విశేషాలు!
1. 14 రోజులు మాత్రమే జీవించే ఈగలు తమ సంగీత సాధన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలవండోయ్! నిరంతరం కూనిరాగం తీస్తూనే ఉంటాయి.
2. ఆస్ట్రిచ్ లు గుర్రాలకన్నా వేగంగా పరిగెడతాయని మీకు తెలుసా? ఆశ్చర్యంగా ఉంది కదూ..అంతేకాదు మగ ఆస్ట్రిచ్ లు సింహాల్లా గర్జిస్తాయండోయ్!
3. పాలిచ్చే జంతువుల్లో గబ్బిలాలు మాత్రమే ఎగరగలవు.
4. కంగారూలు తమ తోకను బ్యాలెన్స్ చేసుకోడానికి ఉపయోగిస్తాయట..ఒకవేళ మనం తోకను పైకెత్తితే అవి ఇహ గెంతలేవు.
5. పులులకు వాటి వెంట్రుకల మీద మాత్రమే కాదు శరీరం మీదా చారలుంటాయి. అంతేకాదండోయ్..ఏ రెంటి చారలు ఒక్కలా ఉండవట. మన వేలిముద్రలలాగా అన్నమాట.
6. ఊపిరితిత్తులు లేకుండా, అసలు నిద్రే పోకుండా ఉండే జీవులు ఏవిటో తెలుసా? మనం నిత్యం చూసే చీమలండీ బాబూ..
7. రెక్కలమీద అన్ని రంగులుండే సీతాకోక చిలుకకు ఎనో అద్దాలు ఉన్న రెండు కళ్లు ఉన్నప్పటికీ అవి కేవలం ఎరుపు, ఆకుపచ్చ మరియు పసుపుపచ్చ రంగులను మాత్రమే చూడగలవు. పాపం కదా!
8. రావణాసురుడికి ఒక తల పోతే మరో తల వచ్చేట్టుగా, ఒక కన్ను పోతే మరో కన్ను వచ్చే జీవి నత్త..నిజం!
9. జిరాఫీలకు స్వరపేటికలుండవు అంతేకాదు వాటి నాలుక నీలం, నలుపు కలగలుపు రంగులో ఉంటుంది.
*****