క్రమం తప్పని వ్యాయామంతో, చక్కని అలవాట్లతో దైనందిన జీవనం కొనసాగిస్తే నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించొచ్చు.....అయితే, ఒక వయసు దాటిన తర్వాత అనివార్యంగా మీదపడే వ్యాధుల నుండి తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆధునిక జీవన శైలి, ఆహారపు అలవాట్లు...ఇలా అనేక కారణాలూ ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఇలాంటి వాటిలో పక్షవాతం ఒకటి....కాలో చెయ్యో పనిచెయ్యకుండా వంకర్లు తిరిగిపోవడం ఒక నరకమైతే, ముఖంలోని నోరు, దవడలు వంకర్లు తిరిగిపోవడం ముఖపక్షవాతం.....ఇదింకా ప్రత్యక్ష నరకం....ఇదెందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఎలా నివారించవచ్చు? వివరిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ప్రొ. చిరుమామిళ్ళ మురళీ మనోహర్ గారు.