కార్టూనిస్టులతో తుంటర్వ్యూ - ..

తిక్క : గోడమీద నమస్కారాలు శ్రీగద్దె శంకర్ గారూ 
తొక్క: ఏ గోడ మీదుండి నమస్కారాలు పెట్టినా... సంస్కారంగా నమస్కారం పెడితె ప్రతి నమస్కారం పెడుతా..

తిక్క : కారు అద్దాలు పగలగొట్టకుండానే కార్టూన్లు ఎందుకు గీస్తున్నరట ఇది అబద్దం  కాదూ?
తొక్క: హమ్మా...! నావి పగలగొట్టిద్దామనే...! మీ కార్ నంబర్ చెప్పండి అలాగే చేస్తా ...

తిక్క : ఎవరి మీద ప్రమాణం చేసి కార్టూన్ల మీద సంతకం వదిలేశారు?
తొక్క:ఏ "వరి"(paddy)  మీద చేయలేదు . "నా " మీద ప్రమాణం  చేసి "మీ" మీద .. వదులుతున్నా..

తిక్క : వేరెవరి కార్టూన్ల పైనా శ్రీగద్దె అనే సంతకమే కనిపించనందుకు సంతోషిస్తున్నారా?
తొక్క: లేదు. శ్రీగద్దె బల(గ)ం పెరిగితే..సంతోషమేగా (బూస్ట్ తాగుతూ..)

తిక్క : పరశురాముడు గొడ్డలి వాడినప్పుడు మీ కార్టూన్లకి భయపడి వాలి ఎక్కడ దాకున్నాడు? 
తొక్క: భయపడలా.., నా కార్టూన్స్ చూసి "కదుపుబ్బ" నవ్వి కడుపు "ఉబ్బరాన్ని" తగ్గించే ప్రయత్నంలో టాయ్ లెట్ రూంలో ఉన్నాడంతే...

తిక్క : పట్టుబడిన ఛోటా రాజన్ చేత పోలీసులు మీ కార్టూన్ల మీద అభిప్రాయం చెప్పించగలరా ?
తొక్క: దొంగ పోలీస్ లకు ఏకాభిప్రాయం కుదరకపోతే కార్టూన్ల మీదేం కర్మ కర్టెన్లమీద కూడా అభిప్రాయం చెప్పించగలరు.

తిక్క : మీరే ఎందుకు కార్టూన్లు గీస్తున్నారు?
తొక్క: మీరే ఎందుకు  ప్రశ్నిస్తున్నారో...!? తల పగలగొట్టుకోవడానికి  ఏ రాయి అయితే ఏం?...

తిక్క : తీసుకున్న బహుమతులు మీ కార్టూన్లకు తినిపిస్తున్నారా?
తొక్క: బహు "మతులా.....?!" నా కార్టూన్స్ ప్యూర్ వెజిటేరియన్. "మతులు(బ్రైన్స్)" తినవు....గమ్మతులు తింటాయి.

తిక్క : ఏ యాగమొనర్చి ఆనాటి మహారాజులు మీ కార్టూన్లకు ప్రాణం పోశారు?
తొక్క: హాస్యమేధయాగం.....నవ్వులయాగం అబ్బో చాలా యాగాలు చేసారులెండి....

తిక్క : చిక్కుడు గింజలు-తాటి ముంజలు, పెళ్ళిబాజాలు-మడతకాజాలు అన్నీ కలిపి ఉడకబెడితే మీ కార్టూన్లు తయారయ్యాయా?
తొక్క: ఇలాంటి తొక్క ప్రశ్న లు ,తిక్కమొహాల తిక్క,ఏడుపుగొట్టు మొహాల ఏడుపు అన్నీ కలగలిపి పక్కింటావిడ కడుపు"మంట"తో ఉడకబెడితే....నా కార్టూన్లు తయారయ్యాయి

తిక్క : మీ కార్టూన్లు అస్తిత్వాన్ని కోల్పోయాయా?
తొక్క:  ఇండియన్ ఇంక్ ను మాత్రమే కోల్పోయాయి

తిక్క : మీ కార్టూన్లపై ఎప్పుడైనా దొంగలు పడ్డారా?
తొక్క: చాలా సార్లు పడ్డారు కానీ  .కడుపుబ్బ నవ్వి పడిలేచారు.

తిక్క : మీ తుంటర్వ్యూ ఎందుకు వస్తోంది?
తొక్క: నవ్వలేని వాల్ల తిక్క కుదర్చడానికి.

తిక్క : మీ కార్టూన్ల స్వభావం మీకు బాగా అర్థమైందా?
తొక్క: పత్రికలకు పంపించేటప్పుడు నన్ను చూసి ముసిముసిగా నవ్వుతున్న నా కార్టూన్స్ ...తిరుగు టపాలో వచ్చినప్పుడు నన్నే కోపంగా చూస్తుంటాయి.....

తిక్క : కూర్చుని తింటే కార్టూన్లు అరిగి పోతాయా, కరిగిపోతాయా?
తొక్క: కూర్చొని తింటే  ఏమి అరగవు కరగవు కానీ "తిని" కూర్చుంటేనే.....అన్నీ అరిగి కరిగి ఆవిరైపోతాయి.

తిక్క : మీ తుంటర్వ్యూ గురించి ఎక్కడ వెతకాలనుకొంటున్నారు?
తొక్క: గూగుల్ సర్చ్ లో కాదులెండి, పాఠకుల నవ్వుల్లో

తిక్క : ఈ తుంటర్వ్యూలో మీరెక్కడున్నారు?
తొక్క: కోస్తున్నప్పుడే మాత్రం ఏడిపించె ఉల్లిగడ్డ కొనిపిస్తూ ఏడిపిస్తున్న  సంతలో ఉన్న . "ఉల్లిగడ్డ కావాలా బాబూ...?"

తిక్క : సరే తుంటర్వ్యూ మొదలైతే ఏం చేస్తారు?
తొక్క: ముగింపులో మొదలెట్టి... మొదలంటూ ముగించి ముగించాక మొదలెట్టి చూసుకుంటూ మురిసిపోతూ... వుంటా... బై బై..లైబాయ్..లక్స్...

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి