సభకు నమస్కారం - గజల్ శ్రీనివాస్


నాలో నీలో గజల్ శ్రీనివాస్ - పుస్తక ఆవిష్కరణ

కళాకారుల జీవితం స్ఫూర్తి దాయకం అని వారిపై గ్రంధాలు వెలువడడం అభినందనీయమని కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు గ్రహీత ఆచార్య ఎన్. గోపి అన్నారు.  డా. ఎస్. అర్. ఎస్. కొల్లూరి రచించిన "నాలో నీలో గజల్ శ్రీనివాస్" పుస్తకావిష్కరణ కార్యక్రమం యువకళావాహిని అధ్వర్యంలో బంజారా హిల్స్ ప్రసాద్ లాబ్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా విచ్చేసిన డా ఎన్. గోపి గ్రంధాన్ని ఆవిష్కరించారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజల్ శ్రీనివాస్ గొప్ప వాగ్గేయ కారుడని తన గాత్రంతో లక్షల మందిని  చైతన్య పరిచే శక్తీ శ్రీనివాస్ సొంతమని అన్నారు. ఈ కార్యక్రమానికి  శ్రీ సారిపల్లి కొండలరావు సభాధ్యక్షత వహించగా,  ముఖ్య అతిదిగా విచ్చేసిన శాసన మండలి సభ్యులు శ్రీ రుద్రరాజు పద్మ రాజు జ్యోతి ప్రజ్వలన చేసారు.

ఈ కార్యక్రమానికి విశిష్ఠ అతిదిగా విచ్చేసిన ప్రముఖ సినీ సంగీత దర్శకుడు శ్రీ అర్. పి. పట్నాయక్ మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా ప్రపంచ దేశాలలో తెలుగు వెలుగులను ప్రకాసవంతం చేస్తూ వ్యక్తిత్వ వికాసానికి దోహద పడుతున్న చైతన్య మూర్తి గజల్ శ్రీనివాస్ అని అన్నారు. మరో ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ సినీ గేయ రచయిత జె, కె. భారవి మాట్లాడుతూ, మూడు సార్లు గిన్నీస్ రికార్డ్స్ ను సొంతం చేసుకుని, 125 భాషలలో గానం చేసిన అత్యంత ప్రతిభావంతుడు డా. గజల్ శ్రీనివాస్ అని అన్నారు. గ్రంధ సమీక్ష చేసిన సినీ గేయ రచయిత శ్రీ సిరశ్రి మాట్లాడుతూ గజల్ శ్రీనివాస్ గారి 30 సంవత్సరాల గాన ప్రస్థానాన్ని, చేస్తున్న సేవా కార్యక్రమాలను, డా. కొల్లూరి 125 నానీలులో రాయడం హృద్యంగా ఉంది అన్నారు. మరో సినీ గేయ రచయిత భాస్కర భట్ల మాట్లాడుతూ మానవతా విలువలను, ప్రపంచ శాంతిని, గాంధేయ వాదాన్ని ఈనాటి తరానికి తనదైన శైలిలో అందిస్తున్న శ్రీనివాస్ గారిపై ఈ గ్రంధం రాయడం ఔచిచ్యవంతంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం లో శ్రీ రాజ్ కందుకూరి, శ్రీ జి. హనుమంత రావ్ మరియు వై కె నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు