యమవుతోంది. నేటి పాఠకుల్లో ఆ తెలుగుని అర్థం చేసుకునేవాళ్ళు తక్కువమంది. మల్లాది వెంకటకృష్ణమూర్తి ఆ చరిత్రని తేలికగా అర్థమయ్యే వాడుక భాషలో రాశారు. ఆంధ్రప్రదేశ్ లోని పెనుగుండలో వందల ఏళ్ళ క్రితం నిజంగా జరిగిన చరిత్ర ఇది వైశ్యుల కుటుంబంలో జగన్మాత జన్మించడం పూర్వ జన్మ కర్మానుభవం ప్రకారం చేయాల్సింది చేసి అగ్ని ప్రవేశం చేయడం అనే కథకి పూర్వాపరాలు విశదపరిచే పుస్తకం ఇది. మొదటి భాగంలో పూర్వజన్మ సంబంధాల వివరాలు, రెండవ భాగంలో అమ్మవారి చరిత్ర ఇందులో చదవచ్చు. ఈ పుస్తకం చదివితే శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవి కేవలం వైశ్య కుల దేవత మాత్రమే అనే అభిప్రాయం తొలగిపోతుంది. ఆమె హిందువులందరూ పూజించదగ్గ దేవత అని అర్థమవుతుంది.

ముఖ్యంగా ఆధ్యాత్మిక ఆసక్తి గలవారంతా చద్వదగ్గ పుస్తకం ఇది.

శివరాత్రి జాగరణ సమయంలో పుణ్యక్షేత్రాల సందర్శన సమయంలో చదవదగ్గ పుస్తకం ఇది. దీంతోపాటు వైశ్యుల ప్రవరల వివరాలు ఇచ్చారు. శ్రీ వాసవీమంత్ర సహిత పూజా విధానం, అష్టోత్తర శతనామావళి, ఇవ్వడంతో ఎవరైనా ఇంట్లో అమ్మవారిని పూజ చేసుకోవచ్చు. ఈ పుస్తకం చివర్లో ఇచ్చిన నిత్య స్మరణ శ్లోకాలలో ఉదయం నిద్ర లేచినప్పటినుంచి, రాత్రి నిద్ర పోయేదాకా ఏ పనిలో విజయానికి ఏ మంత్రం చదవాలో అవన్నీ ఇచ్చారు.

ఈ పుస్తకం మీద శ్రీయుతులు రావికొండల రావు, తనికెళ్ళభరణి, కె. అరవింద రావు, జె.కెభారవి లు రాసిన అభిప్రాయాలు కూడా ఇందులో చదవచ్చు.

శ్రీ బాపు గీసిన అమ్మవారి చిత్రం అదనపు ఆకర్షణ ఫ్రేము కట్టించుకుని పూజా మందిరంలో పెట్టుకోదగ్గ చిత్రం ఇది.

-తమస్విని 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు