పుట్ట గొడుగులు జాతి మొక్కల్లో ఒకటైన ట్రఫుల్స్ రకం పుట్టగొడుగులు నేలలోపలే పెరిగి, వ్యాపించి, పుష్పిస్తాయి. నేలమీదకు కనిపించకపోవటాన ఇవి పెరిగినట్లు, పుష్పించినట్లు, అసలు ఉన్నట్లే ఎవరికీ తెలియదు.
సెకోయియా చెట్లు, యూకలిప్టసు చెట్లు కొన్ని ప్రాంతాలలో మూడువందల అడుగుల పొడవు పెరుగుతాయి.
డెబ్బై అడుగులు ఎత్తు పెరిగే బెబిల్ అనబడే చెట్లు 25 అడుగుల లావెక్కుతాయి.
పేద్ద తోకున్న పక్షి గురించి విన్నారా? పేరు ‘లాంగ్ టేల్డ్ విడో’. రూపం బట్టే దీనికీ పేరు. ఈ పక్షి పరిమాణం మామూలుగానే ఉన్నా తోక మాత్రం ఏకంగా 20 అంగుళాల పొడవుంటుంది.
నీలి తిమింగలం రోజుకు దాదాపు మూడు టన్నుల ఆహారం తీసుకుంటుంది. ఇది ఆరు నెలలు ఆహారం లేకపోయినా జీవించగలదు.
ఎలుకలు తమను వేటాడడానికి వచ్చిన పిల్లులను వాసననుబట్టి పసిగడతాయి. ఏ పిల్లి వాసన ఎలా ఉంటుందో ఎలుకలకు తెలుస్తుంది.
కొన్ని రకాల తిమింగలాలు సైతం వెళ్లలేని లోతులకు ఎలిఫెంట్ సీల్ వెళ్లిపోతుంది. సముద్ర ఉపరితలంనుండి 3300 అడుగుల లోతులోకి వెళ్లి ఇది హాయిగా జీవిస్తుంది.
ఆడ తిమింగలాలు ఆహారంకోసం సాగరాల్లో లోతుకు వెడతాయి. కూడా వాటి పిల్లల్ని అంత లోతులకు తీసుకువెళ్లలేవు. తల్లి ఇలా ఆహారంకోసం వెళ్లినపుడు పిల్ల తిమింగలాల చుట్టూ ఇతర తిమింగలాలు వలయాకారంగా ఏర్పడి కాపలా కాస్తాయి. ఈ పిల్లల బాధ్యత గుంపులోని ఒక ఆడ తిమింగలం తీసుకుంటుంది. అందుకే తిమింగలాల సంతతి కాపాడబడుతోంది.