జ్యోతిష్యం విజ్ఞానం - శ్రీకాంత్

 

శ్రీ గురుభ్యోర్నమః

శాస్త్రసాంకేతిక రంగంలో అలాగే జ్యోతిషంలో ఆకాశంలో కనపడే నక్షత్రాలు ఎంతో ప్రాముఖ్యం అయినవి అనడంలో సందేహంలో లేదు.  మన పూర్వం నుండి ఆకశంలోని నక్షత్రాల గురుంచి అనేకములైన పురాణాలు ప్రాచుర్యంలో ఉన్నవి.  వృతాసురుడు అనే రాక్షసుడు చనిపోయే ముందు తన శరీరంలో కొంతభాగం చంద్రుడికి ఇచ్చినట్లు శతపథబ్రాహ్మణంలో ఉంది. వ్రుతాసురుడే మృగశిర నక్షత్రం అని మృగశిరకు రోహిణి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇద్దరికి స్నేహం ఉంది అని అలాగే అనుభందం అధికం అని కథలు ఏర్పడినాయి. అంతేకాదు నా చిన్నతనంలో ఆకశాన్ని చూసి ఆ రోజు రాత్రివేళలో ఆరుబయట కావొచ్చు లేదా మేడపైన పాడుకోవచ్చో తెలియజేసే వారు. ఆకశంలో కనుక ఒక్క నక్షత్రం లేకపోతే వర్షం పడుతుంది అని వారి నమ్మకం. నేను కూడా ఈ విషయాన్ని చాలాసార్లు గమనించాను దీనికి ఎటువంటి సాంకేతిక లేదు కేవలం పూర్వజ్ఞానం మాత్రమె. అదేవిధంగా ప్రపంచ శాత్రవేత్తలు రోజు ఒక కొత్త విషయాన్ని ఖగోళం గురుంచి తెలుసుకుంటూనే ఉన్నారు.

సింహరాశిలో నక్షత్రాలు :-

సింహరాశిని గమనిస్తే మఘ 4 పాదాలు , పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం కలిసి ఉన్నాయి. మఘనక్షత్రానికి పల్లకీబొంగు చుక్క ,పితురుల చుక్క అనే పేర్లు ఉన్నాయి. ఈ నక్షత్రానికి పితృదేవతలే ఆధిదైవాలు. పల్లకి ఆకారంలో అయిదు చుక్కలు ఈ నక్షత్రంలో ఉన్నాయి. మహాకాంతి నక్షత్రం అయిన ఆల్ఫా చుక్క యోగాతార మఘ . పూర్వంలో దక్షిణాయనం మఘకార్తితో ఆరంభం అయ్యేది కావున పితృదేవతలు అధిదేవతలు అయ్యారని తైత్తరీయసంహిత చెబుతున్నది. తదుపరి పుబ్బ దీనినే పూర్వఫల్గుణి అంటారు. దీనికే పోద్దురిక్క అనే పేరు కలదు. దీనికి అధిదేవత భగుడు. మేషంను ఉదయించే సమయం గా చెబితే సింహం అస్తమించే సమయం.

జ్యోతిషంలో సింహరాశి నక్షత్రాలు :-

సింహం ఆకారాన్ని సూచిస్తుంది కావున ఆ పేరు వచ్చింది. కాలపురుష అంగంలో కడుపు అలాగే జీర్ణప్రక్రియ వ్యవస్తను తెలుపుతుంది. చంద్రుడు మఘ ,పుబ్బ,ఉత్తర 1 లో ఉండగా జాతకుడు జన్మిస్తే అతను సింహరాశి జాతకుడు అవుతాడు. ఈ రాశికి అధిపతి రవి. రవి గ్రహన్ని గ్రహాలకు నాయకుడు అంటారు. మఘ నక్షత్రానికి అధిదేవత కేతువు. కేతువు మనలో విజ్ఞానానికి అలాగే మోక్షకారకుడు గా చెప్పబడుచున్నాడు. పుబ్బ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. శుక్రుడు సకలకలలకు అధిపతి. ఈ రాశి రవి కి మూలత్రికోణం.

కన్యారాశి నక్షత్రాలు :-

ఉత్తర మిగిలిన మూడు పాదాలు,హస్తాలోని నాలుగు పాదాలు,చిత్తా నక్షత్రంలోని రెండు పదాలు కాన్యారాశి. కన్యఆకారంలో ఈ రాశినక్షత్రాల సమ్మేళనం ఉంటుంది కావున ఆ పేరు వచ్చింది. కన్యారాశికి రోదశి,అరమతి అను పేర్లు కలవు. కాన్యరాశిలో spica స్టార్ ఉంటుంది. హస్తానక్షత్రానికి కైనాటిరెక్క అని పేరు. హస్తా నక్షత్రం అరచేతి రూపం. అయిదు చుక్కలు హస్త అని తెలుస్తుంది. హస్తకు ఆదిదైవం సూర్యుడు. చిత్తానక్షత్రం ముత్తెపుసవతు రిక్క అని పేరు. చిట్టాకు విశ్వకర్మ అదిడైవం.

జ్యోతిషంలో కన్యారాశి నక్షత్రాలు :-

కన్యారాశి జ్యోతిషంలో ఆరవ రాశి. కాలపురుషఅంగంలో పొత్తికడుపు ను సూచిస్తుంది. చంద్రుడు ఉత్తర మూడు పాదాలు, హస్త,చిత్త రెండు పాదాల్లో సంచరిస్తున్నప్పుడు జన్మిస్తే జాతకుడు కన్యారాశికి చెందుతాడు. ఈ రాశిలో బుధుడు ఉచ్చస్థితిని పొందుతాడు, అదేవిధంగా ఈ రాశిలోనే మూలత్రికోణం అలాగే స్వక్షేత్రం కూడా బుధుడుకి ఇదే. శుక్రుడు ఈ రాశిలో నీచస్థితిని పొందుతాడు. హస్తానక్షత్రానికి చంద్రుడు అధిపతి. చిత్తకు కుజుడు. ఉత్తరకు రవి అధిపతులు.   

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు