కార్టూనిస్టులతో తుంటర్వ్యూ - ..

 

తిక్క : రాం ప్రసాద్ గారూ, ఆ నమస్కారాలూ, ఈ నమస్కారాలండీ...
తొక్క: ఇంకా ఆ,ఇ లేనా ....అమ్ ,అహా నమస్కారాలండీ !

తిక్క : ఆకాశానికి నిచ్చెనలేయకుండా, కార్టూన్లెందుకు వేస్తున్నారు?
తొక్ : దానికి...దీనికి పెద్ద తేడా లేదని..!

తిక్క : మీ కార్టూన్లు హాని కన్నా కీడు ఎక్కువగా కలిగిస్తాయా, లేక మంచికన్నా సత్ఫలితాలనెక్కువగా కలిగిస్తాయా?
తొక్క:మరీ ఎక్కువ నవ్వితే కడుపునొప్పి కలిగిస్తాయండి..!

తిక్క : మీ కార్టూన్లకి అంతర్జాతీయ బహుమతులెందుకు తీసుకుంటున్నారు?
తొక్క:చెయ్యడానికి పనీ లేదూ, కూర్చొనే తీరికా లేదు కదండి....అందుకే..

తిక్క : కారణాలేవైనా పరిష్కారాలు మీ కార్టూన్లలో ఉంటాయా?
తొక్క: సమాధానాలులేని ప్రశ్నలకు , సమాధానాలున్టాయా చెప్పండి......నో డైలాగ్ ..!

తిక్క : మీ కార్టూన్లలో రాం ప్రసాద్ అనే సంతకమే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోందట, నిజం అబద్ధం కాదంటారా?
తొక్క: అబ్బ.. ఛా...అంతావుట్టిదే...!! 

తిక్క : ఏ సైన్యాధ్యక్షుడి హోదాలో మీ కార్టూన్లకు ప్రాచుర్యం వచ్చింది?
తొక్క: వానరసైన్యాధ్యక్షుడి హోదాలో....

తిక్క : సామజిక సమస్యల మీద కార్టూన్లు సంధిస్తున్నారు, సమాజానికేం అవదా?
తొక్క: నెమ్ముచేసి తుమ్ములు రావచ్చు......కఫం చేరి దగ్గులు రావచ్చు ....    ఇంకా ఏదైనా అవచ్చు.....!!

తిక్క : పరిగెత్తడానికి ముందు మీ కార్టూన్లు చూస్తే ప్రమాదాలను నివారించవచ్చంటారా?
తొక్క: స్పీడు పెంచుకోవచ్చంటాను.....పారిపోవడానికి...!!

తిక్క : మీరు కార్టూన్లేస్తుండగా చూసిన వాళ్ళకు క్యూబా అధ్యక్షుడేమైనా బహుమతులు పంపుతాడా?
తొక్క: తప్పకుండా పంపుతాడండి.....కిలో ఉల్లిగడ్డలు...ప్లస్ వారి దేశం ఆధార్ కార్డున్నూ..!!

తిక్క : మీ కార్టూన్లు చప్పగా ఉండడానికి ప్రయత్నం ఎందుకు చేయరు?
తొక్క: చప్పగానే గీస్తుంటానండి.... కిచెన్ పక్కనే ఉండటంవల్ల ఉప్పు,కారం తగిలి   రుచులు మారిపోతుంటాయి....

తిక్క : ఎవరి తపస్సుకు మెచ్చి, మీరు కార్టూన్లు గీస్తున్నారని వెతికితే, స్కంద పురాణంలో ఎక్కడా కనిపించదే? మరి అర్జునుడూ, రావణుడూ ఫీలవరా?
తొక్క: 'కంద' పురాణం చూడండి .... తప్పక కనబడుతుంది ...అందులో
జిలాసురుడు, దురదాసురుడు అనే ఇద్దరు ఫీలవుతుంటారు కుడా...!!

తిక్క : మీరు ఇంగ్లీషులో సంతకం చేస్తున్నారని శ్రీలంక అధ్యక్షుడు కరీమ్నగర్ వచ్చినప్పుడు జ్యోతిబసుతో చెప్పి బాధపడ్డాడట కదా?
తొక్క: వెరీ షాకింగ్...ఈ విషయం నేను స్కాండల్ దీవి టూర్లో వున్నప్పుడు ఫచెబూక్ లో చూసాను ...వెంటనే వ్హత్సప్ప్ లో ఆయన్ని చాలాసేపు ఓదర్చానుకూడా...!

తిక్క : మీకార్టూన్లు బాగుంటున్నాయా, లేదా?
తొక్క:  సైలెన్స్ ప్లీజ్ ...!!

తిక్క : అందితే జుట్టు, అందకపోతే కార్టూన్లు అంటే ఏమిటని ఎవరైనా అడిగారా మిమ్మల్ని?
తొక్క: ఈ మాటర్ పై చాలామంది చెవులు కొరుక్కుంటున్నారట....చివరికి ఏం చేయాలో 
తోచక... గోళ్ళు కొరుక్కుంటున్నారట....!

తిక్క : అసలు రాం ప్రసాద్ అంటే ఎవరో మీకు తెలిసే సంతకం చేస్తున్నారా?
తొక్క: ప్రతిరోజూ తలదువ్వుకోవడానికి ఆదంలోకి తొంగి చూసినప్పుడల్లా ఆయనే కనిపిస్తుంటాడండీ.......అందుకే అయన సంతకం ఫోర్జెరి చేసేస్తుంటా...

తిక్క : మీ తుంటర్వ్యూ సంగతి మీకెవరు చెప్పారని ఎవరితో ఎవరు చెప్పారు?
తొక్క: ఎవరో ఎవరితోనో చెపితే...చెవిటివాడైన నా బాడీగార్డ్ విని చెప్పాడండీ,,

తిక్క : చూడడానికి మీ తుంటర్వ్యూ ఎలా వుంటుందనుకొంటున్నారు?
తొక్క: రెండు చెవులతో చూసినంత మజాగా...!!

తిక్క : సరే, ఇక తుంటర్వ్యూ అయిపోలేదనుకుంటున్నారా, కృతజ్ఞతలెవరికైనా చెప్పారా?
తొక్క: చైనా రాయభారికి , జపాన్ బాటసారికి కృతజ్ఞతలు చెప్పాలండి... శెలవా మరి...!!

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు