కొత్తిమీర పచ్చడి - ..

కావలసిన పదార్థాలు:
కొత్తిమీర, ఎండిమిరపకాయలు, మినపప్పు, చింతపండు, బెల్లం, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు

తయారు చేయు విధానం:
ముందుగా బాణీ పెట్టి కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడి అయిన తరువాత ముందుగా మినపప్పు వేసి దోరగా వేపాలి. వేగిన తరువాత దానిలో ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి. మినపప్పు, ఎండుమిర్చి దోరగా వేగిన తరువాత ఒక ప్లేటు లోకి తీసుకోవాలి. తరువాత ఆ బాణీలో కొత్తిమీర వేసి మూతపెట్టాలి. మూతపెట్టిన కొత్తిమీర మగ్గుతూ ఉండనివ్వాలి. తరువాత మినపప్పు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు, చింతపండు, బెల్లం కలిపి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన పచ్చడిని తిరగమూత పెట్టుకోవాలి. తిరగమూత పెట్టుకోవడానికి ముందుగా బాణీలో నూనె వేసుకుని జీలకర్ర, వెల్లుల్లి రేకలు వేసి దోరగా వేపి దానిలో మిక్సీ చేసిన పచ్చడిని వేసి రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన తరువాత ఆ పచ్చడిని ఒక బౌల్ లోకి తీసుకుంటే కొత్తిమీర పచ్చడి రెడీ. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది.

మరిన్ని వ్యాసాలు