కార్టూనిస్టులతో తుంటర్వ్యూలు - ..

 

)తిక్క : మరింకేంటి సంతోష్...? అంతా అయిపోయినట్టేగా..?? 
తొక్క :ఎక్కడ సారూ.. ఇప్పుడే గదా మొదలైంది

తిక్క : ఏ నాలుగురోడ్ ల కూడలి చూసినా జనానికి మీ కార్టూన్లే ఎందుకు గుర్తొస్తాయి?
తొక్క :ఈ మధ్యన పబ్లిష్ కాని కార్టూన్లన్ని చౌరస్తా లో గోడలమీద అంటిస్తున్నాను అందుకని

తిక్క : ప్రభుత్వ శాఖల మధ్య కొరవడిన సమన్వయం మీ కార్టూన్లకు శాపంగా పరిణమించిందా? 
తొక్క :అవునండీ.. అన్ని ప్రభుత్వ శాఖల వాళ్ళు కార్టూన్లు మాకు గీసివ్వమంటే మాకు గీసివ్వమని తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారు

తిక్క : మీరు గీసిన కార్టూన్లు ఎన్ని తింటే ఆరోగ్యానికి మంచిది?
తొక్క :అన్ని మీరే తిని ఆరోగ్యంగా ఉంటె ఎలాగండీ.. నాకు కూడా కొన్ని ఉంచండి మల్ల

తిక్క : సేర్ మార్కెట్ ఎదుర్కొనే ఒడిదుడుకులను మీ కార్టూన్లు ఎలా తట్టుకోగలుగుతున్నాయి?
తొక్క :నా కార్టూన్లకు కూడా ఒడిదుడుకులు అలవాటేనండి పాపం....

తిక్క : మీ కార్టూన్లతో ఏదైనా సాధించాలనుకునేవారికి మీరిచ్చే సలహా ఏమిటి?
తొక్క :అట్లా కాడతో వాత పెట్టుకొకూడదని చెప్తా

తిక్క : మీరే ఓ పత్రిక స్టార్ట్ చేసి, మీ కార్టూన్లు ప్రచురిస్తున్న పత్రికలపై ప్రతీకారం తీర్చుకునే ఆలోచనేమైనా ఉందా?
తొక్క :ష్..ష్..ష్.. ఆల్రెడీ అదే ఆలోచనలో ఉన్నాను ..మీకెలా తెలిసింది.. ఎవరికీ లీక్ చెయ్యకండి.. ప్లీజ్..

తిక్క : తపస్సు చేసే వారికి ప్రత్యక్షం కాకుండా మీ కార్టూన్లు చూపించి దేవుళ్ళను ఆపుతున్నారట కదా?
తొక్క :పత్రికలకు కార్టూన్లు పంపే ముందు బాగున్నాయో లేవో చూసి చెప్పమన్నాను..ఇంకేముంది దేవుళ్ళు జంప్.. పాపం నా తప్పెంలేదు

తిక్క : కారు చీకట్లు కమ్ముకొంటుంటే, జాజ్జల్యమాన ప్రజ్వలితమై ప్రచండమై వెలుగుందుతున్న మీ కార్టూన్లకు చెయ్యి అడ్డం పెట్టి ఆపడం ఎవరికి సాధ్యం? 
తొక్క :ఇంకెవరండి.. మా ఆవిడే..సమయం దొరికితే గీసేయ్యడమేనా.. ఇంటి విషయాలు కుడా పట్టించు కో అంటుంది ..పాపం

తిక్క : ఖాళీ పర్సులో కార్టూన్లు పెట్టుకుంటారా మీరు?
తొక్క :నా ఫ్రెండ్స్ ని పరేషాన్ చెయ్యడానికి కార్టూన్లు విత్ ఖాళీ పర్సు మైంటైన్ చేస్తున్నండి.

తిక్క : టెన్నిస్ ఆడుతూ కార్టూన్లు వేస్తే ఏమవుతుంది? 
తొక్క :అన్ని ఫోర్ లు, సిక్స్ లే

తిక్క : పురావస్తుశాఖ ప్రదర్శనశాలలో ఎంత వెతికినా మీ కార్టూన్లు కనిపించకపోతే ఏం చేస్తారు? 
తొక్క :నా ఆత్మ ఘోషిస్తుంది, అక్కడి అధికారిని దెయ్యమై పట్టి పీడిస్త

తిక్క : సనాతన ధర్మానికీ, సత్సంప్రదాయాలకూ మీ కార్టూన్లు ఏవిధంగా అడ్డు తగులుతున్నాయంటారు? 
తొక్క :నా కార్టూన్ లన్నింటికి బుద్ది మరియు బట్టలు ఉంటాయి గదండి

తిక్క : మీ కార్టూన్లలో మీ సంతకం ఎందుకుండకూడదనుకొంటున్నారు? 
తొక్క :నా సంతకం గుర్తుబట్టి నన్ను ఆటోగ్రాఫ్లు అడిగే జనం ఎక్కువయ్యారండి

తిక్క : మీ కార్టూన్లతో ఏమైనా కూల్చొచ్చా? 
తొక్క :ఈఫిల్ టవర్, వరల్డ్ ట్రేడ్ సెంటర్...లాంటివి కాకుండా.....కొన్ని సామాజిక అంశాలపై ప్రశ్నించి వారి చెడు ఆలోచనలని కూల్చొచ్చు

తిక్క : ఇంతకుముందు తరానికి మీ కార్టూన్లు ఇస్తున్న సందేశం ఏమిటి?
తొక్క :అయ్య బాబోయి...నేనే కొత్తండి...మీరు మరీను

తిక్క : తుంటర్వ్యూ స్టార్ట్ అయిందనే అనుకుంటున్నారా? 
తొక్క :గదేంది సారూ... గట్లంటవు...అయ్యింది గదా... కాలేదా...?

తిక్క : గ్రీసు ఆర్థిక పతనాన్ని మీ కార్టూన్లే ఆపాయా? 
తొక్క :గ్రీసు దేశానికి ఆర్ధిక సహాయం అందించే దేశాలకు, నా కార్టూన్లనే షూరిటీ గా పెట్టుకున్నారు మరి

తిక్క : మీ తుంటర్వ్యూ సంగతి ఎవరు ఆలోచిస్తున్నారు?
తొక్క :నా పీత బుర్ర

తిక్క : మిగతా విషయాలు ఎప్పుడు చెప్తారు?​
తొక్క :తుంటర్వ్యు అయ్యినంక .. ఇంటర్వ్యూ తీసుకుంటానని అన్నరు కదండి... గప్పుడు చెప్తా

 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు