జ్యోతిష్యం విజ్ఞానం - శ్రీకాంత్

 

శ్రీ గురుభ్యోర్నమః

ఖగోళవిజ్ఞాన శాస్త్రంలో నక్షత్రాల పైన పరిశోధన నేటికి జరుగుతుంది. ఈ మధ్యకాలంలోనే భారతదేశం చేసే నక్షత్రపరిశోధనలో మేము పాల్గొంటాం అని అమెరికా ప్రకటన చేసింది. ఈ ఒక్క వార్త చాలదా నేడు శాస్త్రవేత్తలకు ఎంతో ఉత్సుకత ఉంది ఈ పరిశోధన పైన అని చెప్పడానికి. మొన్న జూలై 18న ఒక అద్భుతం ఆవిష్కృతం అయ్యింది. చంద్రునికి అతి దగ్గరలో గురుగ్రహం అలాగే శుక్రగ్రహం రావడం. ఈ అద్భుతఆవిష్కరణ మనకు ఆకాశంలో చాలా స్పష్టంగా కనభడింది. నేటికి ఆకశంలో అంతుచిక్కని ఎన్నో ప్రశ్నలు మన శాస్త్రవేత్తలకు త్వరలోనే వాటికి సమాధనం తెలుసుకుంటారని ఆశిద్దాం. జ్యోతిషంలో గ్రహాలు వాటి వాటి వింసొత్తరి దశను అనుసరంచి కొన్ని కొన్ని రోజులపాటు ఒకొక్క నక్షత్రంలో సంచరిస్తూ ఉంటవి. ఫలిత జ్యోతిషంలో చాలావరకు గ్రహాలు ఉన్న పొజిషన్తో పాటు అవి ఉన్న నక్షత్రాలు చాలాకీలకమైనవిగ ఉంటాయి.
మిథునరాశిలో నక్షత్రాలు :-

మిథునరాశిని గమనిస్తే మృగశిర చివరి రెండు పాదాలు,ఆరుద్రనక్షత్రంలోని 4 పాదాలు అలాగే పునర్వసు నక్షత్రంలోని మూడుపాదాలు ఉంటాయి. గతవారం మృగశిర గురుంచి తెలుసుకున్నాం. ఆరుద్రనక్షత్రం దీనినే ఆ నక్షత్రం యొక్క రంగును బట్టి పగడపుచుక్క అన్నారు. ఆరుద్రకు రుద్రుడు అధిపతి యోరోపియన్లు ఈ నక్షత్రాన్ని బీటల్ జూ అంటారు. తెలుగుప్రాంతంలో గొల్లకావిడి చుక్కలు అంటారు. జ్యోతిషం ప్రకారం రుద్రుడే శివుడు దానిపైన ఉన్న నక్షత్రం మృగశిర అంటే చంద్రుడు అంటే శివునిపైన ఉన్న తలలో ఉన్న చంద్రుడుగా అభివర్ణిస్తారు. కాస్టర్ ,పోలాక్స్ ,పోస్వాన్ చుక్కలు కలిపి చేపలాగ పునర్వసు నక్షత్రం ఉంటుంది. అధితిదేవి ఈ నక్షత్రానికి అధిదేవత. అదితికి ఉన్న ప్రాదాన్యం ఏమిటంటే యజ్ఞాయాగాది క్రతువులు అడితితో ఆరంభం అయ్యి అధితితోనే  పూర్తిఅవుతాయి.

జ్యోతిషంలో మిథునరాశి నక్షత్రాలు :-

మిథునం అనగా జంట అని అర్థం. ఇద్దరు ఒకరినోకరి పట్టుకొని నిలబడుతారు. కాలపురుష అంగంలో మిథునం బాహువులను సూచిస్తుంది. చంద్రుడు మృగశిర,ఆరుద్ర,పునర్వసు నక్షత్రాలలో సంచరిస్తున్నపుడు జన్మిస్తే జాతకుడు మిథునరాశికి చెందినవాడు అవుతాడు. మిథునంలో మృగశిర 3,4 పాదాలు ఉంటాయి. మృగశిర నక్షత్రానికి కుజుడు అధిపతి. తదుపరి ఆరుద్ర నక్షత్రం ఉంటుంది దీనికి అధిపతి రాహువు. రాహువు సహజంగా గ్రహం కాకపోయిన జ్యోతిషంలో దీనిని చయాగ్రహంగా అభివర్ణించారు ఆలాగే పాస్చ్యతులు నోడ్స్ అన్నారు. భారతీయ జ్యోతిషంలో రాహువుకు విశేష స్థానం ఉంది. తదుపరి పునర్వసు మూడు పాదాలు మిథునంలో ఉంటాయి. పునర్వసు నక్షత్రానికి గురువు అధిపతి. గురువు దేవతలకు గురువు.  

కర్కాటక రాశిలో నక్షత్రాలు :-

కార్కాటక రాశిలో రాహ్సి చక్రంలో నాలగవ రాశి. ఈ రాశిలో పునర్వసు నాల్గవ పాదం,పుష్యమి నాలుగు పాదాలు,ఆశ్లేష నాలుగు పాదాలు ఉంటాయి. ఇందులో పుష్యమి నక్షత్రానికి సిద్ధయ,అంగీరస,పోట్లపువ్వుచుక్క అని పేర్లు ఉన్నాయి. తదుపరి ఆశ్లేష నక్షత్రం ఈ నక్షత్రం సర్పదేవత అయిన ఆశ్రేశ అని అసిలెరని. సర్పపుచుక్క అని అంటారు. అశ్లేషతో వినాయకుడు ఉదయించుట వలన అతను నాగయగ్నిపవితుడు అయినాడు. హైడ్రాగుంపులోని డెల్టా, ఎప్సిలాన్, ఈట ,ల రో జీటా గుర్తులు కలవి ఆశ్లేషచుక్కలు. కర్కాటకం అంటే ఎండ్రకాయ అని అర్థం.

జ్యోతిషంలో కర్కాటక నక్షత్రాలు :-

చంద్రుడు పునర్వసు ,పుష్యమి,ఆశ్లేష నక్షత్రాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు జాతకుడు జన్మిస్తే జాతకుడు కర్కాటకరాశికి చెందినవాడు అవుతాడు. కర్కాటకంలో గురుగ్రహం ఉచ్చస్థితిని పొందుతుంది. కుజగ్రహం నీచస్థితిని పొందుతుంది. కాలపురుషిని అంగంలో గుండె, ఊపిరితిత్తులు ,ఛాతిని సూచిస్తుంది. కర్కాటకరాశికి అధిపతి చంద్రుడు. జాతకంలో కనుక గురు,చంద్రులు కలిసి ఉంటె దానిని గజకేసరియోగంగా చెప్పబడింది. జాతకంలో గజకేసరి ఉన్న స్థానంను బట్టి దాని యొక్క తీవ్రతను చెప్పవలసి ఉంటుంది. .

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి