మృదువైన, మెరుస్తున్న పెదవులు మీ ముఖ సౌందర్యాన్ని పెంపొందించడం లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. పెదాల సమ్రక్షణ సరిగ్గా లేకపోతే పగిలిన పెదవుల సమస్య వేధిస్తుంది. పెదాల పగుళ్ళ సమస్య చలికాలం లో అధికం. అందుకే, చలికాలం లో పెదవుల సమ్రక్షణకై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. ఇంట్లో సాధారణం గా లభించే పదార్ధాలతోనే సులభంగా పెదవులను సరక్షించుకోవచ్చు. అవేంటో చూద్దాం.
తేనె: తేనెలో ఔషధ విలువలు పుష్కలంగా వుంటాయి. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు తేనె చక్కటి పరిష్కారం. పగిలిన పెదవులకు కూడా తెనె మంచి పరిష్కారం. పెదవులలో తేనెను నిలిపి వుంచి పెదాల పగుళ్ళ సమస్య నుంచి రక్షించడం లో తేనె ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజూ నిద్రపోయే ముందు కాస్త తేనెను పెదవులపై అద్దాలి. సహజ సిద్ధంగా పెదవుల సౌందర్యాన్ని పెంపొందించడానికి తేనెను మాయిశ్చరైజర్ గా వాడితే అందమైన పెదవులు మీ సొంతం.నెయ్యి
పెదాల మెరుపులకు , మృదుత్వానికి ఇంట్లో లభించే నెయ్యి కూడా మంచిదే. పెదవులలో తేమను నిలిపి వుంచి పెదాల పగుళ్ళ సమస్యను అరికట్టేందుకు నెయ్యి తోడ్పడుతుంది. ప్రతిరోజూ నిద్రపోయే ముందు రెండు, మూడు చుక్కల నెయ్యిని పెదాలపై అద్దితే చాలు తక్కువ సమయంలోనే పెదాల పగుళ్ళ సమస్య మటుమామటుమాయమవుతుంది.
రోజ్ వాటర్
రోజ్ వాటర్ తోనూ పెదాల సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. పగిలిన పెదాలపై రెండు, మూడు చుక్కల రోజ్ వాటర్ ను తరుచూ అపలి చేస్తే పెదాలను డీహైడ్రేషన్ సమస్యను వేధించదు. అలాగే మృదువైన, మెరిసే పెదాలు మీ సొంతం.
గ్లిజరిన్
తేమను కలిపి వుంచగలిగే సామర్ధ్యం కలిగి వుండటం వల్ల దాదాపు అన్ని కాస్మటిక్స్ తయారీలో గ్లిజరిన్ ను ముఖ్య పదార్ధన్ గా వాడుతారు. పెదాల సమ్రక్షణకై గ్లిజరిన్ ను నిస్సందేహంగా వాడవచ్చు. ప్రతిరోజూ నిద్రపోయే ముందు రెండు, మూడు చుక్కల గ్లిజరిన్ ను పెదాలపై అద్దండి. అతి తక్కువ సమయం లోనే మెరుగైన ఫలితాలు గమనిస్తారు.