కార్టూనిస్టులతో తుంటర్వ్యూ - ..

.

 

తిక్క : కాశ్యప్ గారు..కాసిని నమస్కారాలున్నాయి తీసుకుంటారా
తొక్క :పురస్కారాలే లేవు! తిరస్కారలెందుకు!ఆస్కార్ వుంటే ఇద్దూరు!


తిక్క : మరీ అంత ఇదిగా వుంటే కార్టూన్లెందుకు గీసేస్తున్నారు?
తొక్క :  చెత్త బుట్టల కోసం! స్వచ్చ భారత్ కోసం !

తిక్క : పోనీ కొన్ని అంతర్జాతీయ బహుమతులు వదిలేసి చూడలేకపోయారా?
తొక్క :ప్రాంతీయ బహుమతి ఇవ్వమని ఒబామా ని అడిగా!అంతర్జాతీయ బహుమతి ఇవ్వమని బాబు నడిగా!

తిక్క : రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికీ, మీ కార్టూన్లకూ అస్సలు సంబంధమే లేదనుకుంటున్నారా?
తొక్క :చిలకులూరి పేట చిదానందంకి, పాకిస్తాన్ లో ఫాతిమా కి నా కార్టూన్స్ తో  అక్రమ సంబంధం వుంధి! 

తిక్క : మీ కార్టూన్లలో హాస్యం చాలా బాగుంటుందని ఎవరైనా పొగుడుతుంటే, ఎందుకు మీరు బాధపడతారు?
తొక్క :గతంలో ఎర్రగడ్డ, చినవాల్టైర్ లో నా కార్టూన్లకు విపరీత స్పందన వచ్చినంధుకు!

తిక్క : బర్ఫీ తిన్నా, జాగ్రఫీ చదివినా, కాఫీ తాగినా, మీ కార్టూన్లు చూసిన ఆనందం కలగదా?
తొక్క : అడుక్కొని అరిసెలు తిన్న ఆనందమే!కొనుక్కొని కాఫి కూడా తాగను!

తిక్క : మీ కార్టూన్లలో కాశ్యప్ అనే సంతకం చేయడం మీకు ఎబ్బెట్టుగా అనిపించడం లేదా?
తొక్క :బాపు, బాలి, జయదేవ్ అని ఫోర్జరీ చేస్తే పోలీసులు బొబ్బట్టులు పెట్టారు!

తిక్క : మీ కార్టూన్లు న్యాయంగా ఎవరు గీయాలి? ఎవరు గీస్తున్నారు?
తొక్క : లేటు తలతిక్క తింగరి దురద పరమానందం గారు (ప్రస్తుతం యమ లోకంలో) గీయాలి! కానీ ఇప్పుడు కక్కుర్తి కాపీల శునక నందం గీస్తున్నారు!

తిక్క : జనగణన ఏ ప్రాతిపదికన జరిగినా, మీ కార్టూన్లు కోల్పోయేదేమీ లేదని కృంగిపోతున్నారా?
తొక్క :  హూద్ హూద్ , సునామీ లకు నా టూన్స్ కారణం కానంధుకు !

తిక్క : ఒక గుర్రం, ఒక సైనికుడు, ఒక చిలుక, ముగ్గురూ ఒకేసారి మీ కార్టూన్లు ఇష్టపడుతుంటే, ఎవరికిస్తారు మీ కార్టూన్లు?
తొక్క :గుర్రం గుడ్డిధి,సైనికుడు సన్నాసి, చిలుక పలక లేనిధి అయితే ఆలోచిస్తా!

తిక్క : బాగా అలవాటైనట్టు గీస్తున్నారు కార్టూన్లు, కానీ మీ కార్టూన్లు గీయడం దుర్యోధనుడికి అలవాటైనట్టులేదు?
తొక్క : నా కార్టూన్ దుర్వాసన ఇంకా దుర్యోధనుని కి అలవాటు కాలే!

తిక్క : మీ కార్టూన్లతో కొట్టొద్దని బృగు మహర్షి ఏ రాక్షసుడినైనా ప్రాధేయపడ్డారా?
తొక్క : దిగంభర మహారిషి అడిగారు ! రెండు కార్టూన్స్ ఇచ్చా!

తిక్క : సరే హైద్రాబాద్ లో పరిస్తితులు అంత ప్రశాంతంగా ఉంటే, మీ తుంటర్వ్యూ గురించి అమెరికన్లు ఎందుకు కోపంగా ఉన్నారు?
తొక్క :అమెరికా లో అడుక్కొని ఇంటర్వ్యూ ఇచ్చినంధుకు! హైదరాబాద్ అడగకుండా తుంటర్వీవ్ ఇచ్చినంధుకు!

తిక్క : ఎలుకలు, జింకలు, వచ్చి కార్టూన్లు శ్రీలంకకు పంపించారాని అడిగితే రిక్వెస్టు చేస్తారా, రివర్స్ అవుతారా?
తొక్క :ఎలుకలు,జింకలకు రివర్సు ! శ్రీలంక రాక్షసులకు,యమ భటులకు ఓ యస్!

తిక్క : అంతకంతకూ మీ తుంటర్వ్యూ పెరిగి పోతూనే ఉంటే కార్టూన్లతో ఏదైనా ఉపాయం ఆలోచిస్తారా?
తొక్క :నేను 1962 లో చేసిన పాయసం తో కొడతా!

తిక్క : ఎందుకు తుంటర్వ్యూలో ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు?
తొక్క : తిక్క పీక్ లెవెల్ కెళ్ళి, వీఫి ల చుట్టూ వుంటే ఇవ్వక చస్తానా!

తిక్క : తొక్క తీసేదెవరు, తిక్క కుదిర్చేదెవరు?
తొక్క :   కొనేవాడు తొక్క బేరమాడితే,  అమ్మేవాడు తిక్క  కుధిరిస్తాడు!

తిక్క : ఆ ఆరు కార్టూన్లు కరెక్టేనా?
తొక్క :   ఆరువేల కార్టూన్స్ తప్పైనాకా, ఆరు కార్టూన్స్ ఎలా తగలడితేనేమి!

తిక్క : ఈ తుంటర్వ్యూలో ప్రశ్నలెలా ఉన్నాయో మరీ అంత భయపడుతూ చెప్పి స్టార్ట్ చేస్తారా?
తొక్క :వంధ ఇంటర్వ్యూలు స్టార్ట్ చేయకుండ తప్పా! తుంటెర్వీవ్ ఓ లెక్క! 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు