ఔరా! - ప్రతాపసుబ్బారాయుడు

wow

1. అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు ‘ఆల్ గోర్’ 2007 లో పర్యావరణ పరిరక్షణ గురించి ‘యాన్ ఇన్ కన్వీనియంట్ ట్రూత్‘ అనే షార్ట్ ఫిలిం తీశాడు. అందులో రెండు కప్పల గురించి తెలిపాడు. మొదటి కప్పను వేడి నీళ్లలో పడేశాడు. అది వేడిని తట్టుకోలేక వెంటనే బయటకు ఎగురుతుంది. రెండో కప్పను చల్లని నీటిలో ఉంచి ఆ నీటి ఉష్ణోగ్రతను క్రమంగా పెంచుతూ పోతే, కప్ప ఉష్ణోగ్రతకు అలవాటు పడి ఉడికిపోయే వరకు దానికి నీటి ఉష్ణోగ్రతలో తేడాలు తెలియలేదు. రెండో కప్పలా భుమి మీద క్రమంగా వేడి పెరగడాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. ఏదో ఒక రోజు ఈ వేడి మనల్ని దహించక ముందే పర్యావరణాన్ని సంరక్షించుకోవడం మన బాధ్యత.

2. ఎకరం విస్తీర్ణంలో గల చెట్ల నుంచి 18 మందికి జీవితాంతం సరిపడ ఆక్సీజన్ లభిస్తుంది.

3. ఒక మోటారు వాహనం 10,000 మైళ్ల దూరం ప్రయాణించి సృష్టించిన కాలుష్యాన్నంతటిని 15 చెట్లు పూర్తిగా పీల్చుకుంటాయి.

4. చెరువులని ఆక్రమించి వాటిని పూడ్చి వేసి పెద్ద పెద్ద భవంతులను నిర్మిస్తున్నారు. దీని వల్ల చుట్టు పక్కల ఉన్న ప్రదేశాల ఉష్ణోగ్రత పెరుగుతోంది. ఒకప్పుడు హైద్రాబాదులో 982 చెరువులు ఉండేవట. ఇప్పుడు కేవలం 500 మాత్రమే ఉన్నాయి. పైగా అవి చాలా వరకు కలుషితమైపోయాయి. ఆ చెరువుల కారణంగానే హైదరాబాదు ఇంత వేడిగా ఉండేది కాదు. చెరువులు సాయంత్రం వాతావరణాన్ని చల్లబరిచేవి.

5. ఒక చెట్టు రోజుకు 118 కిలోల ప్రాణ వాయువును విడుదల చేస్తుంది.

6. భూమ్మీద మనుషులందరికి ఆరు నెలల పాటు ఆక్సిజన్ అందించాలంటే దాదాపు 19 లక్షల కోట్ల రూపాయలు కర్చు అవుతుంది. అంతటి విలువైన ఆక్సీజన్ ను చెట్లు ఉచితంగా మనకు అందిస్తున్నాయి.

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి