18-03-2016 వరకు 24-03-2016 వారఫలాలు - శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తంమీద బంధుమిత్రుల నుండి నూతన చర్చలు చేయుటకు అవకాశం ఉంది. శుభకార్యాలకు అవకాశం ఉంది వాటికి సమయం ఇస్తారు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం కలదు. విదేశీప్రయత్నాలు అనుకూలించుటకు అవకాశం కలదు ప్రయత్నం చేయుట మంచిది. తలపెట్టిన పనులలో శ్రమతప్పకపోవచ్చును ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. జీవితభాగస్వామితో కలిసి సమయాన్ని సరదాగా లేక  వినోదాలకు కేటాయించే అవకాశం ఉంది. చిన్న చిన్న మార్పులకు శ్రీకారం చుడతారు. పెద్దలతో పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది వారితో కలిసి నూతన ఆలోచనలు చేపట్టుటకు ప్రయత్నం మొదలు అవుతుంది. కుటుంభసభ్యులను కలుపుకొని వెళ్ళండి వారి అభిప్రాయాలను తీసుకోవడం మంచిది.    

 

వృషభ రాశి  ఈవారం మొత్తంమీద మానసికంగా కొంత ఒత్తిడిని కలిగి ఉంటారు. పెద్దలతో కలిసి తీసుకొనే నిర్ణయాల విషయంలో స్పష్టమైన ఆలోచనలు చేయండి సమయాన్ని ఇవ్వండి. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుటలో చిన్న చిన్న ఇబ్బందులు తప్పకపోవచ్చును. సంతానపరమైన విషయాల్లో మార్పులకు అవకాశం ఉంది. ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. కొన్ని కొన్ని విషయాల్లో చాలావరకు సర్దుబాటు అవసరం. కుటుంబంలో మీరు తీసుకొనే నిర్ణయాలు కొత్త మార్పులు చోటుచేసేకొనే విధంగా ఉంటవి. వ్యాపారపరమైన విషయాల్లో పెట్టుబడులు పెట్టుటకు అవకాశం ఉంది కాకపోతే ఈ విషయంలో ఫలితాలు కొంత ఆలస్యంగా వచ్చుటకు అవకాశం ఉంది ఓర్పు అవసరం. వ్యతిరేకవర్గం నుండి ఇబ్బందులు తప్పక పోవచ్చును

                       

మిథున రాశి : .ఈవారం మొత్తంమీద నూతన పరిచయాలకు అవకాశం కలదు. కొత్త కొత్త వ్యక్తులను కలుస్తారు వారితో నూతన విషయాలు చర్చించే ఆస్కారం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత వెసలుబాటు ఉంటుంది, ప్రయత్నం పెంచుట బద్ధకం తగ్గించుకోవడం వలన మేలుజరుగుతుంది. కుటుంబంలో ఆశించిన మార్పులు కలగకపోవచ్చును, కావున సర్దుబాటు అనేది అన్నివిధాల మేలుచేస్తుంది. నూతన విషయాల పట్ల మక్కువను కలిగి ఉంటారు. ప్రయాణాల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. నలుగురిలో గుర్తింపు కోసం చేయు ప్రయత్నాలు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టపోయే అవకాశం ఉంది కావున ఈ విషయంలో జాగ్రత్త. ఆర్థికపరమైన విషయాల్లో కూడా తొందరపాటు వద్దు.
 

కర్కాటక రాశి :  ఈవారం మొత్తంమీద ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు వారినుండి మీకు లబ్దిని కలిగించే విషయాలను తెలుసుకొనే అవకాశం కలదు. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే ఆస్కారం ఉంది. కుటుంభంలో చిన్న చిన్న మార్పులకు అవకాశం ఉంది వాటిని స్వాగతించుట మంచిది. వ్యాపరవిషయంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. ఒకవార్త మిమ్మల్ని నిరుత్సాహానికి లోనుచేస్తుంది ఆశుభవార్తను వినే అవకాశం ఉంది. మిత్రులతో చిన్న చిన్న మనస్పర్థలు కలుగుటకు ఆస్కారం కలదు ఈ విషయంలో జాగ్రత్త. ప్రయాణాలు చేయవలసి రావోచ్చును వీలైతే ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. చేపట్టే పనుల విషయంలో పూర్తిస్థాయి అవగాహన పెంచుకొనే ప్రయత్నం చేయండి లేకపోతే నూతన సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది.

           
సింహ రాశి : ఈవారం మొత్తంమీద మిశ్రమఫలితాలు పొందుతారు. దూరప్రదేశం నుండి ఊహించని వార్తను వినే అవకాశం కలదు. అనుకోని మార్పులు కలుగుటకు ఆస్కారం కలదు. దైవసంభందమైన పూజలకు సమయం ఇవ్వడం అనేది సూచన. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటినుండి లబ్దిని పొందుతారు. ఆలోచనలలో మార్పులు చోటుచేసుకొనే అవకాశం ఉంది అవి మిమ్మల్ని ఒకింత ఆశ్చర్యానికి గురిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకశాలు పొందుటకు ఆస్కారం ఉంది. చాలావిషయాల్లో కుటుంభసభ్యుల సహాకారం అందుతుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం వైద్యున్ని సంప్రదించుట మంచిది. మాటతీరును చాలావరకు మార్చుకొనే ప్రయత్నం చేయండి దాని మూలాన మేలుజరుగుతుంది మిత్రులతో సమయం గడుపుటకు అవకాశం ఉంది.


కన్యా రాశి :ఈవారం మొత్తంమీద చేపట్టిన పనుల పట్ల భాద్యతను కలిగి ఉంటారు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం కలదు.  తలపెట్టిన పనులకు సమయాన్ని ఇస్తారు అలాగే మిత్రుల నుండి సహాయం అందుతుంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోండి విలువైన వస్తువులను పోగొట్టుకొనే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో ఊహించని ఖర్చులకు ఆస్కారం కలదు తగ్గించుకొనే ప్రయత్నంలో విఫలం చెందుతారు. ఇతరుల నుండి ఊహించని సమస్యలను పొందుటకు అవకాశం ఉంది జాగ్రత్త. ఇష్టమైన వ్యక్తులతో సమయం గడుపుటకు ఆస్కారం కలదు వారికి మీ ఆలోచనలు తెలియజేయుటకు ఆస్కారం ఉంది. ఉద్యోగంలో అధికారులతో ఉన్నతమైన సంభందాలు కలిగి ఉండు విధంగా ప్రయత్నం చేయుట మంచిది.  .

   

తులా రాశి : ఈవారం మొత్తంమీద చర్చాసంభందమైన విషయాలకు సమయం ఇవ్వాల్సి రావోచ్సును. తీసుకొనే నిర్ణయాల విషయంలో స్పష్టమైన ఆలోచన కలిగి ఉండుట మంచిది. తలపెట్టిన పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు కలిగినను చివరకు విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి వాహనముల మూలాన ఊహించని ఖర్చులకు ఆస్కారం ఉంది. నూతన ప్రయత్నాల విషయంలో బాగాఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. మీ అనుకున్న వారితో విబేదాలు కలుగుటకు అవకాశం ఉంది కావున జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. పనులలో శ్రమతప్పక పోవచ్చ్చును ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళుట ఉత్తమం. మిత్రులతో,బంధువులతో కలిసి నూతన నిర్ణయాలు చేయకపోవడం సూచన. వ్యాపారపరమైన విషయల్లో మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది.
    
 

వృశ్చిక రాశి  : ఈవారం మొత్తంమీద ప్రతివిషయంలో స్పష్టమైన ఆలోచనలు కలిగి ఉండి ముందుకు వెళ్ళుట సూచన. ఫలితాలు అనుకూలంగా రావడం మూలాన సంతోషాన్ని పొందుతారు. అతివిశ్వాసం మంచిది కాదు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే దానిపర్యవసానం చివరలో పొందవలసి రావోచ్చును జాగ్రత్త. వ్యాపారపరమైన విషయాల్లో నూతన మార్పులకు ప్రయత్నం చేయకండి ప్రణాళిక అవసరం లేకపోతే ఊహించని ఖర్చులు కలుగుటకు అవకాశం కలదు జాగ్రత్త. పెద్దలతో చేయు చర్చలు పెద్దగా ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చును. జీవితభాగస్వామితో విభేదాలు కలుగుటకు అవకాశం కలదు కావున చాలావరకు మాటపట్టింపులకు పోకపోవడం మంచిది. స్వల్పఅనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది మానసికంగా సిద్దంగా ఉండుట తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

 

ధనస్సు రాశి  : ఈవారం మొత్తంమీద ఆరంభంలో అధికమైన ఆలోచనలకు అవకాశం ఉంది తగ్గించుకోవడం వలన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో మీ ఆలోచనలు ఒకసారి తరచి చూసుకోవడం వలన మేలుజరుగుతుంది. కుటుంబంలో స్వల్ప మార్పులకు ఆస్కారం కలదు. ఆర్థికపరమైన విషయల్లో చివరి నిమిషంలో ధనం సర్దుబాటు అవడం వలన ఇబ్బందులు తగ్గుటకు అవకాశం కలదు. ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకండి. వివాదాస్పదవ్యాఖ్యలకు దూరంగా ఉండుట శ్రేయస్కరం.  అధికారులతో గల మంచి అనుభంధం మీకు ఉపయోగపడుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దూరప్రదేశం నుండి నచ్చిన వార్తలు వినే అవకాశం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో మాత్రం వేచిచూసే దోరణి మంచిది. పనిఒత్తిడి ఉండుటకు ఆస్కారం ఉంది సమయానికి భోజనం చేయకపోతే అనారోగ్యసమస్యలు తప్పక పోవచును.         

 

మకర రాశి  :ఈవారం మొత్తంమీద చేసిన ఆలోచనలు తోటివారికి సహాయపడేవిగా ఉంటాయి . సామాజికకార్యక్రమాలకు సమయం ఇస్తారు. ఉద్యోగంలో కొంత ఒత్తిడి తప్పక పోవచ్చును. శుభకార్యక్రమాలకు సమయం ఇస్తారు. తలపెట్టిన పనులకు  మిత్రులను కలుపుకొని వెళ్ళుట వలన విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది.మృష్టాన్నభోజన ప్రాప్తిని కలిగి ఉంటారు. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట మూలాన వారి నుండి లబ్దిని పొందుటకు అవకాశం కలదు నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారపరమైన విషయాల్లో ఆశించిన లాభం పొందుటకు అవకాశం ఉంది కాకపోతే ఖర్చులు కూడా అధికస్థాయిలోనే ఉండే అవకాశం కలదు జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. ప్రయాణాలు చేయుట వలన శారీరకశ్రమ తప్పక పోవచ్చును కావున అన్నిరకాలుగా జాగ్రత్తలు తీసుకోండి మంచిది.

 

కుంభ రాశి : ఈవారం మొత్తంమీద ప్రయాణాలు కలిసి వస్తాయి. మీయొక్క ఆలోచనలు తోటివారికి లబ్దిని కలిగిస్తాయి. కుటుంబంలో పెద్దల సూచనలను పాటించుట చేత మరింత లాభాన్ని పొందుటకు అవకాశం కలదు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం కలదు. పనులలో మాత్రం కొంత నిదానం అవసరం లేకపోతే అనవసరమైన ఆలోచనలు పొందుటకు అవకాశం ఉంది. కుటుంభసభ్యులతో కలిసి తీసుకొనే నిర్ణయాల విషయంలో తొందరపాటు వద్దు బాగాఆలోచించి ముందుకు వెళ్ళుట మంచిది. సమయానికి భోజనం చేయుట అలాగే ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకొనుట తప్పనిసరి అవసరం కూడా. ఉద్యోగపరమైన విషయాలకు సమయస్పూర్తి అవసరం నలుగురిని కలుపుకొని వెళ్ళండి.

 

మీన రాశి : ఈవారం మొత్తంమీద ఊహించని ప్రయాణాలకు సమయం ఇస్తారు. వాహనముల విషయంలో జాగ్రత్తగా ఉండుట సూచన. ఒకవార్త కొంత మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది కావున ఓపిక అలాగే సర్దుబాటు అవసరం. దాదాపు చేపట్టిన అన్ని పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు,నూతన పనులను ఆరంభించే ముందు అనుభవజ్ఞుల సూచనలు తీసుకోవడం తప్పకుండా మేలుచేస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు పరిశీలన చేస్తారు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టునపుడు పెద్దల సూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది.  ఇష్టమైన వ్యక్తుల ద్వార నూతన విషయాలు తెలుసుకొనే ఆస్కారం ఉంది. మిత్రులతో కలిసి వినోదాలకు సమయం కేటాయిస్తారు సమయాన్ని సరదాగా గడుపుతారు.

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు