' శ్రావణ శ్రీ ' (ఖండిక)
శ్రీరస్తు!
శ్రావణమాసం వచ్చిందంటే ప్రకృతికి పులకింత. చిరు చిరు జల్లులతో మేనులకు
శ్రీరస్తు!
శ్రావణమాసం వచ్చిందంటే ప్రకృతికి పులకింత. చిరు చిరు జల్లులతో మేనులకు
గిలిగింత. రైతన్నకు ఆనందపు తుళ్ళింత. స్త్రీలకు, బాలికలకు సామాజిక కలయికలకు వేదికైన పేరంటాలు, నోములు, వ్రతాలతో కేరింత. ఎక్కడ చూసినా పచ్చదనమే శ్రావణంలో. బాలికల, తరుణుల, స్త్రీల కాళ్ళకు పేరంటాల పసుపుతో పసుపు పచ్చ శోభ, పొదలకు, తీవెలకు, చెట్లకు ఆకుపచ్చని శోభ, మొలకలెత్తే చివుళ్ళతో, తలలెత్తే మొగ్గలతో. కొత్తకోడలి బుగ్గలకు ఆషాఢమాసపు అడ్డంకులు తొలిగి మగని దర్శనంతో సిగ్గుల శోభ. జల్లులకు ఝల్లనే చల్లనిగాలికి తట్టుకోలేని వారికియిప్పటిదాకా మడతపెట్టి దాచిపెట్టి బయటకు తీసిన రగ్గుల శోభ! శ్రావణ భాద్రపదాలతో పండుగల ఊపు అందుకుంటుంది.
శ్రావణ భాద్రపదంబుల
దీవనల సువాసినులుగ
శ్రావణ భాద్రపదంబుల
తావుల విరి కళల ఝరుల దనరెడితరులన్
దీవెనలిడు సిరి గణపతి
దేవుల కొలువగుత భరత దేశమునందున్ (కం)
శ్రావణ భాద్రపద మాసాలలో పొదలలో తీగలలో పూలకళతో, వాగుల, ఏరుల, నదుల గలగలలతో, పచ్చ పచ్చగా చెట్లు మురిసిపోతాయి. ఆశీస్సులిచ్చే గౌరి, లక్ష్మి, గణపతుల కొలువు అవుతుంది భారత దేశంలో, విశేషించి తెలుగువారి ఊళ్ళల్లో.
శ్రావణ శుభ భృగువారము
పావన మరుదెంచె నలరి భార్గవి కరుణన్ శ్రావణ భాద్రపద మాసాలలో పొదలలో తీగలలో పూలకళతో, వాగుల, ఏరుల, నదుల గలగలలతో, పచ్చ పచ్చగా చెట్లు మురిసిపోతాయి. ఆశీస్సులిచ్చే గౌరి, లక్ష్మి, గణపతుల కొలువు అవుతుంది భారత దేశంలో, విశేషించి తెలుగువారి ఊళ్ళల్లో.
శ్రావణ శుభ భృగువారము
దీవనల సువాసినులుగ
గావగ నోములఁ శుభములఁ గాంచుడి మహిళల్! (కం)
శుభప్రదమైన శ్రావణ శుక్రవారం(తొలి శుక్రవారం ఈ రోజు) వచ్చేసింది. శ్రీలక్ష్మి కరుణతో దీవెనలతో మాంగళ్యశోభతో కళకళలాడడంకోసం, నోములతో శుభములను మహిళలు పొందెదరు గాక.
శ్రావణ మరుదెంచె నడచు
శుభప్రదమైన శ్రావణ శుక్రవారం(తొలి శుక్రవారం ఈ రోజు) వచ్చేసింది. శ్రీలక్ష్మి కరుణతో దీవెనలతో మాంగళ్యశోభతో కళకళలాడడంకోసం, నోములతో శుభములను మహిళలు పొందెదరు గాక.
శ్రావణ మరుదెంచె నడచు
పూవనములు ముదితలు విరబూసిన నగవుల్
పోవలె పేరంటము లిక
తావుల ఘుమ ఘుమల గుములు తరుణుల సభలన్ (కం)
శ్రవణం వచ్చేసింది. స్త్రీలు నడిచే పూలవనాలు, వారి నవ్వులే విరబూసిన పువ్వులు.యిక పేరంటాలకు పోవడం మొదలు. స్త్రీల సమావేశాలలో, పేరంటాలలో, పొదలలో విరుల ఘుమఘుమలు మొదలిక.
బారులు తీరె నాకమొకొ భవ్యము హైందవ రత్నభూమియో
తీరిన వారు దేవతలొ తీయని పల్కులొ తేనె చిల్కులో
తీరెను సంశయంబు లిక తీయ తెనుంగుల ఆడుబిడ్డలౌ
వారలు శ్రావణాన చనువార లహో! పదిమైళ్ళ కైదువుల్ (ఉ)
యిది హైందవ రత్న భూమియా, స్వర్గమా అని, ఆ బారులుతీరినవారు దేవతలా లేక మానవ కాంతలా అని, ఆ తీయనివి వారి పల్కులా, విరితేనెల చినుకులా అన్న సందేహం తీరిపోయింది. ఆ బారులు తీరినవారు తీయని తెనుగింటి ఆడపడుచులు. వారు ఐదువలు

అంటే సువాసినులైన సుమంగళ మూర్తులు. పసుపూ కుంకుమకోసం పదిమైళ్ళు వెళ్ళాలి. అనేది పవిత్రమైన తెలుగు సామెత. అలా వెళ్ళాలి అనే అందమైన కోరికను అణువణువునా నింపుకున్న భారత మాతృమూర్తులు, తెనుగు తల్లులు వారు!
పులకల సరసపు పురుషులు
మొలకల పెసలును శనగలు మోమున తళుకుల్
చిలికెడు తరుణులు మరులును
సెలలు నదులు మదులు పొదలు సెగ శ్రావణమౌ (కం)
సరసపు పులకలతో పురుషులు, మొలకలతోపెసలు, శెనగలు, ముఖాలలో తళుకులతో తరుణులు, సెలలయ్యే నదులతో, పొదలతో, మరులతో శ్రవణం సెగ పెడుతుంది!
చానల సోకు పైటతెరఁ చాపముఁ చాపను చేడె కన్నులన్
పసిడి వెలుగు లెచట పసిదనం బెచ్చటా
విసుగు లిచట నాటి విందు లెచట? (ఆ.వె.)
అమ్మవేలును పట్టుకుని ఆత్రంగా వెళ్ళే పెసల శనగల పిసినారి పిల్లడు ఒకడు.పోతు పేరంటమా? పోరా పిల్లాడా అని ముద్దుగా సరదాగా కసిరితే బుంగమూతి పెట్టిన ముద్దు బుడతడు ఒకడు. నాకు పండ్లు, శెనగలు, పెసల వాయినము యివ్వవా అంటే, లేదు అనడంతో నోరు తెరిచి పెద్దగా ఏడ్చే, కుమిలేవాడు మరొకడు. అమ్మా! నాకు అరటిపండ్లు ఇవ్వలేదేంటే అని రొమ్ము బాదుకుని, రొప్పే రోజేవాడు మరొకడు.

వానలఁ నవ్వులన్ పువులవన్, వరెవా! కురులందు మేఘముల్
లీనము, శ్రావణాం బుదము, లీగతి జేతుమటన్న మన్మథుం
డానన మూపె భేషనుచు డాసెను శ్రావణ మాసమేఘముల్ (ఉ)
స్త్రీల పవిటలమాటున నీ చెరకు వింటిని, నీ జెండా గురుతైన చాపను వారి కనులలో, మా వానలను వారి నవ్వుల పూలవానలుగా, యిలా చేద్దాము అన్నాయి శ్రావణమేఘాలు మన్మథునితో. భేష్! అలాగే అని తల పంకించాడు మన్మథుడు. శ్రావణమేఘాలు

వచ్చిపడ్డాయి.
అమ్మ వేలును బట్టి ఆతురంబుగ జను
అమ్మ వేలును బట్టి ఆతురంబుగ జను
పెసలు శనగలకై పిసిని యొకడు
పోతు పేరంటమా? పోర పిల్లడ యన్న
బుంగమూతిగ ముద్దు బుడత యొకడు
వాయినంబుల నివ్వవా యన్న లేదన్న
వా తెరచి కుమిలి వగచు నొకడు
అమ్మ నాకెక్కడే అరటి పండ్లని యంచు
రొమ్ము బాదుకు రొప్పి రోజునొకడు (సీ)
దొంగలెవరు నన్ను దోచిరో అక్కటా
పొందు టెట్లు కోలుపోతి ధనము దొంగలెవరు నన్ను దోచిరో అక్కటా
పసిడి వెలుగు లెచట పసిదనం బెచ్చటా
విసుగు లిచట నాటి విందు లెచట? (ఆ.వె.)
అమ్మవేలును పట్టుకుని ఆత్రంగా వెళ్ళే పెసల శనగల పిసినారి పిల్లడు ఒకడు.పోతు పేరంటమా? పోరా పిల్లాడా అని ముద్దుగా సరదాగా కసిరితే బుంగమూతి పెట్టిన ముద్దు బుడతడు ఒకడు. నాకు పండ్లు, శెనగలు, పెసల వాయినము యివ్వవా అంటే, లేదు అనడంతో నోరు తెరిచి పెద్దగా ఏడ్చే, కుమిలేవాడు మరొకడు. అమ్మా! నాకు అరటిపండ్లు ఇవ్వలేదేంటే అని రొమ్ము బాదుకుని, రొప్పే రోజేవాడు మరొకడు.
యిది మగపిల్లల హడావిడి శ్రావణంలో, ఒకప్పుడు, మధురమైన కాలం ఉన్నప్పుడు, కవి చిన్నప్పుడు. అందుకే ఏ దొంగలు నా పసిదనం అనే ధనం దోచుకున్నారో, ఎలా తిరిగిపొందడం, ఆ బంగారు బాల్యపు వెలుగు లెక్కడ? నా బాల్యం, అమూల్యం, అదెక్కడ? నాటి విందులు ఎక్కడ? యిప్పుడు విసుగులే యిక్కడ అని బాధ కవికి.
ఆషాఢము గతియించెను
యోషా మగనిల్లు జొరుట యొప్పును నిజమౌ
భూషాదులు గద కోడల!
భాషాదులలో వినయము భద్రము తల్లీ! (కం)
ఆషాఢమాసం వెళ్ళిపోయింది. యిక అత్తగారింటి గడప తొక్కొచ్చు! ఓ కొత్త కోడలా! పలుకు, నడత మొదలైనవాటిలో అణకువ, వినయము యివే నిజమైన ఆభరణాలమ్మా! జాగ్రత్త తల్లీ, శుభం తల్లీ అని కోత్తకోడలికి జాగ్రత్తలు, ఆశీస్సులు.
అత్తరు లలదగ నేటికి
మెత్తని పలుకుల పరిమళ మెత్తిన చాలున్
పుత్తడి బొమ్మా అమ్మగ
అత్తను గనుమమ్మ మగని యమ్మయు నమ్మౌ (కం)
అత్తరులు పూసుకోవడం ఎందుకు, అక్కర్లేదు. మెత్తని పలుకుల పరిమళం చాలు, అదే నిజమైన పరిమళం. ఓ పుత్తడి బొమ్మా! అత్తను కూడా అమ్మను చూసినట్లే చూసుకో. నీ మొగుడి తల్లి నీకూ తల్లివంటిదే!
అత్తయు నొకనాడు మరొక
అత్తకు కోడలు కొమరిత యౌనది ఒకచోఁ
అత్తగ కోడలిని గనకు
మెత్తగ కూతురుగ గనుము మేలగునత్తా! (కం)
అత్తా! ఇప్పుడంటే నువ్వు అత్తవు ఐనావు కానీ, ఒకనాడు నువ్వూ ఒక అత్తకు కోడలివే, మరిచిపోకు. అప్పుడు కోడలుగా నీకున్న ఆశలు, కోరికలు, సరదాలు, ఆరోగ్యము, అనారోగ్యము అన్నీ యిప్పుడు నీ కోడలికి కూడా ఉంటాయి. అత్తలాగా కోడలిని చూసినట్టు చూడకు, అసలే కొత్త చోటు, కొత్త కొత్త మనుషులు, పిల్ల కంగారు పడుతుంది. మెత్తగా, నీ కూతురును చూసినట్టే నీ కోడలిని కూడా చూడు, మేలు కలుగుతుంది నీకు, ఆమెకు, అందరికీ!
పట్టీ లాషాఢ ములవి
చిట్టీలవి వీలెపుడని చిరు చిరు కొసరుల్
పట్టీలిక శ్రావణమున
పట్టులనిక గుట్టు మట్టు పరువపు తెట్టుల్ (కం)
అప్పుడు ఆషాఢమాసంలో 'ఆషాఢ పట్టీ' అని కొత్తల్లుడికి చిరుకానుకల హడావిడి. ఆషాఢ మాసంలో కొత్త దంపతులు దూరంగా వారి వారి పుట్టిళ్ళల్లో ఉండడంతో, కలుసుకోవాలని, కబుర్లాడుకోవాలని కోరికలతో 'చిట్టీల' గిరాకీ అబ్బాయికీ అమ్మాయికీ మధ్య(సెల్ ఫోన్లు,

అంతర్జాలం లేనప్పుడు ఇలాంటి సరసపు సరదాలు ఉండేవి, ఒకప్పుడు, అప్పుడెప్పుడో!) యిప్పుడిక శ్రావణం వచ్చేసింది. యిప్పుడు 'శ్రావణ పట్టీ' పేరుతో అమ్మాయికి అత్తింటి బహుమానాల, కానుకల గిరాకీ. ఆషాఢపు అద్దంకి తొలిగిపోయింది కనుక, యిద్దరూ ఒక్క
దగ్గరికి చేరుకున్నారు కనుక, పరువాల తెట్టులు, గుట్టుమట్టులు, పట్టుకు చిక్కుతాయి అల్లుడుగారికి!
విరిసెను సరసులఁ కలువలు
కలువలు గద కలికి కనులు కనులన్ కలలన్
చెలియని తలపులు నగవులు
అలరెడి కళకళలు యింటి యల్లుని కనగన్ (కం)
శ్రావణమాసంలో వర్షాలతో నీరు నిండిన సరసులలో కలువలు విరిశాయి. మగని దర్శనంతో కలువలవంటి అమ్మాయి కనులు కూడా విరిశాయి. ఆమె కనులలో, కలలలో కూడా చెలికాని తలపులు, నగవులే! యిక అత్తగారి ఇల్లు కూడా అల్లుడుగారి దర్శనంతో కళకళలాడిపోయింది.
(కొనసాగుతుంది)
***వనం వేంకట వరప్రసాదరావు.