నీళ్లు శరీరానికి ఎంతో అవసరం అనే విషయం మనందరికీ తెలుసు. అయినా దాహం వేయందే నీళ్లు తాగం. దాహం వేస్తోందంటే అప్పటికే శరీరం లో నీళ్ల శాతం తగ్గిందని అర్ధం. దాహార్తిని నీళ్లు తప్ప మరే పానీయం తీర్చలేదు. కాబట్టే నీళ్లు తాగగానే అంతులేని సంతృప్తి కలుగుతుంది. అలసట వదులుతుంది. ఎందుకో తెలుసా? శరీరంలో నీటి శాతం తగ్గితే మన మెదదు కుంచించుకుపోతుంది. దాంతో డీహైడ్రేషన్ కు గురైన మెదదు పని చెసే సామర్ధ్యం కూడా తగ్గుతుంది. డీహైడ్రేషన్ తో శక్తి సన్నగిల్లటం, చర్మం తేమ కోల్పోవటం లాంటి లక్షణాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. అయితె ఎవరు ఎన్ని నీళ్లు తాగాలి? రోజుకి కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలని అంటూవుంటారు. కానీ వేసవిలో ఇవి చాలవు. ఎవరికి ఎన్ని నీళ్లు అవసరం అనేది బరువు, శారీరక శ్రమ, జీవనశైలిల మీద ఆధారపడి వుంటుంది. ఈ కాలం లో ప్రతి ఒక్కరూ సగటున రోజుకి కనీసం 2 నుంచి 2.5 లీటర్ల నీళ్లు తాగాలి.
నీళ్లు మన శరీరం లోని ప్రతి ఒక్క కణం లో వుంటాయి. మనం నివసించే ప్రదేశం, బాడీ మాస్ ఇండెక్ష్, వయసు, సెక్ష్ లను బట్టి ఒక్కొకరికి ఒక్కో పరిమాణం లో నీళ్లు అవసరం అవుతాయి. సాధరణంగా వ్యక్తుల్లో 55 నుంచి 60 శాతం నీరుంటుంది. అప్పుడే పుట్టిన పిల్లల్లో ఏకంగా 75 శాతం నీరుంటుంది. అయితే పుట్టిన ఏడాదిలో వాళ్ల శరీరాల్లోని నీరు 65 శాతానికి పడిపోతుంది. మన శరీరాల్లోని నీళ్లు పోషించే పాత్ర ఏంటి? మనం ఆరోగ్యంగా వుండటానికి ఎంత నీరు అవసరం?
నీరు చేసే మేళ్లు

- కీళ్లు ఒకదానికొకటి రాసుకోకుండా వాటి మధ్య కుషన్ లా పని చేస్తాయి.
- శరీర ఉష్ణోగ్రతని క్రమబద్ధం చేస్తాయి.
- మెదడు, వెన్నుపాముకు బలాన్నిస్తాయి.
- మన శరీరంతో పాటు మెదడు, గుండెల్లో మూడు వంతులు నీళ్లే.
- ఊపిరితిత్తుల్లో 83 శాతం నీరే.
- పొడిగా కనిపించే ఎముకల్లో కూడా 31 శాతం నీరుంటుంది.
మరి మన శరీరాల్లో ఇన్ని నీళ్లున్నా ఇంకా నీరెందుకు తాగాలి?
ఎందుకంటే...
మరి మన శరీరాల్లో ఇన్ని నీళ్లున్నా ఇంకా నీరెందుకు తాగాలి?
ఎందుకంటే...
ప్రతి రోజూ మనం చెమట, బైలురుబిన్, మూత్రం, శ్వాస పీల్చటం ద్వారా ఒక లీటర్ నీటిని కోల్పోతూవుంటాం. ఇలా పోగొట్టుకున్న నీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూవుండాలి. ఇలా శరీరంలో నీటి లెవల్ ని బ్యాలెన్స్ చేస్తూ వుండాలి. అప్పుడే డీహైడ్రేషన్ కి గురి కాకుండా వుంటాం. అసలు డీహైడ్రేషన్ కి గురయ్యామని మనకు తెలిసేదెలా? ఈ అస్వస్థత కొన్ని లక్షణాల రూపంలో బయటపడుతుంది. అవేంటంటే...
- శక్తి తగ్గుతుంది.
- శక్తి తగ్గుతుంది.
- చిరాకు, విసుకు మొదలవుతుంది.
- చర్మం దురద పెడుతుంది.
- రక్తపోటు పడిపోతుంది.
- నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యం తగ్గుతుంది.
- పూర్వంలా సమర్ధంగా పనిచేసేక్రమంలో మెదడు నీరు లేని కారణంగా కుంచించుకుపోతుంది.
- తలనొప్పి, కండరాల నొప్పులు వేధిస్తాయి.
ఈ సమస్యలకు గురికాకుండా వుండాలంటే తగినన్ని నీరు తాగాలి.
ఈ సమస్యలకు గురికాకుండా వుండాలంటే తగినన్ని నీరు తాగాలి.
- పురుషులు రోజుకి 2.5 నుంచి 3.7 లీటర్లు, స్త్రీలైతే 2 - 2.7 లీటర్ల నీరు తాగాలి.
- ఈ మొత్తం పరిమాణంలో పళ్లు, పానీయాల రూపంలో 15 శాతం నీరు మన శరీరానికి అందించవచ్చు.
- స్ట్రాబెర్రీలు, కీరా, దోసకాయలలో 90 శాతం నీరుంటుంది. వీటిని తీసుకుంటే నీటితోపాటు విలువైన పోషకాలు కూడా పొందొచ్చు.
- శరీరంలో నీటి సమతౌల్యం పాటిస్తే మధుమేహం, గుండెపోటు, కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ పొందొచ్చని పరిశోధనల్లో తేలింది.
- మన ఆలోచన, పనితీరు మెరుగ్గా వుండాలంటే తగినన్ని నీరు తాగాలి.
కాబట్టి ఈ వేసవిని ఆహ్లాదంగా గడపటం కోసం, డీహైడ్రేషన్ బారిన పడకుండావుండటం కోసం దాహం వేసినా,వేయకపోయినా నీరు తాగుతూనే వుండాలి.
కాబట్టి ఈ వేసవిని ఆహ్లాదంగా గడపటం కోసం, డీహైడ్రేషన్ బారిన పడకుండావుండటం కోసం దాహం వేసినా,వేయకపోయినా నీరు తాగుతూనే వుండాలి.