చికెన్ పులావ్ - పి. శ్రీనివాసు

chicken pulav

కావలసిన పదార్ధాలు:
8 లవంగాలు, 4 యాలకులు, దాల్చిన చెక్క, బిరియానీ ఆకు, తురిమిన కొత్తిమీర, పుదీనా ఆకు, అజీనామోటో, 4 గ్లాసుల బాస్మతీ బియ్యం, అరకిలో చికెన్ ముక్కలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, 4 పచ్చిమిర్చి.

తయారు చేయు విధానం:
ముందుగా 4 చెంచాల నూనె, ఒక చెంచా నెయ్యిలో పులావ్ సామాన్లు వేసి, చికెన్ ముక్కలుతో బాగా మగ్గనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్టు కూడా ముందే వేసుకోవాలి. చికెన్ పచ్చి వాసన పోగానే 4 గ్లాసుల బియ్యం, 6 గ్లాసుల నీళ్ళు పోసి తగినంత ఉప్పు వేసుకొని కలిపి, నీటిని రుచి చూసుకోవాలి. నీరు కొద్దిగా ఉప్పగా ఉండేలా చూసుకొని మూతపెట్టుకొని 15 నిమిషాలు మీడియం మంటపై ఉడికించాలి. 15 నిమిషాల తర్వాత చక్కటి వాసన వస్తుంది. కొత్తిమీర వేసి కలిపి వేడివేడిగా వడ్డించాలి. ఇందులోకి ఉల్లిచెట్నీ (సన్నటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, పెరుగు కలిపి చేసుకోవాలి) చాలా చక్కగా వుంటుంది.

గమనిక: వెజిటేరియన్స్ చికెన్ బదులు వెజిటబుల్ ముక్కలు (ఆలుగడ్డ, ఉల్లిపాయ, కేరట్, బీన్స్ మరియు బఠానీ) వేసుకుంటే వెజిటబుల్ పులావ్ అవుతుంది.

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి