కావలసిన పధార్థాలు
గసగసాలు, నూనె, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కారం, పసుపు.
తయారు చేయు విధానం :
ముందుగా గసగసాల్ని గ్రైండ్ చేసుకుని, నీళ్ళు అందులో నీళ్ళు కలిపి పేస్ట్ లా తయారు చేసి పెట్టుకోవాలి.
బాణలిలో నూనె వేసి, కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఎర్రగా అయ్యేవరకు వేగాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గసగసాల పేస్ట్ ని అందులో వేయాలి. ఆయిల్ బయటికి వచ్చేవరకు బాగా కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్ళు కలిపి మూత పెట్టాలి. అంతే.....ఘుమఘుమలాడే గసగసాల కూర రెడీ....
వేసవిలో ఈ గసగసాల కూర తింటే ఒంటికి చలువ చేస్తుందని పెద్దవారి మాట....