బంగాళ దుంప మసాలా కూర - పి.శ్రీనివాసు

కావలిసిన పదార్హ్దాలు:  ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి ముద్ద, కారం, ఉప్పు, పసుపు, పెరుగు, ఆలుగడ్డలు

తయారుచేసేవిధానం:  ముందుగా ఆలుగడ్డలకు పెరుగు, కారం, ఉప్పు, పసుపు వేసి వాటికి బాగా పట్టించాలి. తరువాత  బాణలిలో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి  అవి వేగాక తయారుచేసి వుంచిన బంగాళ దుంప మిశ్రమాన్ని అందులో వేయాలి. 10 నిముషాలు మూత వుంచి తరువాత బంగాళదుంపలు మునిగేంత వరకు నీళ్ళుపోయాలి. మళ్ళీ 5 నిముషాలు ఉడకనివ్వాలి. అంతే వేడివేడి బంగాళదుంప మసాల రెడీ..