పిల్లలతో అనుబంధాన్ని పెంపొందించుకోవడం వల్ల లాభాలు - లలిత లాస్య

children releation

ఒక అబ్బాయి తన తండ్రి వద్దకు వెళ్లి ‘మీరు నెలకు ఎంత సంపాదిస్తారు’ అని అడిగాడు. సమాధానంగా తండ్రి ‘చిన్నపిల్లవాడివి, ఇప్పుడే నీకు డబ్బు గురించి ఎందుకు?’ అని సున్నితంగా మందలిస్తాడు. బాబు ముద్దుగా ‘డాడీ, ప్లీజ్ చెప్పండి, కనీసం మీ సంపాదన రోజుకి ఎంత, అదైనా చెప్పండి’ అని అడుగుతాడు. సమాధానంగా అవన్నీ నీకెందుకు బాబు, నేను చాలా బిజీగా ఉన్నాను కాస్త నన్ను డిస్టర్బ్ చేయకు, వెళ్లి చదువుకో’ అని లాప్ టాప్ తో కుస్తీ పడుతుంటాడు. వెంటనే వాళ్ళబ్బాయి తన రూమ్ లోకి వెళ్లి తను దాచుకున్న అయిదువందల రుపాయిలను తీసుకుని వచ్చి తండ్రికి ఇచ్చి ‘డాడీ, ఈ డబ్బులు తీసుకుని ఒక అరగంట నాకు టైం కేటాయించండి. మీరు చాలా బిజీగా ఉంటూ నాతో టైం ని స్పెండ్ చేయటం లేదు. ఐ యాం మిస్సింగ్  యూ సో మచ్.’ అని చెప్పగానే తన కొడుకు అప్పటి వరకు తన సంపాదన గురించి ఎందుకడిగాడో తండ్రికి అర్థమయింది. 

అందుకే ఎంత హడావిడి జీవితమైనా పిల్లలతో అనుబంధాన్ని పెంపొందించుకునేందుకు కాస్త సమయాన్ని కేటాయించాలి. అయితే, ఈనాటి హడావిడి జీవన విధానం వల్ల చాలా మంది తల్లిదండ్రులకు తమ పిల్లలతో గడిపే అవకాశం కరువయిపోతోంది. తద్వారా పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్యనుండవలసిన అనుబంధం దెబ్బతింటోంది. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య తగ్గించలేనంత దూరం ఏర్పడుతుంది. దీని ప్రభావం పిల్లలపై ప్రతికూలంగా ఉంటుంది. పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దదడంలో తల్లిదండ్రులు ప్రధాన పాత్ర పోషిస్తారు. పిల్లల అభివృద్ధిని కోరుకునే తల్లిదండ్రులు కచ్చితంగా వారితో అనుబంధాన్ని పెంపొందించడానికి కృషి చేస్తారు.

పిల్లలతో అనుబంధాన్ని ఏర్పరచుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సురక్షితంగా భావిస్తారు
పిల్లలతో అనుబంధాన్ని పెంచుకోవడం ద్వారా వారికి మీరు వారు సురక్షితంగా ఉన్నారన్న భావన కలిగిస్తారు. అటువంటి పిల్లలు పేరెంట్స్ కి కలకాలం తోడుంటారు. పెద్దయ్యాక వారు తల్లిదండ్రులని కంటికి రెప్పలా చూసుకుంటారు.

ఆరోగ్యకరమైన ఎదుగుదల
పిల్లల గురించి అహర్నిశలు కేర్ తీసుకుంటుంటే వారు ఎంతో సంతోషిస్తారు. సంతోషం వల్ల వారు ఆరోగ్యంగా, త్వరగా ఎదుగుతారు. తల్లిదండ్రులతో పిల్లల అనుబంధం మెరుగ్గా ఉన్నప్పుడు వారి ఆరోగ్యంపై కూడా ఈ ప్రభావం ఉంటుంది. చదువుతో పాటు ఆటపాటలలో కూడా పిల్లలు ముందుంటారు. తల్లిదండ్రులు తమకు అండగా ఉన్నారన్న భావన వారిని ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతుంది.

స్నేహం పెరుగుతుంది..
పిల్లలే తల్లిదండ్రులకు ముఖ్యమైన స్నేహితులు. తల్లిదండ్రులు పిల్లలతో అనుబంధాన్ని పెంపొందించుకోవడం వల్ల పిల్లలు తల్లిదండ్రులకు స్నేహితులుగా మారతారు. స్వేచ్ఛగా  తమ అభిప్రాయాలను తల్లిదండ్రులతో వెల్లడిస్తారు. తల్లిదండ్రుల అభిప్రాయాలకు విలువిస్తారు.

నమ్మకం ఏర్పడుతుంది
పిల్లలతో అమితంగా అనుబంధాన్ని మెరుగుపరచుకోవడం వల్ల పిల్లలకు ప్రగాఢమైన నమ్మకాన్ని కలిగించినవారవుతారు. ఎటువంటి రహస్యాలను తల్లిదండ్రుల నుంచి దాచేందుకు పిల్లలు ప్రయత్నించరు. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించారు. పిల్లలకు నమ్మకమనే పునాదిని నిలిపేందుకు అనుబంధాన్ని పెంపొందించుకునే ప్రక్రియ తోడవుతుంది.

మీకు గర్వకారణంగా నిలుస్తారు
తల్లిదండ్రులు పిల్లలతో అనుబంధాన్ని పెంపొందించుకునే ప్రయత్నం పిల్లల్ని అన్నిట్లో ముందుండేలా చేస్తుంది. వారిలో నాయకత్వ లక్షణాలు, నిర్ణయాన్ని తీసుకునే నైపుణ్యాలని పెంచేందుకు తల్లితండ్రులకు, పిల్లలకు మధ్యనున్న అనుబంధం ప్రధాన పాత్ర పోషిస్తుంది.

మరిన్ని వ్యాసాలు

సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు