వారఫలాలు 31-07-2015 నుండి 06-08-2015 వరకు - శ్రీకాంత్

..

  

మేష రాశి :   ఈవారం మొత్తంమీద మిశ్రమఫలితాలు పొందుతారు. గతకొంతకాలంగా ఉన్న ఇబ్బందుల నుండి కొంతమేర విముక్తులయ్యే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. పెద్దలతో చేసిన చర్చల విషయంలో స్పష్టమైన అవగహన కలిగి ఉండి ఆ దిశగా ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంశలు పొందుతారు. శక్తికిమించిన పనులను తలపెట్టకపోవడం అనేది సూచన. నూతన పనులను ఆరంభించుటలో పెద్దలతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. వాహనముల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండుట మంచిది. మిత్రులతో స్వల్ప విభేదాలు ఏర్పడే అవకాశం కలదు కావున సాధ్యమైనంత వరకు మిత్రులకు కొంత కాలం దూరంగా ఉండుట సూచన.    

 

వృషభ రాశి :ఈవారం మొత్తంమీద చర్చాసంభందమైన విషయాల్లో కాస్త నిదానంగా వ్యవహరించుట సూచన. ఉద్యోగంలో అధికారులతో మంచి సంభందాలు కలిగి ఉంటారు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. మానసికంగా కొంత ఒత్తిడిని కుటుంబంలో పొందుటకు అవకాశం ఉంది. సోదరులతో చేయుచర్చల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. కుటుంబంలో మీ ఆలోచనల విషయంలో మిశ్రమ స్పందనలు వస్తాయి. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. బంధువుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. సంతానపరమైన విషయాల్లో కాస్త ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది. విదేశీప్రయాణాలు కలిసి వస్తాయి ప్రయత్నం పెంచుట మంచిది.    
 
మిథున రాశి : ఈవారం మొత్తంమీద ఆరంభంలో చిన్న చిన్న ఇబ్బందులు కలిగిన అనుభవంతో వాటిని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సోదరులతో చేసిన చర్చలు ఒక కొలిక్కివస్తాయి. దూరప్రాంతప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంశలు పొందుతారు. నలుగురిని కలుపుకొని నూతన పనులను చేపట్టుటకు అవకాశం కలదు. మిత్రుల నుండి వచ్చు సమాచరం మీలో సందేహాలను పెంచుటకు అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో కాస్త ముందుచూపు కలిగి ఉండుట వలన లబ్దిని పొందుతారు. ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకండి నిదానం అవసరం.     

 

 

కర్కాటక రాశి : ఈవారం మొత్తంమీద నలుగురికి ఉపయోగపడే ఆలోచనలు కలిగి ఉంటారు. తలపెట్టిన పనుల్లో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. ఫలితాలు మాత్రం ఊహించిన దానికి భిన్నంగా వచ్చే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం తొందరపాటు నిర్ణయాలు వద్దు. పెద్దలతో మీకున్న అనుభందాలు బలపడే అవకాశం ఉంది. కుటుంబంలో మాత్రం విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగంలో అధికారులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది . వారికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం వలన లబ్దిని పొందుతారు. దైవసంభందమైన విషయాల్లో సమయాన్ని ఇస్తారు. అగ్నిసంభందమైన విషయాల్లో లేదా పనులలో మాత్రం తగిన జాగ్రత్తలు పాటించుట అవసరం. మొండినిర్ణయాలు తీసుకోకండి సర్దుబాటు మంచిది.         

 

 సింహ రాశి :  ఈ వారం మొత్తంమీద ఉత్సహాన్ని కలిగి ఉంటారు. చర్చల్లో సమయాన్ని గడుపుతారు. తలపెట్టిన పనుల మూలాన ఆశించిన మేర లబ్దిని పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో ఇతరుల నుండి సమయానికి సహకారం అందుతుంది. కుటుంబంలో కాస్త సంతోషించదగ్గ పరిణామాలు కలుగుటకు అవకాశం ఉంది. భాద్యతలు పెరుగుటకు అవకాశం ఉంది కావున ఈ విషయంలో మాత్రం తగిన విధంగా వ్యవహరించుట అవసరం. ప్రయాణాలు చేయునపుడు నూతన పరిచయాలకు అవకాశం కలదు. చిననాటి మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. స్వల్పఅనారోగ్యసమస్యలు మిమ్మల్ని భాదించే అవకాశం ఉంది కావున ఈ విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించుట అవసరం. ఎవ్వరితోను విభేదాలు రాకుండా చూసుకోండి.    

   

కన్యా రాశి : ఈవారం మొత్తంమీద ఉత్సహాన్ని కలిగి ఉంటారు. చర్చల్లో సమయాన్ని గడుపుతారు. తలపెట్టిన పనుల మూలాన ఆశించిన మేర లబ్దిని పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో ఇతరుల నుండి సమయానికి సహకారం అందుతుంది. కుటుంబంలో కాస్త సంతోషించదగ్గ పరిణామాలు కలుగుటకు అవకాశం ఉంది. భాద్యతలు పెరుగుటకు అవకాశం ఉంది కావున ఈ విషయంలో మాత్రం తగిన విధంగా వ్యవహరించుట అవసరం. ప్రయాణాలు చేయునపుడు నూతన పరిచయాలకు అవకాశం కలదు. చిననాటి మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. స్వల్పఅనారోగ్యసమస్యలు మిమ్మల్ని భాదించే అవకాశం ఉంది కావున ఈ విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించుట అవసరం. ఎవ్వరితోను విభేదాలు రాకుండా చూసుకోండి.  

 


తులా రాశి : ఈ వారం మొత్తంమీద మిశ్రమ ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయు విషయంలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. సంతానపరమైన విషయంలో ఒత్తిడిని కలిగి ఉంటారు. ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకండి, నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. కొన్ని కొన్ని విషయాల్లో మొండిగా ప్రవర్తించుట వలన నష్టపోయే అవకాశం ఉంది. గతంలో ఆరంభించిన పనులను పూర్తిచేసే అవకాశం ఉంది. పెద్దలనుండి నూతన సమాచరం లభిస్తుంది అదికొంత మేర మీ లక్ష్యంలో సహకారం అందించేదిగా ఉంటుంది. ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు పొందుతారు వాటిని తెలివితో పరిస్కరించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. జీవితభాగస్వామితో సర్దుబాటు విధానం వలన మేలుజరుగుతుంది.  

 

 
.వృశ్చిక రాశి  : ఈ వారం మొత్తంమీద ఇష్టమైన పనులను మొదలు పెడతారు. నచ్చిన వారినుండి తెలుసుకొనే విషయాలు మీకు లాభాన్ని కలిగించేదిగా ఉంటుంది. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది, వాటికి సమయాన్ని ఇస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో స్నేహితుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. గతంలో మొదలుపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. దైవసంభందమైన విషయాల్లో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. సంతానపరమైన విషయాల మూలాన అనుకోని ఖర్చులను పొందుటకు అవకాశం ఉంది , వాటిని తగ్గించుకొనే ప్రయత్నంలో విఫలం అవుతారు. ఉద్యోగంలో అధికారుల నుండి నూతన విషయాలు తెలుసుకొనే ఆస్కారం కలదు.  

 


ధనస్సు రాశి  : ఈ వారం మొత్తంమీద తీసుకొనే నిర్ణయాల విషయంలో స్పష్టమైన అవగహన కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. గతంలో ఆరంభించిన పనులకు గాను శ్రమను పొందుతారు. ఉద్యోగంలో అధికారులతో మీకున్న పరిచయాలు అలాగే అనుభందాలు బలపడే అవకాశం ఉంది. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. భుసంభందమైన విషయాల్లో ఏవైనా నిర్ణయాలు తీసుకొనే ముందు అనుభవజ్ఞుల సూచనలు తీసుకోండి. మిత్రులతో స్వల్ప ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కావున వారితో మాటపట్టింపులకు పోకండి. చాలావరకు చాలవిశాయాల్లో సర్దుబాటు విధానం ఆవలభించుట మంచిది. విదేశీప్రయత్నాలు కలిసి వస్తాయి వీటి గురుంచి ఆలోచన చేయుట మంచిది.                

 

  

మకర రాశి :  ఈవారం మొత్తంమీద మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. నూతన పరిచయాలకు అవకాశం కలదు. ఉద్యోగంలో మీ ఆలోచనలకు చక్కటి గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుండి ప్రశంశలు పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం నూతన నిర్ణయాలు తీసుకోకపోవడం ఉత్తమం. బంధువులతో స్వల్ప విబేదాలు ఏర్పడే అవకాశం ఉంది. దైవసంభందమైన విషయాల పట్ల కాస్త వ్యతిరేకత చూపిస్తారు. కొన్ని కొన్ని విషయాల్లో ఏదో తెలియని అనాసక్తి ఉంటుంది. కొన్ని కొన్ని విషయలలో చర్చలకు ఆస్కారం ఇవ్వకండి. కుటుంబంలో పెద్దలకు మీ నిర్ణయాల విషయంలో సమాధానం చెప్పవలసి రావోచ్చును ,మీ ఆలోచనలకు వారితో ముందుగానే పంచుకొనుట వలన మేలుజరుగుతుంది.  

 

  
కుంభ రాశి :  ఈవారం మొత్తంమీద అనవసరమైన విషయాల్లో చర్చలకు దూరంగా ఉండుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. పెద్దలతో మీ ఆలోచనలు తెలియజేస్తారు. వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఉద్యోగంలో అధికారులతో మీకున్న పరిచయాలు లబ్దిని కలగజేస్తాయి. రాజకీయపరమైన విషయాల్లో పాల్గొనే అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కలదు. గతంలో తలపెట్టిన పనులకు గాను నలుగురిలో గుర్తింపును పొందుతారు. మీయొక్క ఆలోచనలు మిత్రులను కాస్త సందిగ్దంలో పడవేస్తాయి. వ్యాపారపరమైన విషయాలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంభంలో జీవిత భాగస్వామితో స్వల్ప ఇబ్బందులు ఏర్పడే ఆస్కారం కలదు.   

 


మీన రాశి : ఈవారం మొత్తంమీద బంధువులతో  సమయాన్ని గడుపుతారు, వారితో మీ ఆలోచనలను పంచుకుంటారు. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. శక్తికి మించిన పనులను మొదలుపెట్టుట వలన కొంతమేర శ్రమ అలాగే ఇబ్బందులు తప్పకపోవచ్చును. కుటుంబంలో జీవితభాగస్వామి నుండి కీలకమైన విషయాల్లో ఆశించిన మేర సహకారం లభిస్తుంది. మిత్రులతో కలిసి గతంలో చేపట్టిన పనులకు గాను ఆశించిన మేర గుర్తింపు లభిస్తుంది. అనుకోని ఖర్చులకు ఆస్కారం కలదు కావున ఈ విషయంలో మీకంటూ ఒక విధానం కలిగి ఉండుట సూచన. స్వల్ప ఆనారోగ్య సమస్యలు మిమ్మల్ని కాస్త ఇబ్బందికి గురిచేస్తాయి కావున జాగ్రత్త అవసరం. సమయానికి భోజనం చేయుట వలన మేలుజరుగుతుంది.

టి. శ్రీకాంత్ 

వాగ్దేవి జ్యోతిషాలయం 

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి