కార్టూనిస్టులతో తుంటర్వ్యూ - ..

తిక్క :గుత్తుల శ్రీనివాసరావు గారూ, అనాలోచితంగా మీరు నమస్కరింపబడబోతూన్నారా ?
తొక్క: ఆలోచితనాలోచిత నమస్కారాలకు ఒక్కటే సమధానం...నమస్కారం....

తిక్క : పావుగంటసేపు కార్టూన్లేయడం ఆపేస్తే వర్షాకాలమొస్తుందా ?
తొక్క: ఆల్రెడీ వచ్చేసింది.అందరూ నా కార్టూన్లలో తడవడం వల్ల అది తెలియడం లేదు.

తిక్క : ఆకాశంలో గంటలకొద్దీ కార్టూన్ గీస్తూ కూర్చుంటే ఎవరికి పారితోషికం అందుతుంది?
తొక్క: ఇంకెవరికి నాకే. ఆకాశం నుండి అరక్షణం లో రావడానికి నా కోసం పుష్పకవిమానం రెడీ గా ఉంది

తిక్క : సభ్య సమాజం మిమ్మల్నెప్పుడూ పట్టించుకోలేదనా కార్టూన్స్ కొంటున్నారు?
తొక్క: నన్ను పట్టించుకోకపోతే  మాత్రం ఖచ్చితంగా అది సభ్య సమాజం అయ్యుండదండీ, ఎందుకంటే సభ్య సమాజం నా కార్టూన్ల చుట్టూ తిరుగుతోంది కాబట్టే కార్టూన్లు అమ్ముకొంటున్నాను.

తిక్క : వంటింట్లో కప్పులు- భూమ్మీద ముగ్గులు, మీ తర్వాత కార్టూన్లకు ఎవరు బాధ్యులు?
తొక్క: ఆడపిల్ల, అగ్గిపుల్ల కాదేదీ కార్టూన్లకనర్హం......వాగ్దానాలు మరిచిపోయే మతిమరుపు నాయకులు, రాత్రికి కాషాయం విడిచి కన్యల్ని వెతుక్కునే బాబాలు, దొరికిన దొంగల్ని ఎలా శిక్షించాలా అని సంవత్సరాల తరబడి జుట్టు పీక్కుంటూ  సెక్షన్లు వెతుక్కొనే లాయర్లు-జడ్జిలు, సినిమా అవకాశాలు లేక చటుక్కున ప్రజాసేవ మొదలెట్టేసే సినీ నటులు ......అబ్బో.. చెబుతూ పోతే ఇలా చాలా మంది భాధ్యులే ........

తిక్క :  మీ కార్టూన్లు ఇంకులో కలుపుతారా?
తొక్క: ముందు పత్రికల్లోకలిపేసి, ఆ తర్వాత ప్రజల్లో కలిసిపోతాను..

తిక్క : మీకన్నా ముందు మీ సంతకం లేదా?
తొక్క: అక్కడే ఉంది..ఎక్కడంటే, ఆ....పుష్పక విమానం పక్కన, కపోతవనం లోపల మర్రిచెట్టు నీడలో నా సంతకం ఆరబెట్టి ఉంది...అక్కణ్ణుంచేగా నేను తెచ్చుకుని నా కార్టూన్లలో వాడుకొంటున్నాను.

తిక్క : అప్పుడెప్పుడొ కార్టూన్లు తీసేసి ఊరుకొన్నారట కదా?
తొక్క: కార్టూన్లు తీసేసి గాని, వేసి గాని ఏ ఊరు కొనలేదండీ....ప్రస్తుతానికి వేసో, తీసేసో ఇల్లు కొంటె గొప్పే.

తిక్క : మీ కార్టూన్లు ఆకాశానికతికిస్తే ఎన్ని రోజుల్లో ఊడి పడతాయి?
తొక్క: ఊడేవరకు ఎక్కడుఒచుతారండీ..!! అదీ నా కార్టూన్లంటే హై జంప్ చేసి ఊడ పీకి, పోటీలు పడి మరీ చదివేస్తారు.

తిక్క : మీ కార్టూన్లలో మునులకు నచ్చనివి, మీకు నచ్చినవి మాత్రమే వేస్తారా?
తొక్క:  రంభ...ఊర్వశి...మేనక కార్టూన్లు వేసినప్పుడు కాక మిగతా కార్టూన్లు మునులకెలా నచ్చుతాయి..

తిక్క : పోటీలకు  కార్టూన్లు పంపే బదులు హాయిగా దాచుకోవచ్చుకదా?
తొక్క: దాచడానికి పోటికి పంపిస్తున్నా. వాళ్ళు సెలెక్ట్ చేసి హాస్య ప్ర్రియుల హృదయాల్లో దాచేస్తున్నారు.

తిక్క : మూతల్లేని డబ్బాలు, హద్దుల్లేని ఆకాశం మీ కార్టూన్లలో ఉన్నాయా?
తొక్క: కొట్టుకోవడానికి ఎవరి డబ్బాలు వాళ్ళ దగ్గర ఉండనే ఉన్నాయి...నా కార్టూన్లలో డబ్బాలకు మూతల్లేవు..హద్దులంటారా, మనుషులు ఆకాశంలో ఉండగలిగితే, అక్కడా గీసుకోవచ్చు హద్దులు....

తిక్క : ఒక కార్టూన్ కాగితానికెక్కించడానికి మీరు ఎవరితో విరోధం పెట్టుకుంటారు?
తొక్క: విరోధం పెట్టుకున్న వాళ్ళనే కాగితం మీదకెక్కించి ఏకేస్తున్నాను.

తిక్క : ప్రతిరోజూ కార్టూన్లు గీస్తూ మళ్ళీ కార్టూన్లు గీస్తే పర్వాలేదా?
తొక్క: ప్రతి రోజూ కార్టూన్లు గీస్తుంటే ఇంక మళ్ళి కార్టూన్లు గీసే తీరిక దొరకడం కష్టమే.......

తిక్క : రెండు దేశాల సరిహద్దుల దగ్గర మీ కార్టూన్లు ప్రదర్శిస్తే ఏమవుతుంది?
తొక్క: అదే జరిగితే రెండు దేశాల సరిహద్దుల్లో జవాన్లు నా కార్టూన్లు తింటూ...సారీ..చదువుకుంటూ, పక పకా నవ్వుకుంటూ, చిఒదులు వేస్తూ, డాన్సులు చేస్తూ......యుద్ధాలు మర్చిపోతారు....

తిక్క : కొన్ని నెలల క్రితమే చల్లని ప్రదేశంలో మీ కార్టూన్లు ఎవరు ఆశించారు?
తొక్క: చల్లగా ఉన్న ప్రతి చోటా వేడెక్కడానికో, వేడిగా ఉన్న ప్రతి చోట చల్లబడదానికో నా కార్టూన్లు ఆశించేవారరే...  
హిమాలయాల్లో మునులకి అడపా దడపా నా కార్టూన్లే కాలక్షేపం, ఆపరేషన్ థియేటర్ లో డాక్టర్లు కూడా టెన్షన్ తగ్గించుకోవడానికి చదివేది నా కార్టూన్లే, వర్షాలు కురిసేటపుడు బయటికెళ్ళే దారి లేక పోతే చదివేది నా కార్టూన్ బుక్కులే...

తిక్క : ఇప్పటి వరకూ ఎక్కువ కార్టూన్లు ఉతికేసినట్లుగా ఊరుకున్నారెందుకు?
తొక్క: చేసేదేముంది మరి. ఉతికేసిన కార్టూన్లన్ని ఎడిటర్ల రూముల్లో ఆరబెట్టా ....అవి ఆరితే గాని కొత్తవి ఉతకలేము కదా

తిక్క : మీ తుంటర్వ్యూకి అయిన నష్టం గురించే ఉబ్జెకిస్తాన్ లో సంబరాలు జరుపుకున్నారట కదా?
తొక్క : అంత వరకూ పర్వాలేదండీ.....దానికి వాళ్ళు చీఫ్ గెస్ట్ గా పిలిచింది నన్నే....మరీ ఘోరమేమిటంటే ఆ సంబరాల్లో ఎంటర్ టైన్ మెంట్ కూడా నా కార్టూన్లే..... లైవ్ లో కార్టూన్లు గీసి నవ్వించాలి....ఆ కార్టూన్లు చదివి పడీ పడీ నవ్వి పొట్ట పగిలి హాస్పిటల్ లో చేరిన వాళ్ళు కొందరైతే, నవ్వి నవ్వి నీరస పడిపోయినోళ్ళు కొందరు....అవీ జరిగిన సంబరాలు..

తిక్క : ఈ తుంటర్వ్యూ మిమ్మల్నెక్కిడికి తీసుకుపోతుందోనని ఎవరైనా భయపడ్డారా?
తొక్క : నేనే బాగా భయపడ్డానండి .... తుంటర్ వ్యూ నన్నెక్కడికో తీసుకెళ్ళాక ఎవరి రంగులు బయట పడతాయో!? వాళ్ళు నన్నేం చేస్తారో అని !....

తిక్క :  కార్టూన్లకు విలన్లు అవసరమా?
తొక్క:  పేపరు, పెన్సిలు, ఇంకు బాగా అవసరం....

తిక్క : ఈ తుంటర్వ్యూ వల్ల కొత్త సమస్యలు పరిష్కారమవుతాయనుకొంటున్నారా, పాత సమస్యలు పునరావృతమవుతాయా?
తొక్క; కొత్త, పాత సమస్యలు పరిష్కారమై, పాత, కొత్త సమస్యలు పునరావృతమవుతున్నాయనుకుంటున్నాను.

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు