కార్టూనిస్టులతో తుంటర్వ్యూ - వేముల రాజమౌళి

తిక్క : వేముల రాజమౌళి గారూ, మీ ఇంట్లో మిరపకాయ బజ్జీలుంటే, వాటికి నమస్కారం...
తొక్క: నా కార్టూన్ల లాగానే అవి.. తింటారా మరి.. బజ్జీలు రాల్తాయ్..!

తిక్క : కరెస్పాండింగ్ కోర్సులో రాజకీయాలు నేర్చుకొన్నారా?
తొక్క:"రెస్పాండ్" లేని కోర్సులు... తీర్చుకున్నాను.. అంతే?!

తిక్క : బడబాగ్ని భట్టారకుడు మీ కార్టూన్ల గురించి వేముల రాజమౌళితో ఏం చెప్పాడు?
తొక్క:వాడా... దొరికితే ... బట్ట్లూడదీసి కొడతానంటాడేమో?

తిక్క : అసలు మీకేం తెలీదని కార్టూన్లు గీస్తున్నారు?
తొక్క: తెలిస్తే కదా.. గీసేది.. ఎవరన్నారు.. నేను కార్టూన్లు గీస్తున్నానని.

 

తిక్క : శ్రీమంతుడు సినిమా రిలీజ్ అయ్యేనాటికి మీ కార్టూన్లెన్ని మిగిలిపోయాయి?
తొక్క: ...మీకు కావలిసినన్ని...!! 

తిక్క : సముద్రుడు మీ కార్టూన్లు ఇవ్వమని ఎప్పుడైనా మీదగ్గరకొచ్చి అడిగాడా?
తొక్క: అది..పత్రిక ఎడిటర్లను అడగాలి... ఎందుకంటే వాళ్ళు మనం పంపిన కార్టూన్లు ఇచ్చింది వారికే కదా...!!

తిక్క : అంగ,వంగ,కళింగ రాజ్యాలలో ఎక్కడ మీ కార్టూన్లు స్థాపించారు?
తొక్క:అక్కడే .. "త్రిశంకు" లో అంటే.. మీరేమంటారు?  

 

తిక్క : మీ కార్టూన్లను పణంగా పెట్టి కనుచూపుమేరలో కనిపించని వాటికి సైనికులనెప్పుడైనా పంపారా?
తొక్క:అయ్యో .. అలా అంటారేం సారు!!.. మీ దాకా వారు రాలేదా? పంపించాను కదా...!!

తిక్క : ఇక మీరు కార్టూన్లు ఆపే అవసరం ఎవరికీ లేనట్ట్లేనా?
తొక్క:ఇంకో .. 20 సంవత్సరాల దాకా..అంతే.. యమధర్మరాజు ఆజ్ఞ ఇచ్చాడు కదా...

తిక్క : మీరు అందుకోని అంతర్జాతీయ బహుమతులు గుర్తున్నాయా?
తొక్క: గుర్తుకు తెచ్చుకుంటున్నాను సార్..!! గుర్తుకు రావేమో?!

తిక్క : చిరంజీవి డైరెక్షన్ లో, రాం గోపాల్ వర్మ హీరోగా, నరేంద్రమోదీ నిర్మించబోయే బెంగాలీ చిత్రానికి మీ కార్టూన్లెలా ఉపయోగపడతాయి?
తొక్క:"సైలెంట్" కార్టూన్లుగా...!!

తిక్క : మీరు కార్టూన్లేస్తున్నంత మాత్రాన ఏపీకి జాతీయహోదా ఇచ్చేయాల?
తొక్క:ఎవరన్నారు..ఇవ్వచ్చు..ఇస్తే నా కార్టూన్లదే.. ఇవ్వకున్నా..నా కార్టూన్లదే..కీర్తికి!

తిక్క : మీ తుంటర్వ్యూ కోరుకున్నవాళ్ళపై మీరు పగపడతారా?
తొక్క:  "రాత్రి" పడతాను...

 

తిక్క : తుంటర్వ్యూలో మీరు ప్రశ్నలు బాగా చెప్పానని అనుకొంటున్నార, మాధవ్ గారే సమాధానాలు బాగా అడిగారని అనుకొంటున్నారా?
తొక్క:పిండికొద్దిరొట్టే"..ఐడియా కొద్ది కార్టూన్ అడిగినా కొద్ది..జవాబు..మీరన్నాట్లు అడిగేవారికి చెప్పేవారు లోకువ కదా..అని!!

తిక్క : మీ కార్టూన్లు చూడడానికి ఇసుకేస్తే రాలనంతమంది వచ్చారని చెప్పుకోవడానికి ఇసుక వేసి చూస్తారా?
తొక్క: సిమెంట్ కలిపిన ఇసుక వేసానని అంటే మీరు ఏమంటారు..!!

 

తిక్క : ఎక్కడైనా మీ తుంటర్వ్యూ మొదలైతే ఏం చేస్తారు?
తొక్క:సైలెంట్ కార్టూనిస్టుగా ..ముకుక్కు మీద )పెన్ను) బ్రహ్ వేసుకుంటా!!  

తిక్క : వేముల రాజమౌళి పేరుకీ , మీకూ ఏమైనా సంబంధం ఉందా?
తొక్క: ఏమూలకో రాజాలాగ వుందంటాను.. 

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి