వేసవి ప్రత్యేక కవిత - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

summer poets

నీరు_కన్నీరు_పన్నీరు

నీటికి కన్నీటికి ఒక్క "క"నే తేడా
"క"నీసం ఇప్పటికైనా "క"ళ్లు తెరిస్తే
అందరి భవిష్యత్తు పన్నీరే!

***

ప్రాణాధారాలు..పదిలం

అన్నం కొనుక్కుంటున్నాం
నీళ్లు కొనుక్కుంటున్నాం
గాలి కొనుక్కునే పరిస్థితి రాకూడదు
ఇప్పట్నుంచే ఆలోచిస్తే..
రేపటి కోసం..
స్వచ్ఛమైన గాలిని మిగుల్చుకున్నట్టే!

***

బుద్ధిజీవి?

మన తాత్కాలిక అవసరాలకోసం
ప్రకృతి వనరులను కలుషితం చేస్తున్నాం
జీవజంతుజాలంలో 
మానవుడు బుద్ధిజీవన్నది 
హాస్యాస్పదం చేస్తున్నాం

***