జుట్టు నల్లగా ఉంటేనే అందం. మన వెంట్రుకల క్రింది భాగంలో ఉండే మెలానో సైట్స్ అనే కణాలు జుట్టుకి రంగునిస్తాయి. మన శరీరంలోని మెలానిన్ స్థాయిని బట్టి చర్మం మరియు జుట్టు రంగులు ఏర్పడతాయి. వయసు పైబడుతున్నప్పుడు మెలానిన్ ఉత్పత్తి తగ్గిపోయి క్రమంగా ఆగిపోతుంది. ఫలితంగా జుట్టు తెల్లబడుతుంది. వయసు వల్ల నెరసిన జుట్టు ఇక నల్లబడదు. తెల్ల జుట్టును తిరిగి నల్లగా మార్చలేము. ఈ సమస్యకు పరిష్కార మార్గాలను సూచిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ప్రొ. శ్రీ. చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు.