శ్రీ గురుభ్యొర్నమః
విశాలమైన ఆకాశంలో నక్షత్రాలు కొన్నికొన్నిసార్లు కనబడుతూ, మాయమవుతూ ఉంటాయి. మన పూర్వీకులు వీటిని ఆదరంగా చేసుకొని తమ పరిశోదనలను కొనసాగించారు. కాలంలో వచ్చే మార్పులకు ఆకాశంలోని మార్పులకు సంభందం ఉన్నట్లు తెలుసుకున్నారు. దానికి అనుగుణంగా తమ జీవన విధానంలో మార్పులు తెచ్చుకున్నారు. శాస్త్రరంగంలో ఎంత అభివృద్దిని చెందిన దానికి మూలం మన పూర్వీకుల భావన అనేది నిజం. మనం శాస్త్రాన్ని అలాగే సైన్సు వీటిని అనుసంధానం చేస్తూ ముందుకు సాగితే ఎన్నో గొప్ప గొప్ప విజయాలను సాధించుకోవచ్చును.
కుంభరాశి నక్షత్రాలు : -
ధనిష్టా నక్షత్రంలోని 3,4 పాదాలు , శతభిషం లోని నాలుగు పాదాలు , పూర్వాభాద్రలోని మొదటి మూడు పాదాలు కలిపితే కుంభరాశి అవుతుంది. ధనిష్టకు మద్దెలరూపు చుక్క అనే పేరు కలదు. ఈ నక్షత్రం అధిదేవత అష్టవసువులు. శీర్షత్రయ మంటే మూడుతారలతొ కూడి ఉంటుంది. ధనిష్ట గోలాకానికి చెందిన నక్షత్రం. శతభిషకు నీతిరెక్క అని పేరు. అధిదైవం వరణుడు. శతంతారః అంటే వంద తారల గుంపు అని అర్థం.
జ్యోతిషంలో కుంభరాశి నక్షత్రాలు : -
కుంభరాశికి అధిపతి శని. ఈ రాశి స్థిరరాశి. కాలపురుషుని అంగంలో పిక్కలు. అలాగే శనిని న్యాయదేవత గా చెప్పబడింది. చంద్రుడు ధనిష్ట, శతబిష, పూర్వాభాద్ర నక్షత్రాలలో సంచరిస్తున్నపుడు జాతకుడు జన్మిస్తే కుంభరాశికి చెందిన వాడు అవుతాడు. ధనిష్టకు కుజుడు , శతభిషకు రాహువు, పూర్వభాద్రకు గురుడు అధిపతులు.
మీనరాశిలో నక్షత్రాలు :-
పూర్వాభాద్ర నక్షత్రంలోని నాల్గవ పాదం , ఉత్తరాభాద్ర పాదాలు, రేవతి లోని నాలుగు పాదాలు ఈ రాశికి చెందుతాయి. పూర్వభాద్రకు కాళ్ళరిక్క అనిపేరు కలదు. ఉత్తారభద్రకు ముక్కంటిరిక్క అనిపేరు. రేవతికి కడచిక్క అనిపేరు. రేవతికి కొసరిక్క, మీనరూపు చుక్క అనిపేరు. పూర్వాభాద్రకు అజైకపాదుడు, ఉత్తరాభాద్రకు అహిర్భద్యుడు , రేవతికి పూషుడు అధిదైవాలు. మీనరాశిలోని రెండు చేపలు ఉంటాయి.
జ్యోతిషంలోని మీనరాశి నక్షత్రాలు :-
మీనరాశికి అధిపతి గురుడు. కాలపురుషిని అంగంలో పాదాలు. ఇది దిస్వభావరాశి. జలతత్వరాశి. ఇక్కడ శుక్రుడు ఉచ్చస్థితిని పొందుతాడు. బుదుడు నీచస్థితిని పొందుతాడు. చంద్రుడు ఈ రాశిలో సంచరిస్తున్నపుడు జాతకుడు జన్మిస్తే మీనరాశికి చెందుతాడు. పూర్వాభాద్రకు గురుడు, ఉత్తరాభాద్రకు శని, రేవతికి బుధుడు అధిపతులు.