చిత్రం భళారే విచిత్రం - మావూరు.విజయలక్ష్మి


ఈ ప్రపంచమే వింతలమయం. తరచి చూడాలేగానీ..... అడుగడుగునా వింతే: ఆలాంటి వింతలే జంతువుల ఆలయాలు. శ్రీ మహావిష్ణువు దశావతారాలలో కూర్మావతారానికి సంబంధించిన ఆలయం, సగం మనిషి, సగం సింహం ఆకారంలో ఉన్న నరసింహస్వామి ఆలయాలను మనం చూస్తాం. కాని ఒక కుక్కకో, పిల్లికో, ఎలుగుబంటికో ఆలయలున్నాయంటే మనం నమ్మగలమా? ఎంతమాత్రం నమ్మలేం. కాని నమ్మకతప్పదు. ఆలాంటి నమ్మలేని, నమ్మకతప్పని ఆలయాల  మీద ఓ లుక్కేద్దాం.

 


కుక్కలకు ఆలయాలు

మధ్య ప్రదేశ్  రాష్హ్త్రంలోని దిందోరి జిల్లాలోని  కుకర్రమట్ గ్రామంలో ఉంది శునకాల గుడి..  గుడి పేరు కూడా కుకుర్ మందిర్. కుకుర్ అంటే సంస్కృతంలో కుక్క అని అర్థం.  బైగా ఆదివాసీలకు నిలయమైన ఈ గ్రామంలో 10 వ శతాబ్దంలో నిర్మించబడింది  ఈ ఆలయం. దీనికి సంబంధించిన చరిత్రలోనికి వెళ్తే విభిన్న కథనాలు వినబడతాయి. స్థానిక ప్రజలు నమ్మేదాన్నిబట్టి  పూర్వం ఒక సంచారజాతి వ్యక్తీ స్థానికంగా రుణాలనిచ్చే సంస్థ నుంచి తన కుక్కను తాకట్టు పెట్టి  కొంత రుణాన్ని తీసుకున్నాడు. ఆ తరువాత కొంతకాలానికి  ఆ సంచారజాతి వ్యక్తి తన వ్యాపార నిమ్మిత్తం దూరప్రాంతా లకు వెళ్ళిపోయాడు. అక్కడ కొంత ధనాన్ని సంపాదించి, తన స్వస్థలానికి వెళ్లి కుక్కను విడిపించుకోవాలని బయలుదేరాడు. ఇంతలో ఇక్కడ అతనికి రుణాన్నిచ్చిన సంస్థలో దొంగలు పడి ధనాన్నంతటిని దోచుకున్నారు. అప్పుడా కుక్క ఆ దొంగలు దోచుకున్న ధనాన్ని దొంగలు ఎక్కడ దాచారో కనిపెట్టి సంస్థవారికి తెలిపింది. అది చేసిన సహాయానికి ప్రతిఫలంగా దానిని తాకట్టునుంఛి విడుదల చేసి జరిగిన విషయమంతా వివరిస్తూ ఒక లేఖ రాసి దాని మేడలో కట్టి వదిలేశారు. ఆ కుక్క తన యజమానిని వెతుక్కుంటూ బయలుదేరింది. కొంతదూరం వెళ్లేసరికి దానికెదురుపడిన యజమాని, అది తాకట్టునుంఛి తప్పించుకుని దొంగతనంగా  వస్తున్నదని భ్రమపడి చేతిలోని కత్తితో దానిని నరికి చంపేసాడు. ఆ తరువాత దాని మెడలోని కాగితాన్ని చదివి తన తొందరపాటుకు బాధపడి, తను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా దానికొక గుడి కట్టి పూజలు చేయడం మొదలుపెట్టాడు. అప్పటినుంచి ఆ ప్రాంత ప్రజలందరికీ అది పూజనీయంగా మారిపోయింది. ఆ గుడిలో పూజలు చేస్తే త్వరగా రుణాలు తిరతాయని అక్కడివారి నమ్మకం. నర్మదానది జన్మస్థానం మయిన  అమరకంటక్ పర్యటనకు వచ్చే యాత్రికులు చాలామంది ఈ మందిరాన్ని దర్శించుకునే వెళతారు. ఈ గుడి గురించి మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. ఆది శంకరాచార్యులవారు నిర్మించిన గుడిగా కూడా కొందరి నమ్మకం.

ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లలో కూడా ఒక కుక్కల గుడి ఉంది. ఈ గుడి నిర్మించడానికి కూడా ఒక కథనం ఉంది. chala సంవత్సరాల క్రితంనాటి కథనం. ఝాన్సీ జిల్లాలో ఇరుగుపొరుగు గ్రామాలైన రేవన్, కక్వారా గ్రామాల్లో పెద్ద పండుగ జరిగింది. రెండు గ్రామాల ప్రజలు పండుగ సంబరాల్లో మునిగి ఉన్నారు. ఉత్సాహంగా ఆటపాటలలో మునిగిపోయారు. ఆ సమయంలో ఒక కుక్క chala ఆకలితో తనకు తినడానికి ఏదైనా దొరుకుతుందేమోనని రెండు గ్రామాల్లోను  తిరగసాగింది. కాని సంబరాల్లో మునిగిపోయిన రెండు గ్రామాల ప్రజలు దానిని పట్టించుకోలేదు. అలాగే ఆకలితో ఆ కుక్క ఆ రెండు గ్రామాల సరిహద్దుల్లో మరణించింది. సంబరాలు ముగిసిన తరువాత చనిపోయిన కుక్కను చూసి తమ పొరపాటు వలనే ఆ కుక్క మరణించిందని భావించి, తమ పాపానికి ప్రాయశ్చిత్తంగా దానికి గుడి కట్టి పూజలు చేస్తున్నారట.

పిల్లికీ ఉందో గుడి

జపాన్ లోని టోక్యోలో పిల్లి గుడి  అత్యంత ప్రసిద్ధమైనది. అదే గొటుకూజి టెంపుల్. పూర్వం ఆ ప్రాంత రాజు అటుగా వెళ్తూ విశ్రాంతి తీసుకోడానికి అక్కదున్న చెట్టు కింద ఆగాడు. అక్కడే ఉన్న ఒక పిల్లి తన సైగలతో ఆ రాజును కొంతదురానికి తీసుకుపోయింది. అల తీసుకుపోయిన వెంటనే పెద్ద ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలయింది. దాంతోపాటు ఆ రాజు ముందు నిలబడిన ప్రదేశంలో పిడుగు పడి ఆ ప్రాంతమంతా భీభత్సంగా మారిపోయింది. కోటి తనను ఆ ప్రదేశం నుంచి దూరంగా తీసుకురాకపోతే ఏమయేదో అర్ధమయిన రాజుకి అ పిల్లి చేసిన ఉపకారం ఎంత గొప్పదో అర్ధమయింది, తన ప్రాణాలను కాపాడిన అ పిల్లిని దేవతగా భావించి దానికి ఒక గుడిని కట్టి పూజలు మొదలుపెట్టాదు. అలా క్రమంగా ఆ ప్రాంత ప్రజలందరికీ అ గుడిలోని పిల్లిని అదృష్ట దేవతగా భావిం  చి పూజలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడా గుడి జపాన్లో ఎంత ప్రముఖంగా మారిందంటే ఎక్కడెక్కడినుంచో వచ్చిన జనం పిల్లికి మొక్కులు మొక్కుకొని వెళ్తారు. అ గుడి ప్రాంగణంలో సైగ చేస్తున్నట్టుగా ఉన్న వేలాది పిల్లి బొమ్మల అమ్మకాలు జరుగుతాయి. వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక బొమ్మ కొనుక్కొని వెళ్తారు. సైగ చేస్తున్న పిల్లిబొమ్మ అదృష్ట సూచిక అని బలంగా నమ్ముతారు జపనీయులు.

వాన గుడి

పేరు చూసి ఇదేదో వరుణదేవుడి గుడి అనుకోకండి. నిజానికి ఇది జగన్నాధస్వామి గుడి. కాని స్థానికులకు మాత్రం ఇది వన గుడి. ఇదేంటి.... మళ్ళి ఈ మేలికేంటి అనుకుంటున్నారు కదూ.... ఇది అవడానికి జగన్నాధస్వామి ఆలయమే అయినా, చిత్రంగా ఈ ఆలయం వాన రాకడ, పోకడ ముందే చెప్పేస్తుందట. ఆ ఆలయ పైకప్పు నుంచి పడే నీటిబిందువులని బట్టి  ఆ సంవత్సరం వర్షాలేలా పడతాయి అన్న విషయం తెలిసిపోతుందట. పైకప్పు ఉపరితలం నుంచి పడే నీటిబిందువులు పెద్దగా ఉంటే బాగా వానలు కురుస్తాయని, బిందువులు చిన్నగా ఉంటే అనావృష్టి ఉంటుందని స్థానికుల నమ్మకం. అసలా బిందువులు అల ఎలా రాలుతున్నాయి... ఎక్కడినుంచి రాలుతున్నాయి... అన్న విషయాలపై ఇప్పటికే ఎన్నో పరిశోధనలు జరిగాయట. కాని దాని రహస్యాన్ని మాత్రం ఛేదిం చలేకపోయాయి.

విమాన ఆలయం

నమ్మకాలకు కాదేదీ అతీతం అనడానికి  పంజాబ్ లోని జలంధర్ జిల్లాలో తల్హాం గ్రామంలో ఉన్న విమాన ఆలయం ఉదాహరణగా చెప్పొచ్చు. నిజానికి ఇది షహిద్ బాబా నిహాల్ సింగ్ గురుద్వారా. కాని స్థానికులకు మాత్రం ఏరోప్లేన్ టెంపుల్. విదేశాలకు వెళ్ళే ఉన్నవారు ఇక్కడికొచ్చి ఒక చిన్న విమాన బొమ్మను నైవేద్యంగా సమర్పించినట్టయితే విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు మెరుగుపడతాయని వారి నమ్మకం. అందుకే నిత్యం ఎంతోమంది ఇక్కడకొచ్చి విమానబొమ్మలను సమర్పించి తమ విదేశీ ప్రయాణ ప్రయత్నాలు సఫలం చేయమని మొక్కుకుంటారు.

బుల్లెట్ గుడి

రాజస్తాన్ లోని పాళీ జిల్లాలో ఓంబన్నా గుడిలో పూజలందుకునేది ఒక బుల్లెట్. బుల్లెట్టే అక్కడి దైవం. విచిత్రంగా లేదూ..... ఇంతకీ విషయమేంటంటే 1988 లో ఓం బన్నా అనే వ్యక్తీ తన బుల్లెట్ మీద వెళుతూ ప్రమాదంలో చనిపోయాడట. సరే యధాప్రకారం పోలీసులు ప్రమాదం జరిగిన వాహనాన్ని తీసుకుపోయి పోలిస్ స్టేషన్ లో ఉంచారు. ఆ మర్నాడు చూస్తే స్టేషన్ లో బుల్లెట్ లేదు.

ఎక్కడయితే ప్రమాదం జరిగిందో అక్కడ ఉందట. సరేలెమ్మని మళ్లి వాహనాన్ని స్టేషన్ కు తరలించారు. మళ్లి యధాప్రకారం బుల్లెట్ తన స్థానానికి చేరుకుంది. ఎన్నిసార్లయినా ఇదే పరిస్తితి. దాంతో ప్రమాదంలో చనిపోయిన ఓంబన్నా ఆత్మ అక్కడే తిరుగుతోందని అదే ఇలా చేస్తోందని ప్రజలు నమ్మడం మొదలుపెట్టారు. ఇంకేముంది వెంటనే ఆ బుల్లెట్ కి గుడి కట్టి పూజలు మొదలుపెట్టేశారు.

ఇవేకాదు, పాములగుడి, కోతులగుడి ఇలా చాలానే ఉన్నాయి. మనిషి నమ్మకాలూ వింతపుంతలు పోతున్నంతవరకు ఇలాంటి గుడులు పుట్టుకొస్తూనే ఉంటాయేమో.....  

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి