కావలసిన పదార్థాలు:
గోంగూర, పప్పు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చి మిర్చి, ఆవాలు, జీలకర్ర, పప్పు దినుసులు.
తయారుచేయు విధానం:
గోంగూరను శుభ్రంగా కడుక్కొని ఆకులు కోసుకోవాలి. పప్పు ని ఉడికించి రెడీగా వుంచుకోవాలి. స్టవ్ పై బాండీలో నూనె వేడి చేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, పప్పుదినుసులు వేసుకొని, అవి కొద్దిగా వేగాక వెల్లుల్లి , పచ్చిమిరపకాయలు, ఎండు మిర్చి, కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా వేగాక అందులో గోంగూర ఆకుల్ని అందులో వేసి ఒక సారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఉడికించాలి. కొద్దిగా నీళ్ళు పోసుకొని, కొద్దిగా చింతపండు వేసుకొని, కొద్ది సేపు ఉడికించాలి. తరువాత అందులో ఉడికించిన పప్పు వేసుకొని, సరిపడా ఉప్పు వేసుకొని మరి కొద్ది సేపు ఉడికించాలి. స్టవ్ పై నుండి దింపుకొని కొద్దిగా నెయ్యి వేస్తే ఘుమఘుమలాడే గోంగూర పప్పు రెడీ