ఆముక్తమాల్యద (గతసంచిక తరువాయి)
ఆముక్తమాల్యదలో ఆఖరి, ఆరవ ఆశ్వాసములో ఒక అద్భుతమైన సందేశాన్ని జొప్పించి 'మాలదాసరి' కథను చెబుతున్నాడు శ్రీకృష్ణదేవరాయ చక్రవర్తి. అర్థరాత్రి పిల్లిని చూసిన భయముతో కూసిన కోళ్ళ కూతలకు తెల్లవారిందని భ్రమపడి, చిమ్మచీకటిలోనే

బయలుదేరి, దారి తప్పి ఒక నిర్జన అటవీప్రదేశాన్ని చేరుకున్నఆ మహాభక్తుడు, మహానుభావుడు, మాలదాసరి, భయంకరమైన దృశ్యాన్ని చూశాడు.
కాంచెన్వైష్ణవుఁ డర్ధయోజన జటాఘాటోత్థశాఖోపశా
కాంచెన్వైష్ణవుఁ డర్ధయోజన జటాఘాటోత్థశాఖోపశా
ఖాంచఝ్ఝాటచరన్మరుద్రయ దవీయః ప్రేషితోద్యచ్ఛదో
దంచత్కీటకృత వ్రణఛ్చలన లిప్యాపాదితాధ్వన్యని
స్సంచారాత్తమహాఫలోపమఫలస్ఫాయ ద్వటక్ష్మాజమున్
ఒక బ్రహ్మాండమైన వటవృక్షాన్ని చూశాడు. దాని ఊడలు అర్ధయోజనము పొడవునా నేలకు దిగి వున్నాయి. యోజనం అన్నా, ఆమడ అన్నా నాలుగు క్రోసుల దూరం. క్రోసు అంటే రెండు మైళ్ళు. ఒకయోజనం అంటే ఎనిమిది మైళ్ళు అన్నమాట. అర్ధ యోజనం అంటే నాలుగు మైళ్ళ పొడవు ఊడలే ఉన్నాయి, ఆ మర్రిచెట్టు అంత ఎత్తున్నదన్నమాట. ఆ ఊడలకు అనేక శాఖోపశాఖలుగా యింకా ఊడలు

పెరిగి ఉన్నాయి. వాటికి పురుగులు తొలిచి కన్నాలు చేసిన ఆకులు గాలికి విడి ఎగురుతున్నాయి. ఆ ఆకులమీద పురుగులు తొలిచిన కన్నాలు, గీతలు చూడడానికి ఆ మర్రిచెట్టు తన ఆకులు అనే కాగితాలమీద 'ఈ వృక్షం మీద బ్రహ్మరాక్షసి ఉన్నది' అని సమాచారాన్ని చేరవేయడానికి వ్రాసిన ఉత్తరాలలా ఉన్నాయి. దారిన వెళ్ళే పథికులకు బ్రహ్మరాక్షసుడు ఉన్నాడిక్కడ, యిటు రాకండి అని హెచ్చరించి వారి ప్రాణాలను కాపాడిన పుణ్య ఫలంగానేమో అన్నట్లు పెద్ద ఫలములు ఉన్నాయి మర్రిచెట్టుకు. అలాంటి భీతావహమైన మర్రిచెట్టును చూశాడు దారితప్పిన ఆ భక్తుడు.
కాంచి యాతఁ డొక్క కాలి త్రోవయు నంతఁ
కాంచి యాతఁ డొక్క కాలి త్రోవయు నంతఁ
గాంచి యందుఁ దెరువుఁ గాంచినదియ
పరమలబ్ది గాఁగఁ ద్వరితంపుగతి నవ్వ
టావనీజ మంత నంతఁ గదిసి
ఆ భయంకరమైన మర్రిచెట్టును చూశాడు అతను. ఆ చెట్టువద్దకు వెళ్తున్న ఒక కాలిబాటను కూడా చూశాడు. ఏ దారీ తెలియకుండా తిరుగుతున్నాడు కనుక అంత భయంకరమైన చెట్టువద్దకు వెళ్తున్న కాలిదారిని కూడా 'యిదే మహా ఫలం' యిదే ఒక అదృష్టం అనుకుని ఆ కాలిబాటగుండా చెట్టుకు దగ్గరకు వెళ్ళాడు. అక్కడ యింకా భీతావహమైన దృశ్యాన్ని చూశాడు.
ఎలనీటి బొండలంబులువోలె మెదడెల్ల
జుఱ్ఱి వైచిన డొల్లు పుఱ్ఱెగములు

నెఱచి గీఱిన జీర లేర్పడఁ దుదముట్టఁ / జీఁకిన నులిపచ్చి కీకసములు
దొనదొనమను నీఁగె తుట్టెల రూ పేఱు / పరక క్రంపలను వ్రేలెడు గరుసులు
ధూళ్ళ మక్కెక్కి మంగళ్ళతిప్పలు రేఁగు / వడువున గాలి నాడెడు వెఱకలుఁ
దునిసిన నరాంగకములఁ బొత్తులను గమిచి
దునిసిన నరాంగకములఁ బొత్తులను గమిచి
పోక యొండొంటితోఁ బిఱువీకులాడు
శ్వాపదంబులుఁ, బదహతి వ్రస్సి వలచు
పరుగు దఱచగు ముఱుత్రోవ నరిగె యెదుట
లేత కొబ్బరినీళ్ళను పీల్చేసి, పారేసిన కొబ్బరి బోండాల లాగా మెదడు మొత్తాన్ని పీల్చిపారేసిన డొల్లు పుర్రెలు పడి ఉన్నాయి. గీకి గీకి మాంసాన్ని మొత్తం పీల్చిన పచ్చి బొమికలు పడి ఉన్నాయి. కంపలమీద వ్రేళ్ళాడుతున్న పచ్చి చర్మపు ఖండాలు కనిపించకుండా దొన దొన మని జోరీగలు ముసురుతున్నాయి. ధూళి కొట్టుకుని కనరెక్కిన మంగలి వాళ్ళ స్థలాలలో వెంట్రుకల కుప్పలు ఎగిరినట్లు, మానవ

శరీరాలమీది రోమాలు, కేశాలు గాలికి ఎగురుతున్నాయి. మా నవశరీరాల ఖండాలను కరిచిపట్టుకుని అక్కడినుండి కదలకుండా ఒకదానితో ఒకటి పెనగులాడుతున్న దుష్ట జంతువులు కనిపిస్తున్నాయి. కాళ్ళతో తన్ని పగిలి కంపు కొడుతున్న మాంసపు వరుగుల కుప్పలు కనిపిస్తున్న ఆ కాలిబాటవెంట ముందుకు వెళ్ళాడు ఆ భక్తుడు. ముందరికాళ్ళమీద సాగిలపడి, పైకి దొంగచూపులు చూస్తూ, మాంసపు ఖండాలను ఎత్తుకుని పారిపోతున్న కుక్కలు కనిపిస్తున్నాయి. మాంసపు పోగులను కరుచుకున్న గ్రద్దలు కొమ్మలమీదినుండి ఎగిరిపోతున్నప్పుడు ఆ గాలికి దుర్వాసన వ్యాపిస్తుండగా ఆ గ్రద్దల అరుపులు వినిపిస్తున్నాయి. ఆ బ్రహ్మరాక్షసుడి దారికి అడ్డంగా వచ్చి,
వాడి చేతి చరుపులకు నడుములమీద చేతులు పెట్టుకుని అరుస్తూ పారిపోతున్న కోతులు కనిపిస్తున్నాయి. యిదంతా చూస్తూ బిక్కు బిక్కుమంటూ, 'యిక్కడెవడో భయంకరుడు ఉన్నాడు, వాడు మనిషి గాడు, ఎలారా దేవుడా, వెనక్కు వెళ్ళాలన్నా చాలా దూరం' అనుకుంటూ ముందుకు వెళ్ళాడు ఆ భక్తుడు, దాసరి. వెళ్లి..
మృతమర్త్యు రెంటాన నిడ్డఁ జాలక నెత్రు
రంజిల్లు పెనుపొట్ట ముంజివానిఁ
బల్లచీమల వక్ర భల్లాతకియుఁబోలె
నెఱ్ఱ దుప్పటి నొప్పు కఱ్ఱె వాని వ్యత్యస్త హస్తిమ స్తాభఁ బాయగు గడ్డ
మును దంష్ట్రికలుఁ బొల్చు మొగమువానిఁ గడుఁదుర్ల నిడుత్రుట్టె గతిఁ జోఁగలోఁ బాండు
రత మించు కపిలకూర్చంబువాని
నెఱకుఁదెరువరిఁ గన శాఖ లెక్క జారు

ప్రేవుజందెంబుఁ గసరి పైఁ బెట్టువాని
వ్రేలు డగుబొజ్జ గల బూర కాలి వానిఁ
జెంబుతలవాని నవటుకచంబువాని
తనచేతిలోచచ్చినవాడి శవాన్ని గోచీలాగా పెట్టుకున్నవాడిని చూశాడు. గోచీగా ఆ శవం నిడివి చాలక, లాగి, లాగి మొలతాడులో దోపుకోవడంవల్ల ఆ శవం ఛిద్రమై ఒంటి నిండా రక్తం స్రవిస్తున్న భయంకరుడిని చూశాడు. ఎర్రచీమలు నిండా పాకుతున్న నల్లని జీడి చెట్టులా ఎర్రని దుప్పటిని కప్పుకున్న నల్లటి భయంకరాకారుడిని చూశాడు. ఏనుగు తలను తలకిందులు చేసినట్లు కోర దంతాలు పైకి పొడుచుకువచ్చి, నోటిక్రింద చాలా పెద్దదైన గడ్డంతో ఉన్న వికృత భయంకరాకారుడిని చూశాడు. కందిరీగల గుంపులా గుంటగా పాండు

వర్ణంలో ఉన్న నుదుటితో భయంకరంగా ఉన్నవాడిని చూశాడు. 'ఎర'కోసం, తిండికోసం దారినబోయే వాడెవడన్నా ఉన్నాడా అని చూడడం
కోసం కొమ్మలమీదికి ఎక్కినపుడు జారిపోయిన ప్రేగుల జందెమును కసిరి తిట్టుకుంటూ భుజము మీదికి నెట్టుకుంటున్న వాడిని, వ్రేలాడుతున్న పొట్టతో,బూరల్లా ఉన్న కాళ్ళతో, చెంబులా నున్నగా ఉన్న తలతో ముచ్చెనగుంటలో జుట్టు ఉన్న వికృత భయంకరాకారుడిని చూశాడు ఆ భక్తుడు, మాల దాసరి.
కండకన్నులవాని, నాఁకటను బండు
కండకన్నులవాని, నాఁకటను బండు
తిట్ల బేతాళికల సారెఁ దిట్టువాని,
నగగరిమవాని, నన్వర్థ నాముఁ, గుంభ
జాను వనునొక్కద్విజనిశాచరునిఁ గనియె
కళ్ళల్లో కండలు పెరిగిన వికృతాకారుడిని, ఆకలితో తోటి ఆడ దయ్యాలను మాటిమాటికీ బండబూతులు తిడుతున్నవాడిని, కొండలా ఉన్నవాడిని,కుండలవంటి మోకాళ్ళతో 'కుంభజానువు' అనే సార్ధక నామధేయుడైన ఒక బ్రహ్మరాక్షసుడిని చూశాడు భాగవతోత్తముడైన ఆ మాలదాసరి.
(కొనసాగింపు వచ్చేవారం)
వనం వేంకట వరప్రసాదరావు