చూత ఫలం . [వేసవి ఫలం ]
ముందుగా వేసవిఫలమైన మామిడి గురించీ చెప్పుకుందాం.
పండ్లను ప్రేమతో తినే వారు వేసవి వచ్చిందంటే ఆశగా మార్కెట్లో ఎదురు చూసేది మామిడి పండుకోసం . మామిడి ని ఆగ్లంలో మ్యాన్ గో అంటాం. ఇంకా చూత మనీ, ఆమ్ర మనీ తమిళంలో మాంగాయ్, మళయాళంలోని మాంగా అనీ కన్నడంలో మావిన అనీ అంటారు. మామిడి భారతదేశపు జాతీయ ఫలం. మామిడి పండు తినడమే కాక పచ్చి మామిడికాయలతో ఎన్నోరకాల ఊర గాయలు పెట్టు కుంటాం, ముఖ్యంగా ఆంధ్రుల ఇంటి ఆవకాయకున్న ప్రత్యేకత చెప్ప లేనిది. ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రులతో పాటుగా ఆవకాయకూడా ప్రసిధ్ధిచెందింది.ఆవకాయమీద శతకాలూ,కూడా వచ్చాయి.
మామిడిపళ్ల రసం ప్రత్యేకత దానికే చెల్లుతుంది. మామిడి జ్యూస్ రుచికి మరోటిసరిరాదు.మామిడి తాండ్రకు రాజమండ్రి ప్రసిధ్ధి. దీని లో కెరోటిన్ , విటమిన్ సి, కాల్షియం ఎక్కువగా ఉంటాయి.ఓం ఏకదంతాయ నమః - చూత పత్రం పూజయామి 'అంటూ గణపతికి మామిడి ఆకులను వినాయక చవితి పండుగనాడు సమర్పింస్తాం.
ప్రతి భారతీయుని ఇంటా శుభాలకు మామిడి తోరణాలు లేకుండా జరగదు. మామిడి ఆకు పచ్చ దనం శుభ సూచకం. ఈ చెట్టు మహా వృక్షం గా పెరుగు తుంది. భారతదేశంలో వంద రకాలకు పైగా మామిడిపళ్ళు లభిస్తున్నాయి .ఇది ఉష్ణదేశాల్లోనే పెరుగు తుంది. అమేరికా వంటి శీతల దేశాల్లో ఇది పెరగడం తక్కువ. ఇది 90నుండీ 120 అడుగుల వరకూ ఎత్తు పెరుగు తుంది. మామిడి పూల చాలా ఎక్కువగా పూస్తుంది, ఐతే నిలిచేది చాలా తక్కువ. కొమ్మల చివరన గుత్తులు గుత్తులుగా ఒకరకమైన పసుపు వర్ణం లో లేలేత సువాసనతో ఉంటాయి. పూలు పిందెలుగా కాయలుగా, పండ్లుగా రాను షుమారుగా మూడునుండీ ఆరు మాసాలలు పడుతుంది. పక్వానికి వచ్చిన పండ్లు పొడవాటి కాడలతో కిందకు వేలాడుతూ ఉంటాయి. ఇవి సూర్యరశ్మి తగిలే వైపు కొంచెం లేత ఎరుపు రంగుతోను ఇంకొక వైపు పసుపు రంగుతోను ఉంటాయి. ఇవి తియ్యని సువాసనతో వాసన రాగానే నోటనీరు ఊరుతుంది. ఏప్రిల్నుండీ జూన్ నెలల్లో మామిడి పండ్లు లభిస్తుంటాయి. ప్రపంచం అంతటా ఇప్పుడు మామిడి పండు తినడం పట్ల మక్కువ ఎక్కువగా పెరిగింది అంటే దానిరుచి దానికే చెల్లుతుంది. దీన్ని ఎక్కువగా తాజాగానే తింటే రుచి బావుంటుంది.
మామిడిపండ్లు ప్రపంచమంతా ఇష్టంగాతింటున్నా రైతులకుదక్కే ప్రతిఫలం మాత్రం తక్కువనే చెప్పాలి. తాజా మామిడి పండు లో పదిహేను శాతం -చక్కెర, ఒక శాతం-మాంసకృత్తులు , ఎ,బి,సి విటమిన్లు ఉంటాయి. మామిడి పండు ఎక్కువగా తియ్యగా ఉన్నా, కొన్నిజాతుల పండు కొంచెం పుల్లగా ఉంటుంది, ముఖ్యంగా చిలక ముక్కు(బెంగళూరు) మామిడి ఈ కోవకు చెందినదే. భారత దేశం లో చిన్నచిన్న వ్యాపారులు మామిడి కాయలను సన్నని పొడవైన ముక్కలుగా కోసి ఉప్పు కారం చల్లి బండిమీద అమ్ముతూ ఉంటారు. చాలామందికి నోరూరించే కాల క్షేపాహారం. ఎక్కువ రసంతో ఉండే ఫలాలను రసాలు అంటారు. కండతో ఉండేవి 'మల్ గోవా 'మామిడి వంటివి.బంగినపల్లి మామిడి కాయలు ఎక్కువ తీయగా మెత్తటి కండతో ఉంటాయి. మామిడి కాయ లతో నిలవ ఉండే ఊరగాయలుదేశవ్యాప్తంగా తయారు చేస్తారు.నేడు ఇది ఒక గృహ పరిశ్రమగా కూడా సాగుతున్నది. పచ్చి మామిడి కాయ ను వంటలలో రోజువారీపచ్చళ్ళు గానూ,పప్పులోకీ, పులిహోరగానూ, ఇంకా ఎన్నో కూరల్లో వాడు తుంటారు. కాల్షియమ్ - విటమిన్ బి ,అధికగా ఉంటాయి.
మామిడిలో లభించేపోషకాలు -పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు-పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు --శక్తి 70 kcal 270 kJ,పిండిపదార్థాలు -17.00 గ్రా,చక్కెరలు-14.8 గ్రా.,పీచుపదార్థాలు-1.8 గ్రా,కొవ్వు పదార్థాలు-0.27 గ్రా.,మాంసకృత్తుల-.51 గ్రా.,విటమిన్ A 38 μg-4%,విట.బి1 0.058 mg -4%,విట. బి2- 0.057 mg -4%,విట. బి3 0.584 mg -4%/పాంటోథీనిక్ ఆమ్లం (B5) 0.160 mg-3%,విటమిన్ బి6 0.134 mg-10%,Vit. B914 μg -4%,విటమిన్ సి 27.7 mg 46%,కాల్షియమ్ 10 mg-1%,ఇనుము 0.13 mg-1%,మెగ్నీషియమ్ 9 mg-2% ,భాస్వరం 11 mg-2%,పొటాషియం 156 mg -3%,జింకు 0.04 mg-0% శాతం లభిస్తాయి..పచ్చి మామిడికాయలో విటమిన్ సీ పుష్కళంగా లభిస్తుంది. గుండె కండరాలనూ బలమిస్తుంది. బిగువుని స్తుంది. ఎక్కువగా పచ్చిమామిడితింటే ఆర్ధరైటిస్, కీళ్లవాతం, సైనసైటిస్, గొంతునొప్పి, అసిడిటీ లాంటి వ్యాధులు రావచ్చు. మామిడి ముక్కలు వేసిన ఫ్రూట్ సలాడ్ ,మామిడి గుజ్జు ఐస్ క్రీం రుచి తింటేకానీ తెలీదు.మామిడి పళ్లను త్వరగా మాగ పెట్టేందుకు కాల్షియం కార్బైడ్ ను వినియోగించి రైతులు , వ్యాపారులు లాభాపేక్షతో ,మామిడి పండ్ల రంగును , రుచిని పోగొట్టడమేకాక వాతిని తినేవారికి విష ప్రయోగాలద్వారా తీవ్ర అనారోగ్యాలను అంటకడుతున్నారు. పురాణాలలో, వేద కాలం లో కూడా మామిడి ఉన్నట్లు వర్ణనలు ఋజువులూ ఉన్నాయి. రోమర్ష మహర్షి కాలంలో మామిడి పండు ఉన్నట్లు భారతంలో వస్తుంది.
భారతీయ సాంప్రదాయంలో మామిడి ఆకుల తోరణం లేంది ఏ పండుగా , శుభకార్యం జరగదని చెప్పుకున్నమకదా!అది ఎందు కనీ అంటేమమిడి ఆకులు చెట్టునుంచీ తెంపాక కూడా కొన్నిగంటలపాటు ఆక్సిజన ను విడుదలచేస్తాయిట, మంది చేరినచోట ప్రాణవా యువు తగ్గినపుడు ఈమామిడాకులు దాన్ని విడుదలచేసి అక్కడున్నజనాలు అనారోగ్యం పాలు కాకుండా కాపాడు తాయన్నమాట. మామిడిలో అనేకరకాలున్నాయి, రుచిని బట్టి కొన్నింటినికొందరు ఇష్టపడు తుంటారు. మామిడిలో కొన్ని రకాలేంటంటే బంగినపల్లి, నీలం, మల్గోవా, అంటు మామిడి , రసాలు చిన్న-పెద్ద, చెరుకు , షోలాపూరి, నూజివీడు రసం, పంచదార కలశ, సువర్ణరేఖ, కొబ్బరి మామిడి మొదలైనవి.
ఇంటి లోని పెరడులో పెంచే ఒకే చెట్టుకు అనేక రకాల మామిడి కాయలను అంటుయ్కట్టి ట్రీ టాప్ గ్రాఫ్టింగ్" ద్వారా కాయించ వచ్చు. "బాగా ఎదిగిన పెద్ద మామిడి చెట్టు పెద్ద కొమ్మలను కొట్టినట్లైతే ,మూడు నెలలకు, కొట్టిన కొమ్మకు చిగుర్లు వస్తాయి. అవి చేతి వేలు ప్రమాణం వచ్చి నపుడు వాటిని సన్నటి పదునైన చాకుతో ఏట వాలుగా కోయాలి. మనకు కావలసిన అనేక రకాల మామిడి రకాల చెట్టు కొమ్మల నుండి చేతి వేలి లావున్న కొమ్మలను ఏటవాలుగా కోసి ఈ చెట్టుకు కోసిన కొమ్మలకు అతికించి గట్టిగా కట్టాలి. ఆ విధం గా కావలసిన రకాల కొమ్మలన్నింటినీ అతికించి కట్టాలి. కొంత కాలానికి కొత్తగా అతికించిన కొమ్మ చిగు ర్లు వేసి పెద్దదై దానికి సంబంధించిన కాయలను కాస్తుంది. ఎన్ని రకాల కొమ్మలను అతికించామో అన్ని రకాల కాయలు కాస్తుంది. ప్రతి ఏడు ఇలా కావ ల సిన రకాల కొమ్మలను అంటు కట్టి రకరకాల కాయలను కాయించ వచ్చు.మామిడికాయలతో పెట్టే ఊరగాయరకాలు ఆవకాయ, మాగాయ,ముక్కల పచ్చడి,తురుము పచ్చడి,పెసర ఆవకాయ[దీన్ని ఎక్కువగా రాజమండ్రి ప్రాంతవాసులు పెడతారు]బెల్లపు ఆవ కాయ ప్రసిధ్ధిచెందినవి. మరి వేసవి ఫలమైన మామిడి గురించీ చెప్పుకున్నం కదా వెంటనె అవెళ్ళి వేసై వెళ్ళేలోగా కొన్నైనా మధుర మామిళ్ళు తిందామా!