అందం - చందం - మానస

వేసవిలో చర్మ సౌందర్యానికి అవసరమైన ఫేస్ ప్యాక్స్

వేసవిలో.. పెరుగు, కీరదోస, పాలుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే సన్ టాన్‌ను నిరోధించుకోవచ్చు. పెరుగు శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా సన్ టాన్‌తో పోరాడి, చర్మాన్ని కూల్‌గా ఉంచుతుంది.

వేసవిలో చర్మం మెరుగవ్వాలంటే.. పెరుగుతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం చాలా అవసరం. పాలు పొడి చర్మానికి అద్భుతంగా పనిచేస్తాయి. ఇంకా చర్మాన్ని టైట్ చేస్తుంది. మాయిశ్చరైజ్‌గా ఉంటుంది. అలాగే పాలతో రెగ్యులర్‌గా మసాజ్ చేయడం వల్ల చర్మం రంగు మార్చుకోవడానికి సహాయపడుతుంది.
 
ఇకపోతే.. కీరదోసకాయతో ముఖాన్ని మసాజ్ చేసి మెరిసే చర్మ సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు. పుచ్చకాయ కూడా చర్మానికి చల్లదనాన్ని ఇవ్వడంతో పాటు, తాజాగా కనబడేలా చేస్తుంది.

మెరిసే చర్మాన్ని నేచురల్‌గా పొందాలనుకుంటే ఈ పుచ్చకాయను అధికంగా తినాలి. తినడంతో పాటు ముఖానికి మాస్క్‌లా వేసుకోవాలి.

అలాగే వేసనిలో టమోటా ముఖంలోని సన్నని గీతలు మరియు ముడుతలను తగ్గిస్తుంది. సన్ టాన్‌తో పోరాడ శక్తిని కూడా కలిగి ఉండి, చర్మానికి రక్షణ కల్పిస్తుంది. కాబట్టి టమోటోతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం చాలా మంచిదని బ్యూటీషన్లు అంటున్నారు. 

 

...

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి