చిత్రకళాప్రదర్శన - ..

painting exbition

పిల్లన గ్రోవితో నల్లనయ్య - అనేక రూపాల్లో ఆంజనేయుడు, ధనుర్ధారియైన రామయ్య - ఇలా కళ్ళు చెదిరే కళాఖండాలు  ఒక్కచోట కొలువై కళాభిమానులను అలరిస్తున్నాయి, అబ్బుర పరుస్తున్నాయి. ఈ చిత్రాలకు తన కుంచెతో ప్రాణం పోసి కొలువు తీర్చిన చిత్రకారుడు సత్య గన్నోజు. ఈ అద్భుత కళాఖండాలు ప్రదర్శింప బడుతోన్న వేదిక బంజారాహిల్స్ లోని "బియాండ్ కాఫీ" ఈ నెల 15 తారీఖు నుండి ఇరవై వరకూ కళాభిమానులకు కనువిందు చేయనున్న గన్నోజు సత్య పెయింటింగ్స్ ఆక్రిలిక్, ఆయిల్ తదితర మీడియంస్ లో రూపు దిద్దుకున్నాయి.

ఇక చిత్రకారుడి నేపథ్యం విషయానికొస్తే తెలంగాణ రాష్టం లోని మహబూబ్ నగర్ జిల్లా ఆమనగల్లులో 17 జూలై 1976 లో జన్మించిన గన్నోజు సత్య , మాసబ్ ట్యాక్ లోని జె ఎన్ టియు  ద్వారా 1996 లో బి ఎఫ్ ఎ పట్టా  పుచ్చుకున్నారు. 2016 లో శ్రీ వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ద్వారా ఎం ఎఫ్ ఎ పూర్తిచేశారు. హైద్రాబాద్ ఆర్ట్ అసోసియేషన్ లో సభ్యునిగా కొనసాగుతున్న ఈ చిత్రకారుడి పెయింటింగ్స్ తెలుగు రాష్టాల్లోనే కాక అనేక రాష్టాల్లో ప్రదర్శించి పలువురి ప్రశంసలు పొందడం జరిగింది,

ప్రముఖ చిత్రకారులు లక్ష్మా గౌడ్ , స్వర్గీయ పాండు గార్ల చిత్రాలూ, తమ తండ్రి గారి వుడ్ కార్వింగ్ వర్క్స్ తనకు స్పూర్తి అంటున్నాడీ ఆర్టిస్టు. సైన్ బోర్డ్స్, బ్యానర్స్ రాయడంతో తన జీవన ప్రస్థానాన్ని ప్రారంభించి  అంచెలంచెలుగా ఎదిగి అనేక కళాభిమానుల అభిమాన్ని చూరగొన్న తన పెయింటింగ్స్ని మహారాష్ట ప్రస్తుత గవర్నర్ సి.హెచ్ . విద్యాసాగర్ రావు గారు మెచ్చుకోవడం మర్చిపోలేని అనుభూతి అని ఆనందంగా వివరించారు గన్నోజు సత్య,

అలాగే బండారు దత్తాత్రేయ గారు, ఎస్. జైపాల్ రెడ్డి గారరి లాంటి ప్రముఖులు తను పెయింటింగ్స్ ని సేకరించి తమ ఇళ్ళలో అలంకరించుకున్నారన్నారు గన్నోజు సత్య. తొలి తెలంగాణ ఆర్ట్ క్యాంప్ లో పాల్గొన్నానన్నారు. ఇంకా బెంగళూరు చిత్ర కళా పరిషత్ నుండి వరుసగా మూడేళ్ళు సర్టిఫికేట్ అందుకున్నానన్నారు. 

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి