28-08-2015 నుండి 03-09-2015 వరకు వారఫలాలు - శ్రీకాంత్

మేష రాశి :  ఈవారం మొత్తంమీద మిశ్రమ ఫలితాలు పొందుతారు. నూతన పనులను చేపట్టుటయందు ఆసక్తిని కనభరుస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే ఖర్చులు పెరుగుటకు ఆస్కారం కలదు. కుటుంబంలో శుభకార్యక్రమాలు జరుగుటకు అవకాశం ఉంది , వీటివిషయంలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. అధికారులతో చేసే చర్చల విషయంలో స్పష్టమైన ఆలోచన లేకపోతే ఇబ్బందులు తప్పవు కావున ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళండి. వ్యాపారంలో కాస్త కష్టపడటం అలవాటు చేసుకోవడం ద్వార లబ్దిని పొందవచ్చును. వాహనముల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త పడుట అవసరం. స్నేహితులతో సమయాన్ని గడుపుటకు ఆస్కారం కలదు, వివాదాలకు దూరంగా ఉండుట సూచన.

వృషభ రాశి : ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. అధికారులతో చేపట్టిన చర్చలు సంతృప్తికరంగా ముగుస్తాయి. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు. తలపెట్టిన పనులను కాస్త ఇబ్బందికి లోవయినప్పటికిని చివరకు విజయవంతంగా పూర్తిచేస్తారు. మానసికపరమైన విషయాల్లో మాత్రం కాస్త ఒత్తిడికి లోనయ్యే ఆస్కారం కలదు. దైవపరమైన విషయాలకు సమయం ఇస్తారు. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు రాకుండా జాగ్రత్త పడటం మంచిది. విదేశీప్రయత్నాలు చేసే వారికి అనుకూలమైన సమయం కాస్త ఓర్పుతో ప్రయత్నం చేసి మీ కలలను సాకారం చేసుకోండి.

మిథున రాశి : ఈవారం మొత్తంమీద ఆరంభంలో కాస్త ఆలోచనల మూలాన ఒత్తిడిని పొందుతారు, మానసికంగా దృడంగా ఉండుట అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులు పెరుగుతాయి, అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండుట సూచన. ప్రయాణాల్లో ఇబ్బందులు తప్పకపోవచ్చును. వ్యాపారపరమైన విషయాల్లో పెద్దల సూచనలు పాటించుట సూచన. మిత్రులనుండి వచ్చిన సూచనల విషయంలో నూతన ఆలోచనలు ఆరంభమయ్యే అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో కలిసి నూతన ఆలోచనలు చేస్తారు. దూరప్రదేశాల నుండి నూతన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది , తోటివారి నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది.

కర్కాటక రాశి : ఈవారం మొత్తంమీద సామయాన్ని వృధాచేయకుండా ప్రణాలిక బద్దంగా ముందుకు వెళ్ళండి. కుటుంబంలో తీసుకొనే నిర్ణయాల విషయంలో పెద్దల సూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. నూతన పరిచయాలకు అవకాశం ఉంది, వారికి సమయాన్ని కేటాయిస్తారు. స్త్రీ పరమైన విషయాల్లో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. అధికారులతో చర్చలు జరిగే విషయంలో మాత్రం మీ పరిధులను గుర్తుపెట్టుకొని ఆపరంగా ప్రవర్తించుట మంచిది. నూతన ఉద్యోగప్రయత్నాలు మొదట్లో కొంత ఇబ్బందిని కలిగించిన చివరకు సంతృప్తికరంగా ఫలితాలు వస్తాయి, నూతన అవకాశాలు లభిస్తాయి.

సింహ రాశి :  ఈవారం మొత్తంమీద కుటుంబసభ్యులతో సమయాన్ని అధికంగా గడిపే అవకాశం ఉంది. చర్చాపరమైన అవకశాలు కుటుంబ సభ్యుల మధ్య రాకుండా చూసుకొనే ప్రయత్నం చేయండి. విలువైన వస్తువులను కొనుగోలు చేయుట వలన నష్టపోయే ఆస్కారం కలదు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగంలో మిశ్రమఫలితాలు పొందుతారు. చేపట్టిన పనుల్లో కొన్నింటిని మాత్రమే సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. మీ మాటతీరు విషయంలో మరొకసారి సరిచుసుకోండి , లేకపోతే అనవసరమైన వివాదాలకు మీరే కారణభూతులు అవుతారు జాగ్రత్త. ఇష్టమైన వ్యక్తులతో కలిసి నూతన ఆలోచనలు చేస్తారు.


కన్యా రాశి : ఈవారం మొత్తంమీద చేసే ప్రతిపని విషయంలో తొందరపాటు లేకుండా జాగ్రత్త పడండి.  అవసరమైన మేర సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. ప్రయాణాలు చేయకండి వీలయితే వాయిదా వేయుట అవసరం. ఉద్యోగంలో అధికారులతో లేదా పెద్దాల్తో చర్చలు చేయకండి. మిత్రులతో కలిసి నూతన పనులను మొదలుపెట్టాలనే తలంపును కలిగి ఉంటారు. స్వల్ప అనారోగ్యసమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. సమయానికి భోజనం చేయుట మంచిది. విదేశీప్రయత్నాలు ప్రణాళిక బద్దంగా మొదలుపెట్టుట వలన ప్రయోజనం ఉంటుంది. సంతానపరమైన విషయంలో కాస్త ఆందోళన చెందుటకు అవకాశం ఉంది.

తులా రాశి : ఈవారం మొత్తంమీద నూతన పరిచయాలకు ఆస్కారం కలదు. మిత్రులతో సమయాన్ని గడపడానికి ఇష్టపడుతారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను పూర్తిచేయుటలో తొందరపాటు పనికిరాదు. కొన్ని కొన్ని విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు పొందుతారు. నూతన ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి. పెద్దలతో చేసిన చర్చలు ఆశించిన మేర ఫలితాలు ఇవ్వకపోవచ్చును. ఇష్టమైన వ్యక్తుల నుండి వచ్చిన సమాచారం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. కుటుంబంలో విభేదాలు పెరుగుటకు అవకాశం కలదు ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుట అవసరం.

వృశ్చిక రాశి  : ఈవారం మొత్తంమీద కొన్ని కొన్ని విషయాల్లో మీ నిర్ణయాలను తరచు మార్చుకొనే ఆస్కారం కలదు. స్థిరమైన ఆలోచనలు చేసే ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో బాగానే ఉంటుంది నలుగురి సహాయంతో పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. నచ్చిన ప్రదేశాలను సందర్శించే అవకాశం కలదు. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. కుటుంబంలో సభ్యుల నుండి వచ్చిన సూచనలను పాటించే ప్రయత్నం చేయుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం అనవసరమైన డాంభికాలాకు పోవడం వలన ఇబ్బందులు కొనితెచ్చుకొంటారు. వ్యాపారపరామైన విషయాల్లో నూతన ఆలోచనలతో ముందుకు వెళ్తారు.

ధనస్సు రాశి  : ఈవారం మొత్తంమీద ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విషయాల్లో ఆశించిన మేర ఫలితాలు వచ్చే అవకాశం కలదు. చేపట్టిన పనులను కొంతమేర ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నంలో సఫలీకృతులు అవుతారు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత సర్దుబాటు అవడం వలన కొంత ఊప్రి తీసుకుంటారు. మీయొక్క ఆలోచనలను తరచి చూసుకోవడం వలన మేలుజరుగుతుంది. పనుల మూలాన శ్రమ మాత్రం పెరుగుతుంది కావున ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్ళుట సూచన. కుటుంబంలో సోదరులతో చేసిన చర్చలు ముందుకుసాగుతాయి. నూతన ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది, నూతన పరిచయాలకు ఆస్కారం కలదు.

మకర రాశి : ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో సానుకూలమైన ఫలితాలు పొందుతారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో పెద్దల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. కుటుంబంలో జీవితభాగస్వామి నుండి వచ్చే సూచనలు పాటించే -ప్రయత్నం చేయుట మంచిది. స్వల్పఅనారోగ్యసమస్యలు ఏర్పడే ఆస్కారం కలదు జాగ్రత్త. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. బంధువులను కలుస్తారు, వారితో కలిసి నూతన ఆలోచనలు చేయుటకు ఆస్కారం కలదు. విలువైన వస్తువుల కోసం ధనంను ఖర్చు చేసే ఆస్కారం కలదు. మిత్రులతో కలిసి విందులలో పాల్గొనే ఆస్కారం ఉంది.

కుంభ రాశి : ఈవారం మొత్తంమీద దైవపరమైన విషయాలకు సమయాన్ని కేటాయిస్తారు. చేపట్టిన పనులలో లబ్దిని పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారపరమైన విషయాల్లో పెట్టుబడులకు అవకాశం కలదు. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు. కుటుంబసభ్యులకు మీ ఆల్కహ్నాలు తెలియజేయుట అవసరం. కొన్ని కొన్ని విషయాల్లో ఆశించిన దానికన్న అధికమైన ఖర్చును పొందుతారు. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన మేర గుర్తింపును పొందుతారు. మీ ఆత్మీయుల ఆరోగ్యం మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురిచేస్తుంది ఆందోళనకు లోనయ్యే అవకాశం ఉంది.

మీన రాశి : ఈవారం మొత్తంమీద అధికమైన ఆలోచనలు కలిగి ఉంటారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు. తలపెట్టిన పనులను కాస్త ఆల్స్యంగావ్ పూర్తిచేసే ఆస్కారం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులు అనుకూలించే ఆస్కారం కలదు. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. ఉద్యోగంలో పెద్దలనుండి నూతన విషయాలు తెలుస్తాయి అలాగే వారినుండి అభినందనలు పొందుతారు. సంతానపరమైన విషయాలకు అనుకోని ఖర్చు అయ్యే సూచనలు ఉన్నవి. జీవితభాగస్వామికి మీ ఆలోచనలు తెలియజేస్తారు. బంధువుల నుండి నూతన సమాచారం లభిస్తుంది వారితో సమయం గడుపుతారు.

టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం 

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి