సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahiteevanam

ఆముక్తమాల్యద 

గోదాదేవి విరహంతో పలవరిస్తున్నది.

అక్కట రాధ నీకు దగవా మగవారల నత్త మామలం 
దక్కి ముకుందవేణుకలనాదపుటీలకు లేటి మెత్తమై 
త్రెక్కొను కాకచే నడికి రే లరుదెంచిన గోపికావళిన్
బొక్కగజేసి తద్రుచిర భోగము గుత్తగ నీవ గైకొనన్ 

తాము వలచినవారిని తమకు కాకుండా దక్కించుకున్న వారిని అసూయతో నిందించడం  సహజమే. అందుకని రాధను నిష్ఠూరాలు డుతున్నది.  'అయ్యో రాధ! నీకిది తగునా?తమ మగవారిని, అత్తమామలను ఎలాగోలా తప్పించుకుని, ముకుందుని వేణు  నానికి మెత్తబడి, నసు తనువూ వేడెక్కి అర్థరాత్రుళ్ళు ఇల్లువదలి వచ్చిన గోపికలను కుమిలేట్లు చేసి ఆ ముకుందుని భోగమును త్తగా, త్తంగా నువ్వే నుభవించడం న్యాయమా?' అని అడుగుతున్నది.| రాధాదేవి వ్యామోహంలో పడి మీ అందరినీ నిర్లక్ష్యం చేసినా పిచ్చిగా ఆయన వెంటే డడానికిమీకెందుకు అభిమానము, లజ్జా లేదు అని  గిలిన గోపికలను నిందిస్తున్నది.

అక్కమలాక్షు డొక్కతె నిజాంసమునం దిడి కుంజపుం 
జక్కికి గొంచుబోవ బెరచాన లినాత్మజవెంట వ్రేగున 
న్మిక్కిలి డిగ్గు పాదసరణిం జని రోయుదు రట్టె రోసి తా 
రక్కడ గాంచు టేమి వలదా యభిమాన మొకింత యింతికిన్

ఆ కమలాక్షుడు ఒకామెను(రాధాదేవిని) వీపు మీదకు ఎక్కించుకుని పూపోదరిళ్ళలోకి  వెళ్ళినపుడు మిగిలిన గోపికలు ఆ యమునానది డ్డువెంట(యినాత్మజవెంట- సూర్యుని కుమార్తె ఐన యమునానది వెంట) ఆ యిసుకలో బరువుగా లోతుగా పడిన కాలిగుర్తులను గమనిస్తూ విలపిస్తూ వెళ్లి, అక్కడ చూడడం ఏమిటి? ఆ పూపోదరిళ్ళలో, ఆ ఇసుకలో బడి మొత్తుకుంటూ తిరిగి చూసేదేముంది, ఆయన మెతో సలిపే శృంగార క్రీడలే కదా? ఆడదానికి కొంచెం అభిమానం రోషం ఉండొద్దూ? అని మందలిస్తున్నది. 

వీపున రాధను ఎక్కించుకుని మోస్తూ పరుగులు తీస్తున్నాడు కనుక ఆయన ఒక్కడి పాద ముద్రలే, బరువుగా, లోతుగా దిగబడి యమున డ్డున తడి ఇసుకలో కనిపిస్తున్నాయి. రాధాదేవి సమస్త జీవులకూ ప్రతీక ఐన జగన్మాత. 'గోలోక బృందావనం' అనే లోకం ఉన్నది. సృష్టిలో న్నిటికంటేపైన ఉన్నది, అన్నిటికంటే ఉన్నతమైనది. అక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రభువు ఐన శ్రీకృష్ణుడు ఉన్నాడు. అక్కడ ఆయన తి రాధాదేవి. ఆమె లక్ష్మి, సరస్వతి, పార్వతి, గాయత్రి మొదలైన అమ్మలందరికీ 'మూలపుటమ్మ'. ఆమె ఆ శ్రీకృష్ణుని శరీరంలో ఆత్మలో గభాగం, ఆమెయే శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడే ఆమె! ఆమె ఆయననే నమ్ముకున్నది కనుక ఆమె బాధలన్నిటినీ తీరుస్తాడు, నెత్తికెక్కించుకుని స్తాడు. జీవులందరూ స్త్రీలే అని తెలుసుకుని, ఆయనే పతి అని తెలుసుకుని, ఆయననే నమ్ముకుంటే ఎవరినైనా, ఎందరినైనా ఆయనే స్తాడు, స్తాడు,దరికి తీస్తాడు, దరి జేరుస్తాడు. అదీ రాధాకృష్ణుల రహస్యం. ఇక్కడ అప్రస్తుతం కాదేమో అని యిస్తున్నాను. అజ్ఞాత ఆంగ్ల కవి ఒకరు ' ట్ ట్స్' అని ఒక ఆంగ్ల దీర్ఘ కవిత వ్రాశారు,అందులో యిదే ప్రతీక. ' నన్ను నమ్ముకో, నీ వెంటే నడుస్తాను అన్నావు, భారంగా యింత పయనమూ సి వెనుదిరిగి చూస్తే నా ఒక్కడి కాలి గుర్తులే కనిపిస్తున్నాయి' అంటాడు తను నమ్మిన దైవంతో. ఆ దైవం చిన్న నవ్వు నవ్వి, ' అమాయకుడా  ఒక్కడిని నేనే, ఆ కాలిగుర్తులు నావే, నిన్ను మోస్తూ నేనే నడిచాను యింతవరకూ, నీ పయనము నేనే చేశాను' అంటాడు! ష దైనా భావం ఉన్నతం అయితే తెలుసుకుని ఆనందించడం సాహిత్య ప్రేమికుల  లక్షణం కనుక ఉదహరించాను.

ఇలు కలనైన వెల్వడని యీలుపుటాండ్రకు దాపికత్తెవై 
యులు కెడలించి శౌరితను యోగపు వాచవి జూపి మీద బె
ల్ల లము వియోగవహ్ని భవదంతర సైకత పఙ్క్తి పొంత వం
తల బొరలించి తౌదు శమనస్వస వుగ్రమయూఖనందినీ

గోపికలను తిట్టడం అయిపోయిన తర్వాత యింతకూ కారణమైన యమునా నదిని పట్టుకున్నది. కలలో కూడా ఇల్లు వదిలి వెళ్లి ఎరుగని అభిమానవతులు ఐన గోపికలకు తార్పుడుకత్తెవై, ఆయన శరీర మాధుర్యాన్ని రుచి చూపించి, వియోగ భారంతో నీ యిసుక తిన్నెలవెంట పడి, వంతలతో పొర్లిగింతలు పెట్టించావు, అవునులే, నీవు యముడికి చెల్లెలివి(శమనస్వస) ఉగ్రమైన కిరణాలతో మాడ్చేసే సూర్యునికి కుమార్తెవు(వుగ్రమయూఖనందిని)నీకు దయ, జాలి ఎలా ఉంటాయి చెప్పు!

నాడు మన మున్న నెట్లొ పూబోడులార 
యనిన వారలు మగుడ నా యమకు ననిరి 
యింతి నా డుండ కెందు బోయితివి నీ వ
టన్న నచ్చెరువడి వారి కతివ పలికె

మరలా దిగులుగా, గుబులుగా ' ఆహా, అప్పుడు కనుక మనముంటే ఎలా ఉండేదో, ఆయనను పొంద గలిగే దాన్నేమో' అన్నది. అప్పుడు ఆమె చెలికత్తెలు 'అప్పుడు నువ్వు లేకుండా ఎక్కడికి పోయావు?నీవు అప్పుడూ ఉన్నావు, అక్కడా ఉన్నావు' అన్నారు. గోదాదేవి ఆశ్చర్యంగా అడిగింది.

సకియలార త్రైకాలిక జ్ఞానవంతు 
లైన ఋషులట్లు పలికెద రంత యెరుక 
యెద గలిగినేని యెరిగింపు డేను మొదల 
నెవ్వతె నన్న మరి వారలిట్టు లనిరి

త్రికాలజ్ఞానులు ఐన ఋషులలాగా చెప్తున్నారు, అంత తెలిస్తే అప్పుడు, మొదలు నేనెవరిని చెప్పండి  అని అడిగింది అనుమానంగా, కుతూహలంగా, ఆశ్చర్యంగా, పరిహాసంగా! వారు చెప్పడం మొదలెట్టారు.  

(కొనసాగింపు తరువాయి సంచికలో)
***వనం వేంకట వరప్రసాదరావు      

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు