1. గట్టిగా అరిచే పక్షి సికాడి. ఆ అరుపుతోటే శత్రువుల నుంచీ తప్పించుకుంటుంది.
2. ఈస్టర్న్ కోరల్ స్నేక్ కాటు వేస్తే పన్నెండు గంటల వరకు ఎలాంటి నొప్పి వాపు కనిపించవు!
3. 8 నుంచి 14 అడుగుల పొడుగుండే భ్లాక్ మాంబా పాముకు ఆ పేరు రావడానికి కారణం నోటి లోపలి భాగం నీలం-నలుపు రంగుల్లో ఉండడమే!
4. అందమైన రంగులు కలిగి ఉండి, రంగు, ఆకారాలను మార్చుకునే చేప ప్యారట్ ఫిష్.
5. -50 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకునే నక్క ఆర్కిటిక్ ఫాక్స్.
6. పంగోలిన్ జంతువు ప్రమాదాన్ని గ్రహిస్తే క్షణాల్లో బంతిలా చుట్టుకుపోయి దుర్భరవాసనను వెదజల్లుతుంది.
7. రెండు మూపులున్న ఒంటె బాక్ట్రియన్.
8. పట్టుపురుగులు ఎగరగలవు కానీ ఎగిరే కొద్దీ ఎగిరే స్వభావం తగ్గిపోతుంది.
9. గోల్డెన్ కౌరి అనే నత్త కవచం చూడడానికి చాలా అందంగా ఉండడంతో పూర్వం చక్రవర్తులు ఇది తమ దగ్గ ఉండటాన్ని హోదాగా భావించేవారు.