కావలిసిన పదార్ధాలు: ఉల్లిగడ్డలు, టమాటాలు, కొబ్బరిపాలు, లవంగాలు, యాలకులు, సాజీర, దాల్చినచెక్క, కొత్తిమీర, మటన్, పెరుగు, పసుపు, కారం, అల్లంవెల్లుల్లి పేస్ట్, నూనె
తయారుచేసే విధానం: ముందుగా మటన్ ముక్కలకు పెరుగు, ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు వేసి కలిపి గంటసేపు అలాగే వుంచాలి. తరువాత కుక్కర్ లో నూనె వేడి కాగానే ఉల్లిపాయలు వేసి అవి వేగాక తయారుచేసి మటన్ ముక్కలను , టమాటలను వేసి కలిపి 6 విజిల్స్ వచ్చేవరకూ వుంచాలి. తరువాత కొబ్బరిపాలను పోసి బాగా మరగనివ్వాలి. తరువాత గరం మసాలా పొడిని వేసి, చివరగా కొత్తిమీరను కూడా వేయాలి. అంతే వేడి వేడి తెలంగాణ మటన్ కర్రీ రెడీ..