నేడు శ్రీరామనవమి. పానకాలు తాగడం, సీతారామకళ్యాణ భోజనాలు చేయడం మామూలే. భోజనాల్లో "చారు", "కూర", "బూరె", "గారె" వంటివి సహజమే. అందుకే ఆ నాలుగు పదాలను ఆ అర్థంలో కాకుండా వేరే అర్థంలో వాడుతూ, శ్రీరాముడిని ఉద్దేశిస్తూ సరదాగా సినీకవి సిరాశ్రీ చెప్పిన పద్యం గోతెలుగు పాఠకులకు అందిస్తున్నాం.
'చారు' దరహాస! రఘురామ! సత్య సదన!
'చారు' దరహాస! రఘురామ! సత్య సదన!
భక్తి 'కూర'గ నినుకొల్చి పరగినంత
భూరి సౌశీల్య సద్గుణం'బూరె'ననగ
చక్కని నడత కొత్త'గారె'క్క విప్పె
అర్థాలు:
అర్థాలు:
చారు: అందమైన, దరహాస= చిరునవ్వుగల, రఘురామ! సత్యసదన= సత్యానికి నిలయమైన ఓ రఘురామా!
భక్తి కూరగ: భక్తి కలుగగా, నినుకొల్చి పరగినంత= నిన్ను ప్రార్ధించి వర్ధిల్లగా భూరి సౌశీల్యము: నిండైనా మంచితనము ,
సద్గుణంబు+ఊరె= సద్గుణంబూరె ననగ= మంచి గుణములు పుట్టగా చక్కని నడత కొత్తగా రెక్క విప్పె: మంచి నడవడి రెక్కలు విప్పుతుంది.