గారెల రాజ్యంలో పులిహోర పురం రాజధానిగా , దద్దోజనం చక్రవర్తి , చక్రపొంగలి రాణితో , మలై కాజా మహా మంత్రి సలహాలతో ,సమోసా సైన్యధిపతిగా, పరిపాలిస్తుండగా ,అతడి తమ్ముడు అప్పాలు ,వంకాయ బజ్జీ వంకర మాటలువిని, వేడి వేడి పకోడీల్లా వేరుపడి కుడుముల రాజ్యం చేసుకుని , రవ్వ లడ్డు రాజధానిగా , మిరపకాయ బజ్జీ మంత్రిగా, సేమ్యాపాయసం సేనానిగా రాజ్యపాలన చేయాలని నిప్పంట్టంత నీల్గి ,నీరుల్లి వడలా వగ పడ్డాడు. మడత కాజా లెవల్లోని లేఖకునితో అన్నకు కట్లెట్ భాషలో కమ్మవ్రాసి కలాకండతో కబురంపాడు. లడ్డు బుట్టలో లేఖ పట్టుకుని , మిర్ఛి బజ్జీ బండిలో , తీపి గారెల కబుర్లు వింటూ , కలాకండ వెళుతుండగా ,వేసవి కాలం కావటాన వేరుశనగ ఉండల్లా వడదెబ్బతగిలి , పరమాన్నపురంలో , సున్నుండల సలహాతో, ఇడ్లీ ఇంట విశ్రమించి , మినపట్టు మెడికల్ సేవలతో, మొక్క జొన్న వడల మందేసుకుని, టమాట జామ్ తో సేదతీరి, పాయసం ఫలహారం చేసి, మషాలా పకోడి తో మంచం దిగి, బ్రెడ్ హల్వా బండిలో , కరివేప వడ కళ్ళెం పట్టుకోగా , పాలకోవా బాట చూపగా, పుణుగులు కట్టిన బండి పరుగెత్తసాగింది.
వెజటబుల్ వడ వెంట వస్తుండగా , బర్ఫీ బిగువుతో , సున్ని ఉండల కొండలూ, కజ్జికాయల కోనలూ, పూతరేకుల పర్వతాలూ, సగ్గుబియ్యపాయస సము ద్రాలూ, ఖర్జూరం హల్వా కోనేరునూ, కొబ్బరి పాయసపు కొలనునూ, జాంగ్రీల జాగీరు నూ దాటుకుని , ఆలూ వడ అరణ్యంలో ప్రవేసించగా , బూరెల దొంగలూ, కట్లెట్ కర్రలతో, అడ్డుకోగా , రవ్వ కజ్జి కాయల రక్షకులు ,బూందీ లడ్డు బూరలూది , కాజాల జాగిలాలను రప్పించి, సేమ్యా హల్వా శూలాలతో , బొబ్బట్లు బొబ్బల తో భయపెట్టగా , తొక్కుడు లడ్డు దొంగలంతా , ఆవడల అరణ్యంలోకి పారిపోయారు.
రాజభక్తి గల రవ్వ కేసరి , వడియాల వేగులూ , బఠానీ వడబంట్రోతులు , చెర్రి జామ్ చారులూ, కలాకండ కారణం లేని రాక తెల్సుకుని , అన్నం పరవాన్నం పారించి, ఉల్లిపాయ పకోడి, అరటికాయ బజ్జీ లూ దారికడ్డం వేసి ,అరిసెలు బండి అడ్డంపెట్టి , ఊతప్పం తో వళ్ళంతా వాతలేసి, గవ్వలతో గవదలూడ గొట్టి, పాలకోవా బిళ్ళలతో పళ్ళు పీకి, బాదం కేకు తో బాది, కొబ్బరి ఖీర్ కొరడాతో కొట్టి, గులాబ్ జామ్ లతో గుచ్చి గుచ్చి , ఉల్లిపాయ వడియపు తాళ్లతో కట్టేసి, పాయసం తో పనిష్ చేసి, బొంగుమిఠాయ్ తో బొమికెలు విరగ్గొట్టి , అదిరి పోయే అల్లం , బెల్లం పచ్చడి- మిర్చి బజ్జీతో మిక్స్ చేసి పట్టించి , ఖర్జూరం హల్వా ఖైదులో వేశారు.
చిమ్మిరుండల చారులూ, సజ్జప్పాల సమాచరకులూ, వెనిల్లా వేగులూ , అప్పచ్చుల ఆత్మీయులూ అదించిన ఈ సమాచారం విని , బూంది బాబాయ్ పెట్టిన భయంతో , కొబ్బరి వడలా వణికిపోయి, మిర్ఛి బజ్జీ మైత్రితో, పెసరట్టు దొంగ ప్రేమతో, మైసూరుపాక్ మైత్రితో , జీళ్ళ జాయింట్లు జారిపోయి , చిలకడ దుంపల లడ్డులా చింతించి, సజ్జ బూరెల్లా స్వాంతనపడి, పెసర అప్పడాల్లా పశ్చాత్తాపపడి, ఖర్జూరం హల్వాలా కుళ్ళికుళ్ళీ ఏడ్వగా,కరుణగల క్యారట్ పాయసపుదేవుని కారుణ్యంతో, మైసూరు బజ్జీ బుజ్జగింపులతో మనసుమారి, మినప్పిండి అప్పడాల్లా ముసిరిన ఆలోచనలు వదిలి, నువ్వుండల నయ వంచకత్వం , చెగోడీల చెప్పుడు మాటలూ, బీరకాయ బజ్జీ బీరాలూ ,జిలేబీల జాడ్యాలూ అంటించినవి వదలుకుని , అప్పాల్లా ఆగి ఆగి, , క్యారట్ కేక్ లా కేకలేసి, ఉండ్రాళ్ళ లాపొర్లి పొర్లి, హల్వా లా అరచి అరచి, బొబ్బట్ల లా బొబ్బలేసి, వేరుశనగ ఉండలా వేరుపడాలన్న తన చెడు చింతనకు , పూర్ణం లా పూర్తిగా మారిపోయి, బాదం ఐస్ క్రీం లా పశ్చాత్తాపపడి, బాస్మతి బియ్యపు పరవాన్నంలో , స్పాంజ్ కేక్ తోస్నానం, చేసి , సగ్గుబియ్యం వడియంలా శుధ్ధిపడి, బ్రెడ్ హల్వాకేకుతో భయంతీరి, జీడిపప్పు మైసూరుపాక్ లాంటి ‘ అన్నప్రేమ ‘ తల్చుకుని, మైమరచి, ఐస్ క్రీం లాంటి అన్నతనను క్షమించే లా చేయమని , ఉప్మా తో దేవుని ఉపాసించి , పైనాపిల్ కేక్ లా ఫ్రండ్సును పక్కకు నెట్టి , తనకు జీడిపప్పు అచ్చు జాడ్యం వదలి నందుకు , పిండి వడియంలా పరవసించి, అప్పడాల వంటి అన్నను చూడాలని, పకోడి పళ్ళెం పట్టుకుని, బూరెల బ్యాగ్ భుజానికి తగిలించుకుని, కొబ్బరి బొబ్బట్లు కొన్ని తీసుకుని, ప్రియమైన వదిన కోసం పెసరపిండి వడియాలు , స్నేహితుల కోసం సొరకాయ వడియాలు, మరికొందరి కోసం కొబ్బరి క్యాబేజి వడలు, ప్రేక్షకుల కోసం పాన్ కేక్సూ , కొలువులోవారి కోసం కొబ్బరి ఉండలు , సేవకుల కోసం సగ్గు బియ్యం పాయసం,తీసుకుని అన్నపు పాయసం లాంటి అన్నను చేరి, , కొబ్బరి హల్వా పాయసం వంటి పాదాలు పట్టుకుని , కోకోనట్ కేక్ లా కేక లేసి ఏడ్వగా , అన్న ఆల్మండ్ చాకొలెట్ బార్ లా కౌగలించుకుని , తీపికాజా లాంటి తమ్ముడ్ని, ఆవడలా ఆలింగనం చేసుకుని , బూడిద గుమ్మడి వడియాలవంటి బుగ్గలు ముద్దాడి, బిడియ పడవద్దని బియ్యం పిండి వడియాల విందిచ్చాడు. రవ్వ లడ్డు లాంటి వారి లవ్వుకు శాండ్ విచ్ వంటి సభికులంతా ఆవపెట్టిన పనసపొట్టు కూరలా ఆనందించారు.