సింగపూర్ పాఠం - 2
ఇటు మలేషియా, అటు ఇండోనేషియా దేశాలు వైశాల్యం లో పెద్దవి కావటంతో ఆయా దేశాలకు సంబంధించిన ఉద్గారాల నుంచి రక్షణ పొందేందుకు మరింత పచ్చదనానికి ప్రాధాన్యత నిస్తుంది సింగపూర్ ప్రభుత్వం.
రాబోయే వంద సంవత్సరాల ప్రణాళికతో యోచిస్తుంటారు సింగపూర్ పాలకులు.
జననాల రేటు ఎంత?
అంత మందికి నివాసం... మౌళిక సదుపాయాలు గురించి ఇప్పుడే ఆలోచిస్తున్నారంటే ఎంత ముందుచూపు వారికి..?!
ఉష్ణొగ్రతలు పెరిగి పోతుండటం... వర్షాలు చాలినన్ని పడక పోవటం అన్నది ఈ మధ్యనే మన దేశంలో కొద్ది మంది ముఖ్య మంత్రులు, మంత్రులు గమనించి పచ్చదనం ప్రాముఖ్యత గుర్తెరిగి కోట్లాది మొక్కలు నాటటం ఆరంభించారు.
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మాత్రం గుర్తెరిగితే సరిపోతుందా?!
మిగతా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం నిద్ర పోతుంటే సామాన్యులకి ఏహ్య భావం కలుగుతోంది.
ఐదారు దశాబ్ధాల క్రితమే పారిశ్రామికీకరణ జరగక పోతే తమ ప్రజలు నిరుద్యోగానికి లోనవుతారని గమనించిన సింగపూర్ ప్రభుత్వం జపాన్, తైవాన్, హాంగ్ కాంగ్, దక్షిణ కొరియా దేశాల ప్రభుత్వాలతో, పారిశ్రామిక వేత్తలతో సుదీర్ఘమైన సంప్రదింపులు జరిపి ఉద్గారాలు తక్కువ స్థాయిలో విడుదలయ్యే పరిశ్రమల్ని తమ దేశంలో స్థాపించుకుని , దేశంలో నిరుద్యోగం అనేది లేకుండా చేసుకున్నారు.
ఎయిరో స్పేస్...
బీర్..అండ్ బ్రీవరీస్
కాస్మెటిక్స్...
ఎలక్ట్రానిక్స్..
ఇంజనీరింగ్
ఫుడ్ మాన్యుఫాక్చరింగ్..
ఈ ఆరు కేటగిరీల క్రింద ఎన్నింటినో స్థాపించుకున్నారు.
ఆయా ఉత్పత్తుల్నీ అత్యున్నత స్థాయి నాణ్యతా ప్రమాణాలతో తయారు చేసి విదేశీ ద్రవ్యాన్ని ఇబ్బడి ముబ్బడిగా సంపాదిస్తోంది సింగపూర్.
మరి మన దేశంలో ఏ ఉత్పత్తిని చూసినా ఇతర దేశాలు చీ.. కొట్టటమే.. నాసి రకం అని వెనక్కి తిప్పి పంపటమే.. మరి ఇక్కడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? వచ్చే ఎలక్షన్స్ లో తిరిగి అధికారంలోకి రావాలనే ఆలోచనల్లో కూరుకు పోతున్నాయి. నాణ్యత మీద నిఘా లేదు... తూనికలు, కొలతల్ మీదసలే లేదు, ధరల మీద అంత కంటే లేదు.
ఎవరిని, ఏవర్గాన్ని, ఏ మతాన్ని కదిలిస్తే, తప్పు ఎత్తి చూపిటే ఎక్కడ ఓట్లు పోతాయనే నీచమైన భయం తో భారత దేశ రాజకీయ పార్టీలు, నాయకులు నిత్యం అభద్రతా భావం తో బతికేస్తుంటారు.
అదే సింగపూర్ లో కుల మతాలతో సంబంధం లేదు, తప్పు చేస్తే ముందు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళి బట్టలు విప్పి ఐస్ గడ్డపై కూర్చోబెట్టి , బ్యాక్ పార్ట్ మొద్దు బారి పోయాక - తేనె బెత్తాలతో చితగ్గొట్టేస్తారు.
ఇక పోతే బెంగిళూరు సిటీ అంత సింగపూర్ దేశంలో నివాసం చాలా కష్టమైన విషయం ''
కఠినమైన నియమ నిబంధనల మధ్య చిన్న చిన్న అపార్ట్ మెంట్స్ నిర్మించుకుంటారు.
కేవలం 400 చ. అడుగుల అపార్ట్ మెంట్ కూడా ఎంతో సౌకర్యవంతంగా నిర్మిస్తారు. గాలి, వెలుతురు , నీరు, విద్యుత్, డిస్పోజబుల్ వేస్టేజ్,
ప్రతిది పకడ్బందీగా నిర్మిస్తారు. ప్రతి ఫ్లోర్ లో గార్బేజ్ డిస్పోజబుల్ చానల్స్ ఏర్పాటు చేస్తాను. చెత్త వేస్టేజ్ డిస్పోజబుల్స్ అన్నీ ఒక బ్యాగ్ లో వేసి, ముడి వేసి డిస్పోజబుల్ చానల్స్ వేస్తే అది నేరుగా కిందికి జారి మున్సిపల్ డిపార్ట్ మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ / ఫస్ట్ బేస్ మెంట్ లో ఉన్న గార్బేజ్ కంటైనర్ లో పడి పోతాయి.
ప్రొద్దున, సాయంత్రం గార్బేజ్ వ్యాన్స్ వచ్చి వాటిని ఆటోమేటిక్ ట్రక్స్ లోకి తీసుకొని, ఖాళీగా కంటైనర్స్ ని అదే స్థలం లో వుంచి నిండి పోయిన వాటిని రీసైక్లింగ్ సెంటర్స్ కి తీసుకెళ్ళి వదిలేస్తారు.
ఈ ప్రక్రియ నిరంతరం గా జరుగుతూనే వుంటుంది.
ఎక్కడా రోడ్ల మీద చెత్తా చెదారం కనిపించదు.
ఒక అపార్ట్ మెంట్ సముదాయానికి మరో అపార్ట్ మెంట్ కి మధ్య భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఖాళీ స్థలాలు వదిలేసి అందులో పచ్చటి లాన్స్ వేస్తారు. అవి భవిష్యత్ లో జనాభా పెరిగితే కొత్తగా అపార్ట్ మెంట్స్ నిర్మించటానికి ఉద్దేశించినవి.
ప్రతి నివాసంలోనూ బాత్ రూంస్ లో పంప్స్ - హేండ్ షవర్ కే తప్ప రూఫ్ టాప్ షవర్స్ వుండటానికి వీలు లేదు. నీటి పొదుపు బాగా పాటిస్తారు.
లావెట్రిన్ కమోడ్స్ అతి తక్కువ నీటికే ఫ్లషవుటయిపోతాయి. అలాంటి కమోడ్స్ నే దిగుమతి చేసుకుంటారు.
జనాభా గ్రోత్ రేట్ 1.6% మాత్రమే..
మన దేశంలో..?!
హద్దు అదుపు లేని జనాభా గ్రోత్ రేట్.. ఇప్పటికీ మన దేశంలో ముగ్గురు, నలుగురు, లేదా ఐదుగుర్ని కంటూనే వున్నారు. వీళ్ళందరికీ నీరు, విద్యుత్, మౌళిక సదుపాయాలైన రోడ్లు , రైల్వేస్, ఫ్లై ఓవర్స్ ఎలా..?
130 కోట్ల జనాభా వున్న మన దేశం లో మౌళిక సదుపాయాలకి 5 కోటి కోట్లు కావల్సి వుంటుందని నిపుణుల అంచనా..
ఎంత భాద్యత లేని దేశం మనది..?!! పాలకులూ అంతే.. ప్రజలూ అంతే..
ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకోవటం, వాటికి డాక్యుమెంట్స్ క్రియేట్ చేయటం. అడ్డ దిడ్డం గా అపార్ట్ మెంట్స్ కట్టడం, అమ్మేయటం.. ఇదీ ఇప్పుడు మనదేశం లో ప్రధానం గా జరిగే ప్రక్రియ.
సింగపూర్ హౌసింగ్ డెవలప్ మెంట్ సంస్థకి తెలీకుండా ఒక్క ఇల్లు లేదా అపార్ట్ మెంట్ కూడా కట్టలేరు. అక్కడ అక్రమంగా కట్టే కాంట్రాక్టర్ లేదా బిల్డర్, చివరకు వర్కర్స్ కూడా జైలు పాలయి పోతారు.
లంచాలు, రికమండేషన్స్, లాబీయింగ్ అక్కడ చెల్లు బాటు కావు.
వచ్చే సంచికలో ..... సింగపూర్ పాఠం - 3