విశేషాలు - పి వి ఎల్ సుజాత

visheshalu

1) తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లని ఉదాహరణగా పేర్కొంటూంటాం. అలాగే చిన్న చేప...పెరిగి పెద్ద చేప అని కూడా ఉదాహరణగా అంటూంటాం...ఇంకా పేద్ద చేప అనాలంటే అనాలోచితంగా చెప్పే పేరు...తిమింగలం....కదా...కానీ మీకో నిజం తెలుసా? తిమింగలాలు చేప జాతికి చెందవు. క్షీరదాల జాతికి చెందుతాయి.

2) మనం నీళ్ళు తాగకుండా ఎంతకాలం ఉండగలం? ఒకరోజు....రెండురోజులు....? మనకంటే ఒంటె ఎక్కువ కాలం ఉండగలదని మనకు తెలుసు కదా...అదీ పదిహేడు రోజుల వరకు...మరి అంతకంటే ఎక్కువ ....అంటే ఒక జీవిత కాలం పాటు నీళ్ళు తాగకుండా ఉండగలిగేదెవరో తెలుసా? సిల్వర్ ఫిష్
ఎస్....సిల్వర్ ఫిష్ జీవితాంతం అస్సలు నీటిని తాగదు....ఇప్పుడున్న నీటి కరువు పరిస్థితులలో మనమూ సిల్వర్ ఫిష్ ల్లాగా బ్రతగ్గలిగితే ఎంత బాగుంటుందో కదా.....

3) మనం వాసనలను పసిగట్టినట్టే జంతువులు కూడా రకరకాల వాసనలను ఇట్టే పసిగడతాయని తెలుసు కదా....కానీ పక్షులు వాసనలను పసిగట్టగలవా, లేదా అనే విషయంలో ఇప్పటిదాకా స్పష్టత లేదు...కానీ, పక్షులలో కీవీ పక్షి మాత్రం వాసనను గ్రహిస్తుంది.

4) గుడ్డు బరువెంత...? పరిమాణమెంత? గుడలలో అసలే పక్షి పెట్టే గుడ్డు పెద్దగా ఉంటుందో మనకు తెలుసా? ప్రపంచంలో అతిపెద్ద గుడ్డు పెట్టే పక్షి ఆస్ట్రిచ్(నిప్పుకోడి)

5) మనిషి జీవిత కాలం వందేళ్ళని మనకు తెలుసు...కానీ అన్నేఏళ్ళు జీవించడం అరుదు....ఒక్కో జీవి ఆయుర్ధాయానికీ ఒక్కో నిర్దిష్ట కాల పరిమితి ఉంటుంది...అత్యధిక కాలం జీవించేది ఏదో తెలుసా? తాబేలు అత్యధిక కాలం జీవించే జంతువు

6) పల్లెటూళ్ళల్లో కొందరు పెద్దవాళ్ళు పాముకాటుకు తిరుగులేని మంత్రమేస్తారని చాలామంది నమ్మిక. వాళ్ళు మంత్రమేస్తే ఎలాంటి పాము విషమైనా ఇట్టే దిగిపోవాల్సిందే.... కానీ ఏ మంత్రానికీ, వైద్యానికీ లొంగనంత విషాన్ని కక్కే పాము ఏదో తెలుసా? ప్రపంచంలో రాటిల్ పాము విషానికి విరుగుడు లేదు...బాప్ రే..వింటుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తోంది కదూ......

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి