"మా ఊరు - మా పురాతన దేవాలయం - నాడు-నేడు" పై సేవ్ టెంపుల్స్ అంతర్జాతీయ డాక్యుమెంటరీ చలన చిత్రోత్సవం దేవాలయ పరిరక్షణ, సనాతన ధర్మ రక ్షణ ద్యేయంగా మహోధ్యమంగా సాగుతు న్న గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌం డేషన్ మరియు సేవ్ టెంపుల్స్(USA) అద్వర్యంలో సేవ్ టెంపుల్స్ అంతర్జాతీయ డాక్యుమెంటరీ చలన చిత్రోత్సవం 2016 మార్చి లో హైదరాబాద్ లో "మా ఊరు - మా పురాతన దేవాలయం - నాడు-నేడు" అన్న అంశం పై అంతర్జాతీయ డాక్యుమెంటరీ చలన చిత్రోత్సవం నిర్వహించనున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకులు ప్రో వెలగపూడి ప్రకాశరావు మరియు సాంస్కృతిక ప్రచార సారధి డా. గజల్ శ్రీనివాస్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
100 సంవత్సరాల పైబడిన దేవాలయాల విశిష్టత, చరిత్ర, వైభవం, వాటి ఉత్సవాలు, దేవాలయ మాన్యాలు మరియు వర్తమానంలో ఆ దేవాలయ పరిస్థితులు హృద్యంగా డాక్యుమెంటరీ లో ఉండాలని, అది ఏ భాషలోనైనా నిర్మాణం చేయవచ్చునని కాని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ విధిగా ఉండాలని వారు కోరారు. ప్రతి డాక్యుమెంటరీ నిడివి సరిగ్గా 10 నిమిషాలు మించకుండా ఉండాలని, జాతీయ సమైక్యతను భంగ పరిచే అంశాలు అందులో ఉండరాదని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అతి ప్రాచీన దేవాలయాల వైభవాన్ని, నేడు ఆ దేవాలయాలు ఎదుర్కొనే సవాళ్ళను అందరికి అవగాహన కలిగించే ఉద్దేశంతో ఈ డాక్యుమెంటరీ చలన చిత్రోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
విజేతలుగా నిలిచిన డాక్యుమెంటరీలతో పాటుగా జ్యూరి చే ఎన్నిక చేయబడిన కొన్ని డాక్యుమెంటరీ లను 2016 మార్చి లో జరిగే చిత్రోత్సవం లో ప్రదర్శిస్తామని, అలాగే విజేతలకు బహుమతి ప్రదానం ఉంటుందని తెలిపారు.
ఈ పోటీలో గెలుపొందిన ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రానికి లక్ష రూపాయలు నగదు బహుమతి, ఉత్తమ ద్వితీయ చిత్రానికి 75 వేల రూపాయలు నగదు బహుమతి, తృతీయ చిత్రానికి గాను 50 వేల రూపాయలు నగదు బహుమతి ని అందజేస్తామని, వీటితో పాటుగా మూడు ప్రోత్సాహక బహుమతులు ఒక్కింటికి 10 వేల రూపాయలు చొప్పున ఉంటాయని, వీటితోపాటుగా ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు బహుకరించబడతాయని తెలిపారు. అలాగే పంపిన ప్రతి ఎంట్రీకి ప్రశంసా పత్రాలు అందజేయబడతాయని తెలిపారు.
పోటీలో పాల్గొనే ఆశక్తి ఉన్నవారు తమ సుముఖతను 2016 జనవరి 31 వ తేది లోపు సేవ్ టెంపుల్స్ (www.savetemples.org) వెబ్ సైట్ లో ఉన్న ఆన్ లైన్ అప్లికేషను ద్వారా నమోదు చేసుకోవాలని. గడువు తేది లోపు వచ్చిన ఎంట్రీ లకే ఈ పోటీలో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు.
మా చిరునామా:
Savetemples.org,
H.No. 6-3-596/47/2,Sapthagiri Building,
Sri Venkata Ramana Colony,
Khairatabad,Hyderabad-500 004.
Telangana. India E-mail: savetemplesfilmfestiva [email protected] Ph: +91 99126 26256
Prof. Velagapudi Prakasarao
President, Global Hindu Heritage Foundation.
Dr. Ghazal Srinivas
Brand Ambassador

Telangana. India E-mail: savetemplesfilmfestiva