కార్టూనిస్టులతో తుంటర్వ్యూ - .

తిక్క : గాంధీగారూ, అన్యాయంగా మీరు నమస్కరింపబడతారా?
తొక్క: ఔను.. అపుడప్పుడు నాకు నమస్కారాలు పెట్టి నేను తీసుకున్న అప్పుల్ని వసూలు చేసుకుని పోతుంటారు కొంతమంది ముష్కురులు.

తిక్క : కోళ్ళూ-తేళ్ళూ కార్టూన్లేయడం ఆపేస్తే నీళ్ళ కరువొస్తుందా?

తొక్క: అది తెల్దు గానీ.. ఇతర కార్టూనిస్టులు కార్టూన్లు వేయడం ఆపేస్తే నా కార్టూన్లకు డిమాండ్ వస్తుంది.

తిక్క : వెండి తెర మీద రెండున్నర గంటలు ఒకే కార్టూన్ చూపిస్తే ఎవరికి ఏమవుతుంది?

తొక్క: అది నా కార్టూన్ ఐతే ఎవరికీ ఏమీ కాదు. రెండున్నర గంటలు హాయిగా నవ్వుకుంటూ చూసేయొచ్చు.

తిక్క : సభ్యసమాజం తల దించుకునేలా-సర్వోన్నత న్యాయస్థానం సన్మానించేలా కార్టూన్ వేస్తారా?

తొక్క: సభ్య సమాజం తల దించుకునేలా చాలా కార్టూన్లు వేసాను. కావాలంటే ఆ సభ్య సమాజం వాళ్ళనే అడగండి. ఇక సన్మానాలు చేయించుకునే ఆర్ధిక స్థోమత నాకింకా రాలేదు.

తిక్క : చెరువులో కప్పలు-ఆకాశంలో చుక్కలు భూమ్మీదంతా నిర్మాణాలు, మరి మీ కార్టూన్లేవీ?

తొక్క: ఆ కప్పలు కాళ్ళకిందేసి కింద తొక్కిన, చుక్కల వెనకాల నక్కిన.నిర్మాణాల పునాదుల కింద కుక్కినవన్నీ అన్నీ అన్నీ అన్నీ నా కార్టూన్లే.....నా కార్టూన్లే....

తిక్క :  మీ సినిమాల్లో కార్టూన్లు, కార్టూన్లలో సినిమాలు కలుపుతారా?

తొక్క: నేను తీసిన 'సారీ నాకు పెళ్ళైందీ సినిమా చూసి షాంఘై ప్రధాని కరీం నగర్ కొచ్చి చెప్పాడట..ఆ సినిమాలో ఉడకబెట్టిన కార్టూన్లు చక్కెర ఎక్కువై, కారంగా, సినిమా ఘాటుగా ఉందని..

తిక్క : మీకన్నా ముందు మీపేరు ఇంకెవరికీ లేదనుకుంటున్నారా?

తొక్క: ..అనుకోవడంలేదు.. ఎందుకంటే చాలెంజ్ సినిమాలో చిరంజీవికి పెట్టారటగా, వనసేన పార్టీ నాయకుడు బొమ్మన్ పాండ్యన్ నిన్న రామా నగర్ లో కనిపించి చెప్పాడు.

తిక్క : అప్పుడే కాదనకుండా కార్టూన్లు తీసేస్తే సినిమా అయిపోయేది కదా?

తొక్క: మీరన్నది జీరో పర్సెంట్ కరెక్ట్. నేనాపని చేస్తే తెలుగు సినిమాలు 'ఆత్మహత్య' చేసుకుంటాయని మానేసా.

తిక్క : కార్టూన్లు గోడకతికిస్తే ఎన్నికలొచ్చేస్తాయా?

తొక్క: కాదండి. సినిమా పోస్టర్లన్నీ పీకేసి కార్టూన్లు గోడలకతికించినట్టు ఎన్నికలలొచ్చాయో ఇప్పటిదాకా.

తిక్క : మీ కార్టూన్లలో టైటిల్ కార్డు, ఇంటర్వెల్, శుభం కార్డు వేస్తారా?

తొక్క: సినిమాలు వుంటే ఇంటర్వెల్ కార్డ్, పత్రికలు లేకపోతే శుభం కార్డు వేస్తా.

తిక్క : ప్రపంచ స్థాయి పోటీలకు  కార్టూన్లు పంపే బదులు వాళ్ళిచ్చే బహుమతులు అందుకున్నాకే కార్టూన్లు పంపొచ్చుగా?

తొక్క: ఔనండీ, అలా చేస్తే చాలా ఇన్ ఫర్ మేషన్ గా వుంటుంది.. మన పిచ్చి కాకపోతే ఆ పాటి తెలివి జపాన్ వాళ్ళకెక్కడ ఏడ్చి చచ్చింది. 

తిక్క : కోతల్లేని కరెంటు, కోతుల్లేని ఫారెస్టు మీ కార్టూన్లలో కనిపించవేం?

తొక్క: ఒకటి షాక్ కొట్టి, ఇంకోటి కరిస్తే బ్రేకింగ్ న్యూస్ లో వస్తామని భయపడి...

తిక్క : ఒక కార్టూన్ తెరకెక్కించడానికి మీరు ఎవరి సమయం ఎంత తీసుకుంటారు?

తొక్క: నాకు ఆ దిక్కుమాలిన ఇంగ్లీష్ కార్టూనిస్టుల పేర్లు గుర్తుండి చావవు. 

తిక్క : ప్రతిరోజూ ప్రత్యేక కార్టూన్లు గీస్తూ పండగలప్పుడు మామూలు కార్టూన్లు గీస్తున్నారెందుకు?

తొక్క: అలా ఐతే పత్రికల వాళ్ళు ఇచ్చే పారితోషికానికి ఇన్ కం ట్యాక్స్ మినహాయిస్తారని 

తిక్క : వాఘా సరిహద్దు దగ్గర భద్రతాదళాలు నిరంతరం కాపలా కాస్తూండగానే మీరిన్నిన్ని కార్టూన్లెలా గీయగలుగుతున్నారు?

తొక్క: పాకిస్తాన్ నుండి వచ్చే చలిని మా దేశం లోకి రాకుండా బద్రతా దళాలు ఆపేయడం వల్ల..

తిక్క : కొన్ని వేల సంవత్సరాల క్రితమే మధ్యధరా నదిలో మీ కార్టూన్లు ఎవరు ఉడకబెట్టారు?

తొక్క: ఎన్నివేల ఇయర్స్ అనేది కచ్చితంగా డేట్ తో సహా చెప్తే పైగా ఇందాకే మార్స్ కెళ్ళిన నా పీ.ఏ.వచ్చాక.  వచ్చాక అప్పుడుడకబెట్టిన కార్టూన్లు చల్లారబెట్టి మీకు పంపిస్తాను.

తిక్క : ఇప్పటివరకూ ఎక్కువ సినిమాలు గీసి, తక్కువ కార్టూన్లు తీసి ఊరుకున్నారెందుకు?

తొక్క: పత్రికలు చదివే ప్రేక్షకులకన్నా సినిమాలు చూసే పాఠకులు తగ్గారు కాబట్టి. 

తిక్క : మీ తుంటర్వ్యూకి అయిన ఖర్చు గురించే పార్లమెంటులో మన ప్రధాని, రైల్వే శాఖామంత్రి కొట్టుకున్నారట కదా?

తొక్క: అది నాకు తెలుసు.. వాళ్ళిప్పుడు ఏ హాస్పిటల్ లో వున్నారో, అది చెప్పండి ముందు. వాళ్ళతో సెల్ఫీ తీసుకుని ట్విట్టర్ లో పెట్టాలి. 

తిక్క : ఏది, ఎక్కడ, ఎంతవరకు అవసరమో మీ కార్టూన్లకెలా తెలుస్తుంది?

తొక్క: ఇన్నేళ్ళుగా వాటిని వేస్తున్నా ఆపాటి తెలివి వాటికుండదా?

తిక్క : మీరు వద్దంకుంటే ఎవరి కార్టూన్లు ఎప్పుడాగిపోతాయి?

తొక్క: ఇదేమైనా వర్షమా ఎప్పుడు ఆగిపోవాలనుకుంటే అప్పుడు ఆగిపోవడానికి 

తిక్క : మీ కార్టూన్లలో కనిపించేది ఎవరి దర్శకత్వ ప్రతిభ?

తొక్క: నాకు సిగ్గు బాబు నేను చెప్పలేను.

తిక్క : మీరు ఏ ఇంకుతో సినిమాలు తీస్తారు?

తొక్క: ప్రొడ్యూసర్లు రక్తం తో తీస్తాను.

తిక్క : ఈ తుంటర్వ్యూ తెచ్చే లాభాలతో మీరు మరింత డీలాపడతరా?

తొక్క :ఆ విషయం ఇక నేను తీయబోయే కార్టూన్ల కింద ఆధారపడి వుంటుంది

తిక్క : లై డిటెక్టర్ మీ కార్టూన్లకవసరమా?

తొక్క: పొలిటిషియన్లపై, దొంగలపై వేసే కార్టూన్లకైతే అవసరం ఉండొచ్చు.. 

తిక్క : మీరు తుంటర్వ్యూ వదిలేసుకుంటారని అరుణ్ జైట్లీ మొన్న శ్రీమంతుడు ప్రెస్ మీట్లో చెప్పారట నిజమేనా?

తొక్క: నన్ను సెలెబ్రిటి కాకుండా అరుణ్ జైట్లీ ఇలా చేయడం పద్ధతిగా లేదు

తిక్క : ఈ తుంటర్వ్యూ వల్ల కొత్త సినిమా గీయబోతున్నారా?

తొక్క; మీరు ప్రొడ్యుసర్ గా వుంటే నేను రెడీ!  

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు