మన ఆరోగ్య్హం మన చేతుల్లో - .

 

ముందుగా సాధారణముగా ఎక్కువగా దొరికే చౌక అయిన  "జామ పండు"దాని  ప్రాముఖ్యతను తెలుసుకుందాము.  


జామపండ్లు లేదా కాయలను తిననివారు ఎరుగనివారు  సామాన్యముగా ఉండరు మన ప్రాంతాలలో బాగా దొరికే పండు రుచికరమైన పండే కాకుండా మంచి  ఆరోగ్యప్రదాయిని ఎందుకంటే ఈ పండు ఆరోగ్యాన్ని ఇచ్చే విటమిన్లను,ఖనిజ లవణాలను కలిగి ఉంటుంది చాలా రోగాలకు మంచి ముందుగా పనిచేస్తుంది మనకు దొరికే జామపండ్లు ఆకుపచ్చ లేత పసుపచ్చ కొన్ని ప్రాంతాలలో మెరూన్ కలర్లలో లభ్యమవుతాయి లోపలి గుజ్జు తెలుపు లేదా పింక్ రంగులో ఉంటుంది దొరగా పండిన జామ పండు మంచి సువాసనతో రుచిగా ఉంటుంది .

ఈ జామ పండ్లు ఆరోగ్యానికి ఏవిధముగా సహాయపడతాయి తెలుసుకుందాము ఈ పండు బరువు తగ్గటానికి అదేవిధముగా బరువు పెరగటానికి రెండు విధాలుగా ఉపయోగపడుతుంది మొదట బరువు తగ్గటానికి ఏవిధముగా పనిచేస్తుందో చూద్దాము బరువు పెరుగుతాము అన్న భయముతో జామపండు తినటం మానక్కరలేదు ఒక జామపండు తింటే  కడుపు నిండి ఆకలి తగ్గుతుంది.కొద్దిపాటి కెలోరీలను మాత్రమే శరీరానికి అందిస్తుంది పిండిపదార్ధాలు తక్కువగాను,కొలెస్ట్రాల్ లేనట్టి పండు ఇదే. 

మిగిలిన పండ్లతో పోలిస్తే దీనిలోచక్కెర శాతము తక్కువ శరీరానికి కావలసిన విటమిన్లు,ప్రోటీన్లు, పీచు పదార్ధము,మరియు ఖనిజ లవణాలను  అందిస్తుంది. సన్నగా  ఉండే వాళ్ళు బరువు పెరగటానికి ఈ పండు పోషకాలు సక్రమముగా శరీరము
శోషించుకోవటానికి సహకరిస్తుం  మెటబాలిక్ చర్యలను నియంత్రించటం ద్వారా ఇది జరుగుతుంది.

జామపండ్లు పీచు అధికముగా కలిగినవి అవటం హైపో గ్లైసిమిక్ అవటంవల్ల రక్త పీడనము తగ్గుతుంది జామపండు లోని డైటరీ పీచు  రక్తము చిక్క బడకుండా ద్రవ స్థితిని సమతుల్యము చేస్తుంది .పీచు తక్కువగా ఉన్న ఆహారంలోని పిండి పదార్ధాలు త్వరగా చక్కెరలుగా మారి రక్త పీడనాన్ని పెంచే అవకాశము ఉంది 

ఫలితముగా మధుమేహము వ్యాధి వచ్చే అవకాశము ఉంది జామ దీనిని నియంత్రిస్తుంది డయోరియా, డిసెంట్రీ ,గ్యాస్ట్రో ఎంటరైటిస్ వ్యాధులను రాకుండా కాపాడుతుంది  జామలోసమృద్ధిగా ఉండే ఎస్ట్రింజెంట్ (కణాలను సంకోచింప జేసే పదార్ధము) ప్రేగుల్లో సులభముగా సాఫీగా కదిలేటట్లు చేయటం వల్ల డయోరియా ,గ్యాస్ట్రో ఎంటరైటిస్ లను నియంత్రిస్తుంది వీటిలోని విటమిన్ సి  కెరోటినాయిడ్స్, పొటాషియం అరుగుదలను పెంచుతాయి. క్షార స్వభావము అధికము గా ఉండటము వలన అధికముగా ఉన్న మ్యూకస్ ను తొలగించే డిస్ ఇంఫెక్టన్ట్ గా
పనిచేస్తుంది ఏ మ్యూకస్ అధికముగా ఉంటే ప్రేగుల్లో సూక్షజీవుల సంఖ్య అధికమవుతుంది .

థైరాయిడ్ మెటాబాలిజమును అదుపుచేసే కాపర్ జామలో అధికముగా ఉంటుంది కాబట్టి థైరాయిడ్ ఆరోగ్యము సక్రమముగా ఉంది హార్మోనులను సక్రమముగా ఉత్పత్తిచేసే శరీర ఆరోగ్యానికి సహాయపడుతుంది .మెదడు ఆరోగ్యానికి ఉపకరించే బి3,బి 6లు జామలో అధికముగా ఉంటాయి. బి3(నయాసిన్) మెదడుకు రక్త ప్రసరణను అధికంచేస్తుంది బి6 నాడుల పనితీరును నియంత్రిస్తుంది  జామలో బత్తాయి,నారింజ పండ్లలో ఉండే విటమిన్ సి కన్నా4 రెట్లు అధికముగా ఉంటుంది.   విటమిన్ సి ని చౌకగా, అధికముగా ఇచ్చేది జామ పండే. 

జామపండులోని విటమిన్ సి స్కర్వీ రాకుండా కాపాడుతుంది . జామ గింజలు తిన్నా నమిలిన మంచి విరేచనాకారిణిగా పనిచేస్తుంది అంటే
మలబద్దకాన్ని నివారిస్తుంది. పండ్ల లోని డైటరీ పీచు మలబద్దకానికి మంచి మందు ఎలాగంటే ఈ పీచు ప్రేగులను శుబ్రము చేస్తుంది మల విసర్జక వ్యవస్థను సమర్ధవంతముగా పనిచేయటానికి తోడ్పడుతుంది నీటిని వృధాగా బయటకు పోనివ్వకుండా ప్రేగుల్లో ఆహారపదార్ధాల కదలికను సక్రమముగా జరిగేటట్లు సహాయ పడుతుంది. తాజా జామా పండ్ల  రసము జలుబు,దగ్గులాంటి వ్యాధులను సమర్ధ వంతముగా ఎదుర్కోవటానికి ఉపయోగ పడుతుంది

ఎందుకంటే దీనిలోని ఎస్ట్రింజెంట్ శ్వాస నాళములో మ్యూకస్ ను తగ్గిస్తుంది ఫలితముగా గొంతు,  ఊపిరితిత్తులలో సూక్ష్మ జీవుల పెరుగుదల ఎక్కువగా ఉండదు. జామ పండులోని విటమిన్ సి, ఐరన్ ,వైరల్ ఇన్ఫెక్షన్స నుండి రక్షణ ఇస్తాయి.కానీ జలుబు దగ్గు తో బాధపడుతున్నప్పుడు  బాగా పండినజామ పండ్లు తినరాదు తింటే భాధ ఎక్కువ అవుతుంది . జామపండులోని విటమిన్ ఏ శాతము కంటి చూపును బాగా ఉంచుతుంది కంటికి సంబంధించిన మ్యాక్యులార్ డిజెనరేషన్ వేగాన్ని తగ్గిస్తుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారించటంలో జామ బాగా పనిచేస్తుంది. జామ లోని లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ మగవారిలో ప్రోస్ట్రేట్ క్యాన్సర్ ఆడవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ కణాల పెరుగుదలను అదుపుచేస్తుంది క్యాన్సర్ కణాల పెరుగుదలను   అరికట్టటములో జామ ఆకుల నుండి తీసిన నూనె లోగల యాంటీ ప్రొలిఫరేటివ్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. 

చర్మము ఆరోగ్యవంతముగా మెరుపుతో కనిపించాలి అంటే తాజా జామ పళ్ళుమరియు  ఆకులు ఉపయోగిస్తాయి జామ ఆకుల డీకాక్షన్ తో చర్మాన్ని కడిగితే వాటిలోని యాస్ట్రింజెంట్లు  చర్మమును బాగా ప్రకాశవంతముగా చేస్తాయి జామ పండు తినటంవల్ల శరీరానికి విటమిన్ ఏ,బి,సి,లు పుష్కలముగా లభ్యమవుతాయి వీటికి తోడు అమోఘమైన యాంటీ ఆక్సిడెంట్ మరియు డిటాక్సిఫయర్అయినా పొటాషియమ్ కూడా  లభ్యమవుతుంది. ఇవి చర్మముపై ముడతలు ఏర్పడకుండా కాపాడుతాయి గాయాలు అయినప్పుడు త్వరగా నయముచేస్తాయి   ఇవండీ జామ పండ్ల వల్ల నాకు తెలిసిన కొన్ని ఉపయోగాలు ఇంకెందుకు ఆలస్యము బజారుకు వెళ్లి జామపండ్లు కొనుక్కుని శుభ్రముగా కడుక్కొని హాయిగాతినండి ఆరోగ్యముగా ఉండండి .

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి