కళ కొత్త రూపును సంతరించుకుంటోంది......సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది....కళాకారులు కూడా పాత పద్ధతులనే ఫాలో అవకుండా సరికొత్త ఒరవడులను ఒడిసి పట్టుకుంటున్నారు... ముఖ్యంగా చిత్రకళారంగంలో వస్తోన్న వినూత్న మార్పులు కార్టూనిస్టులకు, ఆర్టిస్టులకు సరికొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి...ఒకప్పటి రంగులూ, బ్రష్హులూ, పెన్నుల స్థానాన్ని మౌస్ ఆక్రమిస్తే, ఇప్పుడా స్థానం నుచి మౌస్ ని పక్కకు తోసేసి, తెరమీదకొచ్చిందే వేకోం టాబ్లెట్.... యానిమేషన్ కంపెనీల్లో, కొన్ని మల్టి నేషనల్ డిజైనింగ్ స్టూడియోల్లో ఆర్టిస్టులకు వేకోం పై బొమ్మలేయడం అలవాటైనప్పటికీ ఇంకా ఈ ఉత్పత్తికి ప్రచారం జరిగి ప్రతి కార్టూనిస్టు చేతికీ ఇది అందాల్సిన అవసరం ఎంతైనా ఉంది...
ఆ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొనే ఆ కంపెనీ వారు విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మరొక విశేషం ఏమిటంటే, ఈ టాబ్లెట్ గురించి ఆర్టిస్టులకు వివరించాలంటే మామూలు సేల్స్ ఎక్జిక్యూటివ్ లకన్నా ఆర్టిస్టు అయితేనే బాగా వివరించగలరన్న ఉద్దేశంతోనే కార్టూనిస్టు హరికృష్ణను ఎన్నుకోవడం మంచి నిర్ణయమే...ఈ ప్రచార క్రమంలో భాగంగా ది. 6-12-2015న హైదరాబాద్ లో ఉదయం గం.10:30 లకు మన కార్టూనిస్టుల కోసం "కంప్యూటర్ లో కార్టూన్లు పెన్ టాబ్లెట్స్ తో ఎలా వెయ్యాలి" అనే అంశం మీద డిజిటల్ కార్టూనింగ్ వర్క్ షాప్ వేకోం కంపెనీ నిర్వహించింది. ఈ వర్క్ షాప్ లో కార్టూనిస్ట్ హరి కృష్ణ ద్వారా వేకోం టాబ్లెట్స్ తో కార్టూన్లు సులభంగా ఎలా గీయచ్చో తెలుసుకొని, వాటిని ట్రై చేసారు మన కార్టూనిస్టులు.
ఈ వర్క్ షాప్ కు కు రాంపా, సత్యమూర్తి, భార్గవి, రామ కృష్ణ , వేముల, ఓ నావ, లేపాక్షి, సూర్య, మచిలీపట్నం పామరు(కృష్ణ), చక్రవర్తి, నూకపతి, బాచి, భూపతి, మోహన్ కుమార్, చిన్నన్న, ప్రసాద్ కాజ, సబ్బీర్, వాసు, అరుణ్, వెంటపల్లి, మాకిరెడ్డి, వపా తదితర కార్టూనిస్టులు హాజరయ్యారు. కార్టూనిస్టుల కోరిక మేరకు ఇలాంటి వర్క్ షాప్ మరిన్ని నిర్వహించేందుకు వేకోం సంసిద్దంగా వుంది. మీ ఏరియాలో వర్క్ షాప్ నిర్వహించాలంటే కార్టూనిస్ట్ హరి కృష్ణ (సెల్ :9951817518), ముఖేష్ తివారీ, రీజినల్ సేల్స్ మేనేజర్, వేకోం (సెల్:9866591995) లను సంప్రదించగలరు.