అందం - చందం - మానస ఎన్.సి.హెచ్


మన చర్మానికి పండ్లతో మంచి ఆరోగ్యం లభిస్తుందని వింటూనే ఉంటాం. ఈ విషయం నిజమే. చర్మానికే కాదు మన శరీరానికి కూడా చాలా మంచిది. అదీ ఆరెంజ్ తో మీ చర్మ సౌందర్యం చాలా మెరుగుగా తయారవుతుంది. ఆరెంజ్ మీ చర్మంలోని అధికమైన ఆయిల్ తీసివేస్తుంది. అంతేకాక ఆరెంజ్ మీ చర్మానికే కాకుండా మీ మెదడును చక్కగా పనిచేసేలా చేస్తుంది. 

 ఆరెంజ్  పండు కాబట్టి మీ చర్మానికి ఎటువంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉండవు. ఆరెంజ్ లో ఫోలిక్ యాసిడ్, కాల్సియం ఉంటాయి. ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్-సి ఉంటుంది. ఇదీ మీ చర్మ కాంతివంతంగా చేయగలదు. ఆరెంజ్ ఫ్రూట్స్ ను మార్కెట్లో ఖరీదు చేసినప్పుడు మీకెంత ఉపయోగమో అంతే ఉపయోగం మీ చర్మానికి కలిగిస్తాయి. ఆరెంజ్ తొనలనే కాదు, ఆరెంజ్ తొక్కల్ని కూడా వాడవచ్చు. ఆరెంజ్ తొక్కలు మీ చర్మంపై ఉన్న మొటిమలను, మచ్చ్లను, ముడతలను, నల్లటి వలయాలను తీసివేస్తాయి. అంతేకాదు మీ చర్మం లొని మృత కణాలను తీసివేస్తాయి. తలనొప్పుల్ని కూడా తగ్గిస్తాయి. ఎప్పుడూ ఉల్లాసంగా ఉండేలా చేస్తాయి. వీటిలో ఉన్న విటమిన్ సి, సిట్రిచ్ యాసిడ్ చాలా చక్కగా వృధాప్య చాయల్ని చర్మంపై రాకుండా చేసి, సూర్యుని అతి శక్తివంతమైన కిరణాల నుంచీ కాపాడతాయి.ఆరెంజ్ తొక్కల్ని సాధారణంగా చాల రెసిపీలలో ఫ్లేవర్గా వాడతారు. ఇవి రక్తప్రసరణ పునరుధ్ధరించి, గుండె ను కాపాడతాయి.

గృహసిధ్ధమైన ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్  ఎలా తయారు చేసుకోవాలంటే... 

ముందుగా ఆరెంజ్ ను వలిచి తొనలని వేరుచేయాలి. తర్వాత తొక్కల్ని వేరు చేసి వాటిల్ని సూర్యుని ఎండలో ఎండబెట్టాలి. ఇలా 2-3 రోజులు బాగా ఎండబెట్టాలి. తర్వాత ఆ తొక్కల్ని తీసుకుని వాటిని గ్రైండర్ లో వేసి మెత్తగా పొడిగా వచ్చేలా జార్ లో గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ లో చక్కగా ఆ పౌడర్  ను నిల్వ చేసుకోవాలి. దీనిని ఎప్పుడు మీరు ఫేస్ ప్యాక్ గా వేస్తే అప్పుడు వాడుకోవచ్చు.

ఆరెంజ్ తొక్కలు మరియు పెరుగు ఫేస్ ప్యాక్

ముందు ఒక ఆరెంజ్ పీల్ ను తీసుకుని దానిని మెత్తగా పొడి చేసి దానికి పెరుగును కలిపి పేస్ట్గా వేసుకోవాలి.ఫేస్ ప్యాక్ వేసె ముందు గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడుగుకోవాలి. తర్వాత ఫేస్ ప్యాక్ వేసి దానిని ముఖం పై ఆరేంతవరకూ రబ్ చేసుకోవాలి. తర్వాత అది బాగ ఎండిపోయేవరకూ ఆగి తర్వాత 20 నిముషాల తర్వాత చల్లని నీటితో వాష్ చేసుకోవాలి. ఈ ప్యాక్ ముఖంపై ఏర్పడిన మృత చర్మాన్ని పోగొట్టేలా చేస్తుంది.

ఆరెంజ్ మరియు నిమ్మ ఫేస్ ప్యాక్

ఫేస్ ప్యాక్ వేసుకోవటం వల్ల మల్లీ మీ చర్మం చిన్న పిల్లల చర్మంలా మారుతుంది.

తయారు చేసే విధానం

ముందుగా ఒక ఆరెంజ్ పీల్ అంటే తొక్కని తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడికి ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ నిమ్మ రసాన్ని కలిపి పేస్ట్గా చేసుకోవాలి. తర్వాత ఆ పేస్ట్ ను ముఖానికి ఫేస్ ప్యాక్ గా వేసుకోవాలి. 20 నిముషాల పాటు ఆ ప్యాక్ ను ఉంచుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేసుకోవాలి.

ఆరెంజ్ తొక్క మరియు పసుపు ఫేస్ ప్యాక్

ఒక ఆరెంజ్ తొక్కను తీసుకుని దానికి ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ తేనె వేసుకోవాలి. తర్వాత ముఖానికి వేసుకోవాలి. 30 నిముషాల పాటు ఉంచుకోవాలి. తర్వత గోరు వెచ్చని నీటితో వాష్ చేసుకోవాలి. ఇది మీ చర్మం నిగారింపుగా ఉండేలా చేస్తుంది.

ఆరెంజ్ తొక్క మరియు గంధం పొడి ఫేస్ ప్యాక్

ఒక ఆరెంజ్ తొక్కని తీసుకుని దానిని బాగ ఎండలో సూర్య కాంతిలో దాదాపు 2-3 రోజులు ఎండబెట్టాలి. దీనితో పాటు పాలు లేదా రోజ్ వాటర్ లేదా నీరు వేసుకోవాలి. కానీ ముందు మాత్రం మీరు తొక్కల్ని ఎండబెట్టి దానిని గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకుని దానిని గాలి ఆడని కంటేనర్లో నిల్వ చేసుకోవాలి. తర్వాత పైన చెప్పిన విధంగా ఆరెంజ్ తొక్కల పొడిని, పాలు లేదా రోజ్ వాటర్ ను కలిపిన మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ గా మెడ వరకూ వేసుకోవాలి. 30 నిముషాల పాటూ ఆరెంత వరకూ ఉండి తర్వాత వాష్ చేసుకోవాలి. ఒకవేళ మీది పొడి చర్మం అయితే మీరు నీటిని ఎక్కువ పోసుకోవాలి. అదే మీది బాగా ఆయిల్ స్కిన్ అయితే మీరు రోజ్ వాటర్ ని మాత్రమే వాడాలి.

పిండి మరియు ఆరెంజ్ తొక్కల ఫేస్ ప్యాక్

ముందు ఒక ఆరెంజ్ ను తీసుకుని దాని తొక్కల్ని తీసుకుని దానిని పొడిగా చేసుకోవాలి. తర్వాత దానికి రోజ్ వాటర్ ను వేసి దానిలో పిండి ని తగినంతగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి వేసుకోవాలి. వేసుకుని రబ్ చేసుకోవాలి. 20 నిముషాల పాటూ ఉంచుకుని తర్వాత వెచ్చని నీటితో వాష్ చేసుకోవాలి. తర్వాత మీ చర్మం మునుపెన్నడూ లేని విధంగా మెరవటం మీరు గుర్తించవచ్చు.

పచ్చని బంకమట్టి మరియు ఆరెంజ్ తొక్కల ఫేస్ ప్యాక్

ముందుగా ఒక ఆరెంజ్ ను తీసుకుని దానిలో నుంచీ జ్యూస్ ను తీసివేయాలి. తర్వాత ఆ తొక్కల్ని సూర్య కాంతిలో ఎండబెట్టాలి. తర్వాత ఆ పొడిని తీసుకుని దానికి ఇదివరకే తీసిన ఆరెంజ్ జ్యూస్ ను వేసి మిక్స్ చేసుకోవాలి. దీనికి పచ్చ బంక మట్టి పవ్డర్ను వేసుకోవాలి. చివరిగా మిశ్రమాన్ని పేస్ట్ గా చేసుకోవటానికి అనువుగా పాలను వేసుకుని పేస్ట్ గా చేసుకోవాలి. ముఖానికి ఈ పేస్ట్ ను వేసుకోవాలి. తర్వాత 20 నిముషాలపాటు ఉంచుకుని వెచ్చని నీటితో వాష్ చేసుకోవాలి.

ఆరెంజ్ మరియు తేనె

ఈ ప్యాక్ చాలా తేలికైనదీ అంతేకాక చాలా ప్రభావవంతమైనది. ఒక ఆరెంజ్ తీసుకుని దానిని ఎండబెట్టి ఆ పొడిని తీసుకుని దానికి 2 టేబుల్ స్పూన్స్ తేనె వేసి ఆ మిశ్రమాన్ని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ ప్యాక్ మీ చర్మం మునుపెన్నడూ లేని విధంగా చక్కగా చేస్తుంది.

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి