నీటి పెన్నిధి - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

water

నీటి పెన్నిధి

భూమిపై నిలిచిన నీటికి
కంచెకట్టి చెఱువుగా మలచుకుందాం
నింగి నుంచి జాలువారే వాన చుక్కలకు
దోసిలిపట్టి మట్టి గుండెలో భద్రపరచుదాం
డబ్బు విలువే కాదు, నీటిచుక్క విలువా
తెలుసుకున్నపుడే భూమ్మీద 
మనం మనగలిగేది
అప్రమత్తమైనప్పుడే ముందు తరాలకు
నీటి పెన్నిధి సొంతమయ్యేది!

పన్నీరు..కన్నీరు

పంచభూతాల్లోనిది
ప్రాణులకి కనీసావసరమైనది..నీరు
పొదుపుతో పరిరక్షించుకున్నామా
మానవ మనుగడ పన్నీరు!
నిర్లక్ష్యంతో వ్యవహరించామా
మిగిలేది కన్నీరు!!

మన బతుకు?

నీటి పట్ల అంత నిర్లక్ష్యం ఎందుకు?
ఒక్క బొట్టు దొరక్కపోతే అల్లాడిపోతావు ఒట్టు
సహజ వనరులు ఉండగానే
చక్కబెట్టుకోవాలి
లేదంటే..చేత్లు కాలాక ఆకుల చందమే..
మన బతుకు!